సార్క్ సదస్సుపై నేపాల్.. అదే సమయానికి నిర్వహిస్తాం..

సార్క్ సమావేశాలకు హాజరయ్యేది లేదని భారత్ తేల్చి చెప్పడంతో భారత్ పలు దేశాలు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్థాన్ దేశాలు కూడా సార్క్ సమావేశాలకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పేశాయి. దీంతో సార్క్ సమావేశాలు రద్దుచేసినట్టు నేపాల్లోని దౌత్య వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. అయితే ఇప్పుడు మళ్లీ నేపాల్ సరైన సమయానికే ఈ సదస్సు నిర్వహించాలని చూస్తోంది. ఈసారి  సమావేశాల బాధ్యత నేపాల్ పైనా ఉన్నందున ముందు రద్దుచేయాలని చూసినా.. మళ్లీ అదే సమయానికి నిర్వహించాలని ప్రయత్నిస్తుంది. ఇందుకు సభ్యదేశాలన్నీ సహకరించాలని గట్టిగా కోరింది. ఈ మేరకు బుధవారం రాత్రి తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీచేసింది. నవంబర్ 9, 10 తేదీలలో ఇస్లామాబాద్‌లో సార్క్ సదస్సు జరిగేందుకు తగిన వాతావరణాన్ని ఏర్పరచాలని అందులో తెలిపింది. మరి ఈ నిర్ణయంపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఏపీలో పట్టాలెక్కబోతున్న కొత్త రైళ్లు..

  కేంద్రం రైల్వే బడ్జెట్ లో ప్రకటించిన రెండు కొత్త రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్న్టట్టు తెలుస్తోంది.  వీటిలో హమ్‌సఫర్‌, ఉదయ్‌ పేర్లతో.. రెండు రైళ్లు ఆంధ్రప్రదేశ్లో కూతపెట్టనున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త టైంటేబుల్‌లో మొత్తం 20 కొత్త రైళ్లు ఉండగా.. వాటిలో రెండు హమ్‌సఫర్‌, ఉదయ్‌ రైళ్లు ఏపీకి రానున్నాను. ఇందులో ఏపీకి తిరుపతి-జమ్ముతావి హమ్‌సఫర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-విజయవాడ మధ్య ఉదయ్ రైళ్లకు స్థానం కల్పించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇవి కాకుండా రాష్ట్రం మీదుగా ప్రయాణించే రైళ్లు మరో ఆరు వరకు ఉన్నట్టు తెలిసింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు బడ్జెట్‌లో పేర్కొన్న హమ్‌సఫర్, ఉదయ్, తేజస్, అంత్యోదయ రైళ్లను అక్టోబరు నుంచి దశల వారీగా పట్టాలెక్కించాలని రైల్వే నిర్ణయించింది.   తిరుపతి-జమ్ముతావి మధ్య నడిచే ‘హమ్‌సఫర్’లో అన్ని కంపార్ట్‌మెంట్‌లు థర్డ్ క్లాస్ ఏసీతో ఉంటాయి. సాధారణ రైలు చార్జీలతో పోలిస్తే ఇందులో టికెట్ ధర 20 శాతం అధికంగా ఉంటుంది. రైలులో వైఫై కూడా ఉంటుంది. వారంలో ఓ రోజు తిరుపతి నుంచి బయలుదేరే ఈ రైలు మార్గం మాత్రం ఇప్పటి వరకు ఖరారు కాలేదు.   ఇక విశాఖపట్నం-విజయవాడ మధ్య నడిచే ‘ఉదయ్’ డబుల్ డెక్కర్ ఏసీ రైలు. రద్దీ మార్గాల్లో రాత్రి వేళల్లో బయలుదేరి ఉదయానికి గమ్యస్థానం చేరుకోవడంమే ఈ రైలు లక్ష్యం. అయితే విజయవాడ-విశాఖపట్నం మధ్య ఏ వేళలో తిప్పాలన్న దానిపై ఇప్పటి వరకు అధికారుల్లో స్పష్టత లేదు.

