త్వరగా శక్తి రావాలంటే...?

1. ఆపిల్: రోజుకో ఆపిల్‌ పండు తింటే డాక్టరుకు దూరం అనేది నిజం. దీనిలో కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థాలు ఎక్కువే. చక్కెర శాతం తక్కువ. దీన్ని మధుమేహులు కూడా తినవచ్చు. దీనిలో శక్తినిచ్చే పదార్థమే కాకుండా దీనిలో పోషక విలువలు కూడా చాలా ఉన్నాయి. 2. అరటి: శక్తిని వెంటనే అందించే సామర్థ్యం దీని సొంతం. పొటాషియమ్‌, విటమిన్‌ సి, బి కాంప్లెక్స్‌ కూడా ఉన్నాయి. మలబద్ధకం ఉన్న వాళ్ళు రోజూ రాత్రి రెండు అరటిపళ్ళు తింటే విరేచనం సాఫీగా అవుతుంది. పిల్లలకు బాగా మెత్తగా పండిన పండు మేలు చేస్తుంది. త్వరగా అనారోగ్యం నుండి కోలుకుంటారు. 3. పైనాపిల్: ఎనర్జీని అందించడంలో మరో అద్భుతమైన పండు. అంతే కాదు శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను పుష్కలంగా అందిస్తుంది. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. 4. మామిడి: విటమిన్‌ ఎ, బిటాకెరోటిన్‌, బి కాంప్లెక్స్‌, విటమిన్‌ సి, ఐరన్‌, కాల్షియమ్‌, పొటాషియమ్‌, రోగనిరోధక శక్తి ఎక్కువ చేసే యాంటి ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. శక్తిని వెంటనే అందజేస్తుంది. దీనిలో పీచు (ఫైబర్‌) ఉండడం వల్ల, రక్త ప్రసరణకు, సాఫీగా విరేచనం కావడానికి తోడ్పడుతుంది. 5. బెర్రీస్: బెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దాంతో అవసరమైన క్యాలొరీలను పొందవచ్చు. ఒక కప్పు స్ట్రాబెర్రీ జ్యూస్ తాగడం వల్ల వెంటనే తాజా అనుభూతిని పొందవచ్చు. 6. ఆరెంజ్: వీటిలో విటమిన్‌ c, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీర సౌందర్యానికి కూడా చాలా మంచిది. పొటాషియమ్‌ ఎక్కువగా ఉండడం వల్ల అలసిపోయిన కండరాలకు, గుండెకు మేలు చేస్తుంది. దీన్ని మధుమేహ వ్యాధిగ్రస్థులు పుష్కలంగా వాడవచ్చు. ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వలన జీర్ణప్రక్రియకు, మలబద్ధకం నివారించేందుకు చాలా ఉపయోగపడుతుంది. 7. పుచ్చకాయ: వీటిలో పీచు పదార్థం జీర్ణప్రక్రియను సరిగ్గా ఉంచుతుంది. విటమిన్‌ సి, ఎ, ఐరన్‌, పొటాషియం, ఒక రకమైన తీపి పదార్థం ఉండడం వల్ల శక్తినిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరచి కాపాడుతోంది. దీన్ని మధుమేహం ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా తినవచ్చు. దీనిలో నీటి శాతం 90-95 శాతం వరకూ ఉంటుంది. ఎండాకాలంలో నీటి దప్పికకు ఇది గొప్ప ఉపశమనం. 8. బొప్పాయి: బొప్పాయిలో ఐరన్‌, పొటాషియమ్‌, కాల్షియమ్‌, విటమిన్‌ ఎ, సి, బి కాంప్లెక్స్‌ చాలా ఎక్కువగా ఉన్నాయి. మధుమేహులు కూడా వాడవచ్చు. రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది.

ఆడవారు ఈ నాలుగు పాటిస్తే.. అద్భుతమైన ఆరోగ్యం సొంతమవుతుంది!

