తప్పిన ముప్పు.. క్షేమంగా తీరానికి చేరిన నౌక
posted on Sep 29, 2016 @ 10:11AM
సాంకేతిక లోపం కారణంగా బంగాళాఖాతంలో అండమాన్ మార్గంలో ప్రయాణికులతో వెళుతున్న నౌక ఒకటి మధ్యలోనే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నౌకకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా తీరానికి చేరింది. దాదాపు 600 మంది ప్రయాణికులు విశాఖ పోర్టు నుంచి నౌక ప్రయాణం ద్వారా అండమాన్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సముద్రంలోనే లోపాన్ని సరిదిద్దేందుకు సాంకేతిక నిపుణులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో తిరిగి మంగళవారం అర్ధరాత్రి విశాఖ తీరానికి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులు కూడా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. నౌకను బాగు చేసిన అనంతరం అండమాన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పోర్టుకు చేరుకున్న జాయింట్ కలెక్టర్ పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సాంకేతిక నిపుణులు నౌకను బాగు చేసే పనిలో ఉన్నారని చెప్పారు. సమస్య పరిష్కారానికి మరో 6 నుంచి 7 గంటల సమయం పడుతుందని తెలిపారు.