తప్పిన ముప్పు.. క్షేమంగా తీరానికి చేరిన నౌక

సాంకేతిక లోపం కారణంగా బంగాళాఖాతంలో అండమాన్‌ మార్గంలో ప్రయాణికులతో వెళుతున్న నౌక ఒకటి మధ్యలోనే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నౌకకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా తీరానికి చేరింది. దాదాపు 600 మంది ప్రయాణికులు విశాఖ పోర్టు నుంచి నౌక ప్రయాణం ద్వారా అండమాన్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సముద్రంలోనే లోపాన్ని సరిదిద్దేందుకు సాంకేతిక నిపుణులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో తిరిగి మంగళవారం అర్ధరాత్రి విశాఖ తీరానికి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులు కూడా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. నౌకను బాగు చేసిన అనంతరం అండమాన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పోర్టుకు చేరుకున్న జాయింట్ కలెక్టర్ పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సాంకేతిక నిపుణులు నౌకను బాగు చేసే పనిలో ఉన్నారని చెప్పారు. సమస్య పరిష్కారానికి మరో 6 నుంచి 7 గంటల సమయం పడుతుందని తెలిపారు.

సార్క్ సమావేశాలు రద్దు..

  నవంబర్ లో పాకిస్థాన్ లో జరగనున్న సార్క్ సమావేశాలు రద్దయ్యాయి. సార్క్ సమావేశాలకు హాజరు కావట్లేదని భారత్ ప్రకటించిన నేపథ్యంలో భార‌త్‌తోపాటు బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌లు కూడా హాజరుకాబోమని తేల్చిచెప్పేసింది. ఈసారి సమావేశాల బాధ్యత నేపాల్ పైనా ఉన్నందున నాలుగు దేశాలు పాల్గొనని నేపథ్యంలో సమావేశాలు నిర్వహించే ప్రసక్తి లేదని.. సమావేశాలు రద్దు చేస్తున్నట్టు నేపాల్లోని దౌత్య వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. స‌మావేశాల‌ ర‌ద్దు ప్ర‌క‌ట‌న‌కు కావాల్సిన లాంఛ‌నాల‌ను పూర్తి చేసి అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని ఖాట్మండులోని దౌత్య వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే దీనిపై నేపాల్ మాత్రం ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేదు.

సుబ్రతారాయ్ కు కోర్టులో ఊరట.. పేరోల్ పొడిగింపు..

సహారా ఇండియా అధినేత సుబ్రతోరాయ్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుబ్రతారాయ్ పేరోల్ ను అక్టోబర్ 24 వరకూ పొడిగిస్తూ తీర్పు నిచ్చింది. ఇటీవల కోర్టు సుబ్రతోరాయ్ పెరోల్ రద్దు చేసి ఆయనను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయన తల్లి మరణించిన నేపథ్యంలో పెరోల్ మంజూరు చేయగా..పెరోల్ కింద బయటకు రావడానికి అనుమతినిచ్చింది. దానితో పాటు సుబ్రతోరాయ్ న్యాయస్థానం విధించిన గడువులోగా ష్యూరిటీ చెల్లించాలని సూచించింది. కానీ సుబ్రతారాయ్ ష్యూరిటీ చెల్లించని నేపథ్యంలో ఆయన పెరోల్ రద్దు చేసి.. అదుపులోకి తీసుకోమని చెప్పింది. దీనిపై మరోసారి సుప్రీంను ఆశ్రయించగా.. సుబ్రతారాయ్ కు పేరోల్ గడువు పొడిగిస్తూ తీర్పునిచ్చింది.

రైల్వే ఉద్యోగులకు కేంద్రం బంపరాఫర్..దసరా బోనస్

  రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. దసరా పండుగు సందర్బంగా రైల్వే సిబ్బందికి 78 రోజుల బోనస్ అందనుంది. రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడి ఉన్న బోనస్ (పీఎల్ బీ) ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈసందర్భంగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. దసరా పండగ ముందే ఉద్యోగులకు బోనస్ అందిస్తామని చెప్పారు. కాగా, గత ఏడాది వరకు పీఎల్ బీపై ఉన్న పరిమితి రూ.3,500 నుంచి రూ.7వేలకు పెరగడంతో ఈ ఏడాదిలో ఉద్యోగులు అందుకోనున్న బోనస్ కూడా బాగానే పెరిగింది. ప్రతి ఉద్యోగికి దాదాపు రూ.18 వేల చొప్పున బోనస్ లభించనుంది. ఈ బోనస్ ద్వారా దాదాపు 13 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.