ఆడవారు ఈ నాలుగు పాటిస్తే.. అద్భుతమైన ఆరోగ్యం సొంతమవుతుంది! ఆడవారి ఆరోగ్యం ప్రతి ఇంటికి పెద్ద బలం. ఆడవారు తమ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకుంటే ఇళ్లలో ఎన్నో పనులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతాయి. రోజువారీ జీవితంలో ఆడవారు ఫాలో అయ్యే కొన్ని విషయాలు మహిళల ఆరోగ్యాన్ని పాడు చేస్తే.. మరికొన్ని విషయాలు శారీరకంగా, మానసికంగా ఆడవారిని బలంగా మారుస్తాయి. ఆడవారు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి అంటే నాలుగు విషయాలు గుర్తుపెట్టుకొని, వాటిలో రోజూ పాటించాలి. కేవలం ఈ నాలుగు విషయాలు మొత్తం జీవన గతిని మార్చేసి అద్భుతమైన ప్రయాణానికి దోహదం చేస్తాయి.  ఆహారం ఫుల్లుగా తినొద్దు.. ఆడవారు ఎక్కువ పని చేస్తారు కానీ బాగా తినాలి అని అందరూ చెప్పేమాట. అయితే ఆహారం ఫుల్ గా తినడం వల్ల ఆడవారిలో ఊబకాయం, మధుమేహం తొందరగా వస్తాయి. అందుకే కేలరీల పరంగా తక్కువ కేలరీలు గల ఆహారాన్ని తీసుకోవాలి.  దీనివల్ల హృదయనాళాల ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తక్కువగానే ఉంటుంది.  వాకింగ్ పెంచాలి.. నడక అనేది తక్కువ ప్రభావ వ్యాయామం. దీని ఫలితాలు మాత్రం చాలా అగొప్పగా ఉంటాయి.  ఏ వ్యాయామం లేకపోయినా రోజూ వాకింగ్ చేసేవారి ఫిజికల్ స్ట్రేంగ్త్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, కేలరీలను బర్న్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. సాధారణ నడక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది, అభిజ్ఞా పనితీరును పెంచుతుంది. నవ్వు గొప్ప ఔషధం.. నవ్వు నాలుగు విధాల చేటు అనే మాట ఎప్పుడో తీరిపోయింది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున నవ్వును తరచుగా ఉత్తమ ఔషధంగా సూచిస్తారు. ఇది ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి, మానసిక స్థితిని పెంచడానికి, మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అదనంగా, నవ్వు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది, ఇది అనారోగ్యాన్ని నివారించడానికి సహాయపడుతుంది. నవ్వుతూ ఉంటే మానసిక ఒత్తిడులు క్రమంగా తగ్గిపోతాయి. కాబట్టి నవ్వు గొప్ప ఔషధం. అందరినీ ప్రేమించాలి.. ప్రేమించడం అనే మాటకు ఎప్పుడూ ఒకే అర్థం తీయకూడదు. సాటి మనుషులుగా అందరినీ అందరూ ప్రేమించవచ్చు. ఆ ప్రేమలో జాలి, కరుణ, బాధ్యత, ఒకానొక సమత్వ భావన తొంగిచూస్తాయి. సాధారణ పనులలో నిమగ్నమైన వ్యక్తులలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడం, మానసిక ఆరోగ్యం మెరుగుపరచడం, అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడం ఇలాంటి ప్రేమ వల్లనే సాధ్యమవుతుంది. ఇతరులలో ఒంటరితనం పోగొట్టి జీవితం మీద ఆశను కల్పించడంలో ఈ ప్రేమ  పాత్ర చాలా గొప్పది. కాబట్టి ఎదుటి వారితో ఆనందంగా, సంతృప్తిగా, సంతోషంగా మాట్లాడుతూ వారిని గౌరవించాలి. ఈ నాలుగు పనులు చేస్తే ఆడవారి ఆరోగ్యం పదికాలలపాటు పధిలంగా ఉంటుంది.                                    ◆నిశ్శబ్ద

