సార్క్ సదస్సుపై నేపాల్.. అదే సమయానికి నిర్వహిస్తాం..
posted on Sep 29, 2016 @ 11:08AM
సార్క్ సమావేశాలకు హాజరయ్యేది లేదని భారత్ తేల్చి చెప్పడంతో భారత్ పలు దేశాలు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్థాన్ దేశాలు కూడా సార్క్ సమావేశాలకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పేశాయి. దీంతో సార్క్ సమావేశాలు రద్దుచేసినట్టు నేపాల్లోని దౌత్య వర్గాలు ప్రకటించాయి. అయితే ఇప్పుడు మళ్లీ నేపాల్ సరైన సమయానికే ఈ సదస్సు నిర్వహించాలని చూస్తోంది. ఈసారి సమావేశాల బాధ్యత నేపాల్ పైనా ఉన్నందున ముందు రద్దుచేయాలని చూసినా.. మళ్లీ అదే సమయానికి నిర్వహించాలని ప్రయత్నిస్తుంది. ఇందుకు సభ్యదేశాలన్నీ సహకరించాలని గట్టిగా కోరింది. ఈ మేరకు బుధవారం రాత్రి తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీచేసింది. నవంబర్ 9, 10 తేదీలలో ఇస్లామాబాద్‌లో సార్క్ సదస్సు జరిగేందుకు తగిన వాతావరణాన్ని ఏర్పరచాలని అందులో తెలిపింది. మరి ఈ నిర్ణయంపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.