సుప్రీం తీర్పును కూడా తోసిపుచ్చేందుకు కర్ణాటక సర్కార్...

  కావేరి జలాలపై సుప్రీం కోర్టు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారా? రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కర్ణాటకపై ఉందని, శాంతి భద్రతల అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని చీవాట్లు పెట్టింది. అయితే ఇప్పుడు సుప్రీం తీర్పును మరోసారి కర్ణాటక ప్రభుత్వం తోసిపుచ్చేట్టు కనిపిస్తోంది. తమిళనాడుకు ఖచ్చితంగా నీరు ఇవ్వాల్సిందే అన్న తీర్పుపై క‌ర్ణాట‌క‌ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ‌రామ‌య్య ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సుప్రీం ఆదేశాల‌పై చ‌ర్చించిన క‌ర్ణాట‌క రాజ‌కీయ పార్టీలన్నీ త‌మిళ‌నాడుకు నీటిని విడుద‌ల చేయ‌రాద‌నే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. దీంతో అఖిల‌ప‌క్షంలో వ‌చ్చిన అభిప్రాయాన్నే పాటించాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. మరి ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా తాము ముందుగా ఆదేశించినట్లే 6 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు కర్ణాట‌క‌ విడుదల చేయాల్సిందేన‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఒక నెలలో 15 రోజులు సెలవులు వస్తే..

రోజూ ఆఫీసులకూ, స్కూళ్లకూ, కాలేజీలకూ వెళ్లేవారు అబ్బా రోజూ వెళ్లాలా.?? ఇవాళ సెలవొస్తే బావుండు అనిపిస్తుంటుంది. ఒక రోజు వర్కుండి..మరో రోజు సెలవుంటే . ఇలాంటి వారి కోరికను తీర్చేందుకు రెడీ అయ్యింది, ఈ ఏడాది అక్టోబర్ నెల. ఒకే నెలలో 5 శనివారాలు, 5 ఆదివారాలు, 5 సోమవారాలు, నాలుగు పండుగలు రావడం ఎప్పుడైనా చూశారా.? కనీసం విన్నారా..? ఈ సారి మీరు ఆ విచిత్రం చూడబోతున్నారు. కాకతీయ రాజుల కాలంలో జరిగిన ఆ వింత ఇప్పుడు మనల్ని పలకరించడానికి వస్తోంది. సరిగ్గా 863 సంవత్సరాల క్రితం అంటే 1153వ సంవత్సరంలో ఒకే నెలలో నాలుగు పండుగలు, 5 శనివారాలు, 5 సోమవారాలు, 5 ఆదివారాలు రాబోతున్నాయి. ఇదే నెలలో బతుకమ్మ, దసరా, పీర్ల పండుగ, దీపావళి వంటి పండుగలు వస్తున్నాయి. ఇక రెండో శనివారం కూడా కలిసి రావడంతో..స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు సెలవులే..సెలవులే. అంటే నెలలో సగం రోజులే వర్కింగ్ డేలన్న మాట.   ఆదివారాలు            :    2,9,16,23,30 సోమవారాలు          :    3,10,17,24,31 శనివారాలు            :    1,8,15,22,29 బతుకమ్మ, దసరా    :     అక్టోబర్ 11 పీర్ల పండుగ           :     అక్టోబర్ 12 దీపావళి               :     అక్టోబర్ 30

భారత్ నిర్ణయాలతో వణికిపోతున్న పాకిస్థాన్...