పనితోపాటు ఆహారమూ ముఖ్యమే

  పనితోపాటు ఆహారమూ ముఖ్యమే ఉద్యోగం చేసే ఆడవారు ఇంట్లో, బయటా పని ఒత్తిడితో తమ ఆహారం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టరు. దాంతో వయసు పెరిగినకొద్దీ అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. రోజువారీ తీసుకునే ఆహారం విషయంలో చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. సాధారణంగా రెండుపూటలా తీసుకునే ఆహారంతోపాటు మధ్యమధ్యలో తప్పనిసరిగా ఏదో ఒకటి తింటుండాలిట. అయితే ఆ ఏదో ఒకటి అధిక క్యాలరీలని పెంచేది కాక ఆరోగ్యాన్నీ, శక్తినీ ఇచ్చేది అయితే మంచిది అంటూ కొన్ని సూచనలు చేస్తున్నారు. 1. సాయంత్రం వేళ ఆకలిగా అనిపించినప్పుడు సలాడ్ల వంటివి తీసుకోవాలి. సలాడ్ల వల్ల శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయి. ఆకలి తీరుతుంది కూడా. అందులోనూ క్యాబేజీని సలాడ్‌లో కలిపి తీసుకుంటే దీనిలోని ‘గ్లాటామైన్’ అనే అమినో యాసిడ్ చిన్న పేగు ఆరోగ్యంగా పనిచేసేట్టు చూస్తుంది. డైజేషన్ ఇబ్బందుల వంటివి తగ్గుతాయి. 2. బాదం, జీడిపప్పు తదితర డ్రై ఫ్రూట్స్ నేరుగా తీసుకోవడం వల్ల  కొలెస్ట్రాల్ సమస్య వుండదు. వీటిలో విటమిన్ ‘ఇ’తోపాటు మాంనీస్, విటమిన్ బి2, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్ ఉంటాయి. డ్రై ఫ్రూట్ర్‌ని మధ్యాహ్నం వేళ తీసుకుంటే శక్తి లభిస్తుంది. 3. వేరుశనగలు కూడా ఆరోగ్యానికి మంచివి. వీటిలో మాంసకృత్తులతోపాటు బి3, కాపర్, మాంగనీస్ వంటి పోషక విలువలు సమృద్ధిగా వుంటాయి. కాబట్టి వేరుశనగలని వేయించి లేదా ఉడికించి ఓ చిన్న బాక్సులో వేసుకుని ఆకలి అనిపించినప్పుడు నాలుగు గింజలు నోట్లు వేసుకుంటే చాలు ఆకలి తీరుతుంది. ఓపిక వస్తుంది. 4. ఇక పండ్లు తింటే శరీరంలోకి అనవసర కేలరీలు చేరవు. ఆకలి అదుపులో వుంటుంది. అరటిపండుని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు తీసుకుంటే రోజంతటికీ కావలసిన శక్తి లభించినట్టే. ఎందుకంటే అరటిపండ్లలోని కాల్షియం, ప్రొటీన్లు, ఐరన్‌లతోపాటు కార్బొహైడ్రేట్లు త్వరితగతిన శక్తినిస్తాయి. ఇక ఆపిల్స్‌లోని విటమిన్ ‘ఎ’, ఐరన్, బొప్పాయిలోని విటమిన్ ఎ, కె, ఇ తదితర పోషకాలు శక్తినివ్వడమే కాకుండా ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. 5. మొలకెత్తిన గింజల్ని ఓ గుప్పెడు నోట్లో వేసుకుంటే చాలు వీటిలో సమృద్ధిగా లభించే మాంసకృత్తులు శరీరానికి శక్తినిస్తాయి. చురుగ్గా వుంచుతాయి. ఇలా రోజు మొత్తంలో అప్పుడప్పుడు ఏదో ఒకటి నోట్లో వేసుకుంటే ఓపిక లేకపోవడం అన్న సమస్య వుండదు. బరువు పెరుగుతామనే భయమూ వుండదు. చలాకీగా రోజువారీ పనులు ఏ ఆటంకం లేకుండా చేసుకోవచ్చు. -రమ

మెనోపాజ్ సమయంలో మహిళలు ఈ ఆహారం తప్పక తీసుకోవాలి!

