హిల్లరీ కూతురిని చూసి ఆగిపోయా..ఈసారి ముప్పతిప్పలు పెడతా..
posted on Sep 28, 2016 @ 11:19AM
డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ల మధ్య తొలి ప్రెసిడెన్షియల్ మీటింగ్ జరిగిన సంగతి తెలసిందే. ఈ ముఖా ముఖి చర్చలో ఇద్దరి మధ్య మాటల యుద్దం బాగానే జరిగింది. దాదాపు తొంభై నిమిషాల పాటు జరిగిన ఈ చర్చలో హిల్లరీ క్లింటన్ దే కాస్త పైచేయిగా నిలిచినట్టు తెలుస్తోంది. అయితే దీనపై స్పందిన ట్రంప్ ఎప్పటిలాగే తనదైన శైలిలో హిల్లరీపై కామెంట్లు విసిరాడు. "నేను నిజంగా చాలా తగ్గి మాట్లాడాను. వాస్తవానికి నాకు ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలని లేదు అని అన్నారు. అంతేకాదు హిల్లరీ క్లింటన్ భర్త బిల్ క్లింటన్ గురించి ఆయన ప్రస్తావిస్తూ.. బిల్ క్లింటన్ కు ఎంతో మందితో సంబంధాలు ఉన్నాయి.. ఆయన రాసలీలల గురించి ఎత్తకూడదనే ఆగిపోయాను.. దానికి కారణం వారి కుమార్తె చెల్సియా.. కానీ ఆడియన్స్ లో చెల్సియా క్లింటన్ ఉంది. అందుకే ఆగిపోయా" అని అన్నారు.తదుపరి డిబేట్ కు మరిన్ని అస్త్రాలతో వచ్చి హిల్లరీని ముప్పుతిప్పలు పెడతానని చెప్పారు. మాజీ అధ్యక్షుడు, హిల్లరీ భర్త బిల్ క్లింటన్ రాసలీలలను ఎత్తి చూపుతానని హెచ్చరించారు.