  భారత్ తీసుకుంటున్న నిర్ణయాలకు పాకిస్థాన్ వణికిపోతోంది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందంపై.. ఆ తరువాత పాకిస్థాన్ కు ఇచ్చిన మోస్ట్ ఫేవ‌ర్డ్ నేష‌న్ (అత్యంత అనుకూల దేశం) హోదాను పునఃస‌మీక్షించాల‌ని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దౌత్యపరమైన యుద్ధానికి దిగింది. అయితే భారత్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలపై స్పందించిన నవాజ్ షరీఫ్ సలహాదారు సర్తాజ్ భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్థాన్ పై యుద్ద చర్యగానే భావిస్తున్నామని అన్నారు. ఇంకా సింధూ జలాల ఒప్పందంపై మాట్లాడుతూ.. 'అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్‌ ఏకపక్షంగా  ఈ ఒప్పందం నుంచి తప్పుకోలేదు'.. ఈ ఒప్పందాన్ని భారత్‌ ఉల్లంఘిస్తే.. తాము అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొంది. ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు నది ఒప్పందాన్ని భారత్‌ ఏకపక్షంగా రద్దు చేయలేదని, ఒప్పందాన్ని రద్దుచేయడానికిగానీ, ఒప్పందం నుంచి తప్పుకోవడానికిగానీ ఎలాంటి నిబంధనలు లేవని, ఇది కుదరదని సర్తాజ్‌ అజిజ్‌ పేర్కొన్నారు.

ముందు మీ డబ్బు వాడండి.. తెలుగు రాష్ట్రాలకు వెంకయ్య సలహా

  గత రెండు మూడు రోజుల కిందట భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్ని ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాల వల్ల ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. ముఖ్యంగా రైతుల పంటపొలాలు మొత్తం నీటితో మునిగిపోయి తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు దీనిపై స్పందించిన వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేశారు. తాను స్వయంగా వరదల్లో మునిగిన ప్రాంతాలను పరిశీలించాలని.. కురిసిన భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. అంతేకాదు.. కేంద్రం నుంచి వచ్చే సాయం కోసం ఎదురుచూడకుండా రాష్ట్రాల వద్ద ఉన్న విపత్తు నిధి నుంచి డబ్బు ఖర్చు చేసి బాధితులను ఆదుకోవాలని ఏపీ, తెలంగాణ సీఎంలకు సలహా ఇచ్చారు. పంట నష్టం అంచనాలపై కేంద్ర మంత్రులకు తాను వివరించి చెప్పానని, కేంద్ర బృందాలను పంపాలని సిఫార్సు చేశానని వివరించారు. రెండు రాష్ట్రాలూ పంట నష్టం అంచనాలను పంపిన తరువాత అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని చెప్పారు.

బీసీసీఐ కి సుప్రీం వార్నింగ్..

  బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా)కి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. లోధా కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్ననేపథ్యంలో సుప్రీం బీసీసీఐ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. లోధా కమిటీ తాము ఇచ్చిన సిఫార్సులను బీసీసీఐ విస్మరించిందని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి టీఎస్ థాకూర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  బీసీసీఐ పెద్దలు తమకు తామే చట్టమని భావిస్తున్నట్టు అనిపిస్తోందని, వారిలా లోధా కమిటీ సిఫార్సులను పక్కన బెడతారని భావించలేదని ఆయన అన్నారు. ఈ సిఫార్సులకు బీసీసీఐ కట్టుబడి వుండాల్సిందేనని, లేకుంటే చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఫ్రెండ్ చనిపోయాడని ఆత్మహత్య చేసుకున్న ఫ్రెండ్..

  తన ఫ్రెండ్ ప్రమాదంలో చనిపోయాడన్న బాధను తట్టుకోలేక ఓ యువకుడు తాను ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాలోని కారంపూడి మండలం వేపకంపల్లి గ్రామానికి చెందిన రమేష్, హరికృష్ణ ఇద్దరు స్నేహితులు. ఇద్దరూ హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వారు ఈరోజు తెల్లవారుజామున  బైక్‌పై వెళ్తుండగా ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెనక కూర్చున్న రమేష్  యువకుడు మృతి చెందాడు. అయితే దీనికి మనస్తాపం చెందిన హరికృష్ణ.. రమేష్ చనిపోయిన కొద్దిసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్ మరణాన్ని తట్టుకోలేక భరత్‌నగర్‌లో రైలు పట్టాల దగ్గరకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా హరికృష్ణ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రమేష్ శ్రీ శ్రీ హోలిస్టిక్ ఆసుపత్రిలో ఉద్యోగి.