మెనోపాజ్ సమయంలో మహిళలు ఈ ఆహారం తప్పక తీసుకోవాలి! అమ్మాయిలలో 10 ఏళ్ల తరువాత మొదలయ్యే ఋతుచక్రం దాదాపు40 నుండి  45 ఏళ్ల వయసు వరకు కొనసాగుతుంది. ఈ ఋతుచక్రం ముగిసే సమయాన్ని మెనోపాజ్ అని చెబుతారు. ఈ సమయంలో  శరీరం అనేక హార్మోన్ల మార్పులకు లోనవుతుంది. ఈ మార్పుల వల్ల శరీరంలో వేడి ఆవిర్లు, రాత్రి సమయాల్లో చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్‌లు, యోని పొడిగా మారిపోవడం, , ఆందోళన, బరువు పెరగడం, నిద్రకు రుగ్మతలు వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి.వీటికి  అనుగుణంగా ఉండటానికి, మహిళలు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అందుకోసం ఈ కింది ఆహారాలు తీసుకోవాలి. సోయా.. టోఫు,  సోయా పాలు వంటి సోయా ఉత్పత్తులలో ఐసోఫ్లేవోన్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ పనితీరును అనుకరించే ఒక రకమైన మొక్కల పదార్థం. ఈ ఐసోఫ్లేవోన్‌లు రుతుక్రమం ఆగిన లక్షణాలను ఉపశమనం చేస్తాయి. హృదయ సంబంధ వ్యాధులు, బోలు ఎముకల వ్యాధి, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సోయాలో మొక్కల ప్రోటీన్లు కూడా ఉంటాయి, ఇవి వృద్ధాప్యం కారణంగా క్షీణిస్తున్న కండరాలను బలపరుస్తాయి. పండ్లు, కూరగాయలు తాజా పండ్లు, కూరగాయలు మెనోపాజ్ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.  బచ్చలికూర బ్రోకలీ వంటి ఆకుకూరలలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. యాపిల్స్, సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ సంశ్లేషణలో సహాయపడుతుంది చర్మంలో వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలలో లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఒమేగా-3 మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తృణధాన్యాలు.. బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ వంటి తృణధాన్యాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది గుండె జబ్బులు, హార్మోన్ల అసమతుల్యత, మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తృణధాన్యాలలో విటమిన్ బి, విటమిన్ ఇ మెగ్నీషియంతో సహా అవసరమైన విటమిన్లు ఎన్నో ఉన్నాయి, ఇవి శక్తి స్థాయిలను పెంచుతాయి, ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. నట్స్.. నట్స్ లో కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, ఇవి కడుపు నిండుగా ఉండేలా చేసి అతిగా తినే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిలో  ఫైటోఈస్ట్రోజెన్‌లు ఉంటాయి, ఇవి శరీరంలో వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు పట్టడం, మానసిక కల్లోలం వంటి రుతుక్రమం ఆగిన లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముఖ్యమైన మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం కూడా వీటిలో ఉంటాయి.  కాల్షియం.. విటమిన్ డి.. మెనోపాజ్ సమయంలో ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు కాల్షియం, విటమిన్ డి అవసరమైన పోషకాలు. కాల్షియం పాలు, జున్ను, పెరుగు బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆకు కూరలలో లభిస్తుంది. చర్మం సూర్యరశ్మికి గురైనప్పుడు విటమిన్ D సంశ్లేషణ చెందుతుంది మరియు బలవర్థకమైన పాల ఉత్పత్తులు చేపలలో కూడా విటమిన్ డి ఉంటుంది.                                          ◆నిశ్శబ్ద.

థైరాయిడ్ తగ్గాలంటే ఈ ఆసనాలు వేసి చూడండి!

థైరాయిడ్ తగ్గాలంటే ఈ ఆసనాలు వేసి చూడండి! ఒత్తిడి కారణంగా హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. థైరాయిడ్ స్థాయిలు పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. థైరాయిడ్ అనేది మెడలో ఉన్న ఒక చిన్న గ్రంధి, ఇది అనేక ముఖ్యమైన హార్మోన్లను స్రవిస్తుంది. ఈ హార్మోన్లు జీవక్రియ, శరీర ఉష్ణోగ్రత మరియు పెరుగుదలకు అవసరం. థైరాయిడ్ స్థాయి పెరగడం లేదా తగ్గడమనే రెండు సందర్భాలు  శరీరానికి హాని కలిగించవచేవే.. యోగా ఆసనాల ద్వారా థైరాయిడ్ గ్రంధి సమతుల్యతగా ఉండేలా చేసుకోవచ్చు. థైరాయిడ్ గ్రంధి వల్ల హార్మోన్లలో కలిగే మార్పులు మహిళలలో చాలా సమస్యలు తెచ్చిపెడతాయి. కింద చెప్పుకునే యోగా అసనాలు వేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. సేతుబంధాసనం సేతువు ఆకారంలో భంగిమ ఉండటం వల్ల ఈ ఆసనాన్ని సేతుబంధాసనం అని  అంటారు. వెన్నెముకను బలోపేతం చేయడానికి ఈ యోగాసనం ఉపయోగపడుతుంది. సేతుబంధాసన సాధన ద్వారా థైరాయిడ్ లక్షణాలను తగ్గించవచ్చు. ఈ ఆసనం చేయడానికి వెల్లికిలా పడుకోవాలి.  మోకాళ్లను మీ భుజాల వెడల్పు నుండి కొంచెం దూరంగా వంచాలి. ఇప్పుడు, అరచేతులను తెరచి, చేతులను నేలపై నిటారుగా ఉంచి, శ్వాస తీసుకుంటూ, నడుమును పైకి ఎత్తాలి. ఊపిరి పీల్చుకుంటూ, తిరిగి పాత స్థితికి రావాలి. భుజంగాసనం..   థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనం పొందడానికి, భుజంగాసనం ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ భంగిమ గొంతు మరియు థైరాయిడ్‌ను ఉత్తేజపరచడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది. సంస్కృతంలో భుజంగం అంటే పాము అని అర్థం.  భుజంగాసనంను కోబ్రా భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడానికి నేలపై పడుకోవాలి. అరచేతులను భుజం-వెడల్పు వేరుగా నేలపై ఉంచండి. ఇప్పుడు పీల్చేటప్పుడు ఛాతీని నేలపై నుండి పైకెత్తి సీలింగ్ వైపు చూడండి. ఇప్పుడు శరీరాన్ని నేలపైకి తీసుకురండి. ఈ యోగాను పునరావృతం చేయండి. బిటిలాసనం..  థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు బిటిలాసనం వేయాలి. దీన్నే పిల్లి-ఆవు భంగిమ అని అంటారు. తులో రక్త ప్రసరణను కొనసాగించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసనం వేయడానికి, ముందుగా మణికట్టు మరియు మోకాళ్ల సహాయంతో జంతువు లాంటి భంగిమను వేయండి. లోతైన శ్వాస తీసుకోవాలి. ఆ తరువాత శ్వాసను మెల్లిగా వదలాలి. ఈ యోగాను ప్రతిరోజూ 10 నిమిషాల పాటు చేయాలి. పశ్చిమోత్తాసనం.. తల మోకాళ్ళ వైపు, చేతులు పాదాల వైపు పోనిచ్చి వాటిని ఆనించడానికి  ప్రయత్నిచాలి. అయితే ఈ యోగాసనం వేసే ప్రారంభంలో తల మోకాళ్ళకు తగలకపోవచ్చు, చేతులు పాదాలకు అందకపోవచ్చు..  రోజు సాదన చేస్తే అది సాధ్యమవుతుంది. తిరిగి పడుకుని మళ్ళి మళ్ళి లేస్తూ ఈ ఆసనం చేయాలి. ఇలా కనీసం 5 నుంచి 20 సార్లు చేయాలి.                                        ◆నిశ్శబ్ద.