నడి సముద్రంలో ఆగిన నౌక.. భయంలో 600 మంది

  సాంకేతిక లోపం కారణంగా బంగాళాఖాతంలో అండమాన్‌ మార్గంలో ప్రయాణికులతో వెళుతున్న నౌక ఒకటి మధ్యలోనే నిలిచిపోయింది. ఉపాధి కోసం ఉత్తరాంధ్ర కూలీలు విశాఖ పోర్టు నుంచి నౌక ప్రయాణం ద్వారా అండమాన్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విశాఖకు 6 నాటికల్‌ మైళ్ల దూరంలో నౌక నిలిచిపోయినట్లు తెలుస్తోంది. నౌకలో దాదాపు 600 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే నౌక మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సమస్య పరిష్కారానికి మరో 6 నుంచి 7 గంటల సమయం పడుతుందని మర్చంట్‌ నేవీ అధికారులు వెల్లడించారు. నౌక మరమ్మతులు పూర్తయిన తర్వాత కూలీలను తిరిగి విశాఖ తీసుకు రావాలా లేక అదే నౌకలో అండమాన్‌ పంపాలా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని నేవీ అధికారులు చెప్పారు.

కష్టాల్లో సుబ్రహ్మణ్యస్వామి.. కేసు విచారణకు అనుమతి..

  ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ పులువురిని ఇబ్బందుల్లో పెట్టే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఇప్పుడు తాను ఇబ్బందుల్లో పడ్డారు. ఆయన రాసిన ఓ వ్యాసం నేపథ్యంలో పోలీసులు విచారించే పరిస్థితి వచ్చింది. అసలు సంగతేంటంటే.. ఐదేళ్ల నాడు ముంబైకి చెందిన ఓ పత్రికలో దేశంలోని ముస్లింలకు ఓటు హక్కును తొలగించాలని వ్యాసం రాయాలి. ఆయన రాసిన వ్యాసంపై నేషనల్ మైనారిటీ కమిషన్ సెక్షన్ 153-ఏ కింద కేసు నమోదు చేసింది. అయితే ఇప్పుడు ఈకేసుపై విచారించడానికి ఢిల్లీ పోలీసులకు అనుమతి లభించింది. ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రాగా, జస్టిస్ ఐఎస్ మెహతా వాదనలు విన్నారు. ముసాయిదా చార్జ్ షీట్ తయారైందని పోలీసులు చెప్పడంతో, స్వామిని విచారించేందుకు అనుమతించారు.

హిల్లరీ కూతురిని చూసి ఆగిపోయా..ఈసారి ముప్పతిప్పలు పెడతా..

  డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ల మధ్య తొలి ప్రెసిడెన్షియల్ మీటింగ్ జరిగిన సంగతి తెలసిందే. ఈ ముఖా ముఖి చర్చలో ఇద్దరి మధ్య మాటల యుద్దం బాగానే జరిగింది. దాదాపు తొంభై నిమిషాల పాటు జరిగిన ఈ చర్చలో హిల్లరీ క్లింటన్ దే కాస్త పైచేయిగా నిలిచినట్టు తెలుస్తోంది. అయితే దీనపై స్పందిన ట్రంప్ ఎప్పటిలాగే తనదైన శైలిలో హిల్లరీపై కామెంట్లు విసిరాడు. "నేను నిజంగా చాలా తగ్గి మాట్లాడాను. వాస్తవానికి నాకు ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలని లేదు అని అన్నారు. అంతేకాదు హిల్లరీ క్లింటన్ భర్త బిల్ క్లింటన్ గురించి ఆయన ప్రస్తావిస్తూ.. బిల్ క్లింటన్ కు ఎంతో మందితో సంబంధాలు ఉన్నాయి.. ఆయన రాసలీలల గురించి ఎత్తకూడదనే ఆగిపోయాను.. దానికి కారణం వారి కుమార్తె చెల్సియా.. కానీ ఆడియన్స్ లో చెల్సియా క్లింటన్ ఉంది. అందుకే ఆగిపోయా" అని అన్నారు.తదుపరి డిబేట్ కు మరిన్ని అస్త్రాలతో వచ్చి హిల్లరీని ముప్పుతిప్పలు పెడతానని చెప్పారు. మాజీ అధ్యక్షుడు, హిల్లరీ భర్త బిల్ క్లింటన్ రాసలీలలను ఎత్తి చూపుతానని హెచ్చరించారు.