ఆహారం + వ్యాయామం = ఆరోగ్యం

ఆహారం + వ్యాయామం = ఆరోగ్యం   అందంగా, తక్కువ బరువుతో మెరుపు తీగలా కనిపించాలని కోరుకుంటారు ఎవరైనా. దానికోసం నోరు కట్టేసుకుని ఏమీ తినకుండా కూడా వుంటారు. అయితే తినడం మానేస్తే బరువు తగ్గుతారనుకోవటం అపోహ మాత్రమేనని, సరైన ఆహారం, వ్యాయామం రెండూ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కొన్ని విషయాల పట్ల కొంచెం శ్రద్ద పెట్టండి చాలు... మీరు కోరుకున్నట్టు మెరుపు తీగలా మారటం ఖాయం అంటున్నారు. 1. మొదట గుర్తుపెట్టుకోవలసిన విషయం.." ఒక్కొక్కరి ఒంటి తీరు ఒక్కోలా వుంటుంది. కొందరిలో కొవ్వు ఇట్టే పేరుకుపోతే మరికొందరు ఎంత తిన్నా లావెక్కరు. కాబట్టి అందరికీ వర్తించేలా సూత్రాలు ఏవీ ఉండవని గ్రహించి, బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఒకసారి పోషకాహార నిపుణులని కలసి, మీ జీవన విధానం , తీసుకునే ఆహారం వంటివి చెప్పి సలహా అడగాలి. వారు సూచించిన ప్రకారం ఆహారం తీసుకుంటే బరువు తగ్గటం అందని ద్రాక్ష ఏమి కాదు. 2. యోగ చేయాలని, అది శరీరాన్ని, మనసుని ఆరోగ్యంగా ఉంచుతుందని ఎప్పటి నుంచో వింటున్నాం. ఒకరోజు చేసి, ఒక రోజు మానేసి లేదా ఏ టీవీలోనో చూసి  సొంతగా చేయటం కాకుండా, ఈ యోగకి కూడా ట్రైనింగ్ తీసుకుంటే.. ఆ ట్రైనర్ మీ శరీర తత్వాన్ని బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి మీరు ఏ ఆసనాలు వేయచ్చు అన్నది నిర్ణయిస్తారు. అప్పుడు మీరు కోరుకున్న లక్ష్యం చేరటం కష్టం కాదు. 3. నడక వెంటనే మొదలు పెట్టగలిగిన ఓ వ్యాయామం. ప్రకృతితో మమేకం అయ్యేలా చేసే శక్తి నడకకి వుంది. ఆరోగ్యాన్నీ కాపాడుతుంది. 4. డాన్స్ అంటే చిన్నప్పుడు చాలా ఇష్టం. కాని ఇప్పుడు టైం లేదు... అనేది చాలామంది చెప్పగా వింటుంటాం. చిన్నప్పుడే కాదు.. ఇప్పుడు డాన్స్ చేయచ్చు మీ ఫిట్‌నెస్ కోసం. వీలైతే నేర్చుకోండి. లేదా చక్కగా పిల్లలతో కలసి పాటలు పెట్టుకుని మీకు నచ్చినట్టు, వచ్చినట్టు డాన్స్ చేయండి. రోజు అలా చేస్తే ఉల్లాసంగా ఉండచ్చు, ఆరోగ్యంగా కూడా ఉండచ్చు. శరీరంలోని ప్రతి అవయవాన్ని కదిలించేలా డాన్స్ చేస్తే కాలరీలు ఇట్టే ఖర్చు అవుతాయి. 5. మంచి నీరు సరిపడా తాగుతున్నారో లేదో చూసుకోండి. పళ్ళ రసాలు తాగటం మంచిదే కాని అందులో పంచదార వేయకుండా తాగితేనే ఫలితం. ఫిట్‌నెస్ కావాలంటే ఈ చిన్న చిన్న విషయాల పట్ల కూడా శ్రద్ధ పెట్టాలి. ఫిట్‌గా వుంటే ఆక్టివ్‌గా ఉండచ్చు. ఆక్టివ్‌గా వుండేవారి వయసు పెరగదుట. ఎప్పుడూయూత్‌లానే కనిపిస్తారు. మరి మీరు ఆ కాంప్లిమెంట్స్  పొందాలంటే ప్రయత్నాలు ప్రారంభించండి. -రమ