సార్క్ సమ్మిట్ కు మేం రాం.. భారత్ కు మద్దతుగా పలు దేశాలు..

  ఉరీ దాడి అనంతరం భారత్-పాక్ పై బాగానే ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రత్యర్ధి దేశమైన పాకిస్థాన్ భారత్ కు పక్కలో బల్లెంలా ఉంటూ.. పలు దాడులకు పాల్పడుతుంది. గతంలో పఠాన్ కోట్ పై దాడి చేసి పలువురు జవాన్లను బలి తీసుకోగా.. ఇటీవల ఉరీ సైనిక స్థావరంపై దాడి పలువురు సైనికులను బలిగొన్నారు. దీంతో భారత్-పాక్ పై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతుంది. అందుకే పాక్ ను ఒంటరి చేయడానికి తగిన పన్నాగాలు చేస్తుంది. ఇప్పటికే పాక్ చేసిన పనికి అగ్రరాజ్యాలు సైతం ఆ దేశంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పటివరకూ సింధూ జలాలపై.. పాకిస్థాన్‌కు ఇచ్చిన మోస్ట్ ఫేవ‌ర్డ్ నేష‌న్ (అత్యంత అనుకూల దేశం) హోదాను పునఃస‌మీక్షించాల‌ని నిర్ణయం తీసుకున్న భారత్ ఇప్పుడు మరో నిర్ణయం తీసుకొంది. పాకిస్థాన్ పై దౌత్యపరమైన యుద్ధానికి దిగింది. దీనిలో భాగంగానే నవంబరులో పాకిస్థాన్ లో జరగాల్సిన సార్క్ సమావేశాలకు హాజరు కాబోమని భారత్ తేల్చి చెప్పేసింది. అయితే భారత్ కు చేసిన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది. భారత్ కు ఇతర సభ్యదేశాలు బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గనిస్థాన్ లు బాసటగా నిలిచాయి. తాము కూడా హాజరు కాబోమని చెప్పడంతో పాకిస్థాన్ ఒంటరైపోయింది. ఈ పరిస్థితుల్లో సార్క్ సమావేశాలు వాయిదా పడే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నాలుగు లారీల్లో వెలగపూడికి పైళ్లు..

  అక్టోబర్ 3 వరకూ హైదరాబాద్ నుండి ఉద్యోగులు ఏపీ రాజధాని అమరావతికి వచ్చేయాలని అక్కడి నుండే పాలన సాగించాలని ఆదేశాలు జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు శాఖలకు సంబంధించిన ఫైళ్లు అమరావతికి చేరుకోగా... ఇప్పుడు మరికొన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను రాజధానికి తరలించారు. మంగళవారం ఆర్థిక శాఖకు చెందిన ఫైళ్లు, కంప్యూటర్లను నాలుగు లారీల్లో హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలించారు. మరోవైపు సచివాలయంలోని రెండో బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న ఆర్థిక పరిపాలన చాంబర్‌లోని ఫైళ్లను కూడా సర్దుతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రణాళిక శాఖ ఫైళ్లు కూడా హైదరాబాద్ నుంచి వెలగపూడికి చేరతాయి. మున్సిపల్, హౌసింగ్‌, ఫైనాన్స్, ప్లానింగ్‌ శాఖలు ఇప్పటికే కొన్ని ఫైళ్లను స్కానింగ్‌ చేయగా, మిగిలి ఉన్నవాటిని ప్యాక్‌ చేసి తరలించడానికి సిద్ధం చేశారు.