Foods to Boost Your Mood

  Foods to Boost Your Mood         Nuts: Dry fruits or nuts as we call them are all high in magnesium, which plays a major role in converting sugar into energy, and are also filled with fiber to keep your blood sugar levels even. Keep a bag of nuts like almonds, cashews and hazelnuts at your desk and just a handful will give you longer lasting energy than a cup of coffee ever will.   Dark Chocolate: Eat a square or two of dark chocolate energizes the body by providing an excellent source of iron and magnesium. Dark chocolate can improve cognitive function, it can prevent Alzheimer and dementia and it can also boost your mood in a matter of minutes. The darker the chocolate you consume, the better! Dark chocolate slows down the production of stress hormone, and the anxiety levels automatically decrease, moreover, chocolate also makes the brain release endorphins and also boosts the serotonin levels. This creates a feeling of well-being that lasts for several hours.     Green Tea/ Ginger Tea: A large review of studies conducted by researchers world over found that drinking three cups of tea daily was associated with a positive attitude. Also a report recently showed that study participants who sipped four or more cups of green tea daily reported having a more positive mood. Green tea has been used for thousands of years due to its numerous benefits. Just like berries, green tea is also very rich in antioxidants, amino acids and L-theanine, known for reducing stress and anxiety while improving the mood. If consumed on a regular basis, green tea can give a feeling of overall well-being.   Fish: Salmon is a great source of the energy-boosting goodness that is essential omega-3 fatty acids, which are important for energy production, brain activity and circulation. Just a gram of fish oil each day and noticed a 50 percent decrease in symptoms such as anxiety, sleep disorders, unexplained feelings of sadness, suicidal thoughts.     Milk: Milk contains proteins high in tryptophan, which is a building block in the bloodstream for serotonin in the brain. It’s a source of carbohydrates and vitamin D (low levels have been associated with depression), which is required for the production of serotonin. Milk is also a source of calcium, which has been shown to reduce anxiety.   Banana: Bananas contain high amounts of vitamins and minerals, as well as tryptophan which is known for raising serotonin levels. All the compounds found in bananas are mood-boosting, and vitamin B6 converts tryptophan into serotonin, the mood-lifting hormone. Bananas are one of the world’s best foods for supplying your body with energy. Rich in potassium and B vitamins, they can provide your body with a more sustained release of energy. The supply of vitamins and carbohydrates in bananas make you feel full, help slow down digestion and keep blood sugar levels stable.   ..Divya

How NOT to put on weight at Work

How NOT to put on Weight at Work Lose weight while at work: The Catch 22 situation where you don’t have time to work out at home in the mornings before you head to work and you don’t have the time to exercise after you come back home late and there are more important things to do like cooking and kids homework projects to take care of. So how to make sure you stay healthy and not add those extra kgs, paunch and inches when you have 9-7 desk job? Follow these simple tips to stay healthy and not pile up those extra kilos. -> Avoid the vending machine coffees and teas. Opt for Green tea which helps you in staying alert and burn calories. Since your office doesn’t provide them get your own tea bags and keep them in your desk ->Drinking water: Keep a bottle half filled and once you are done drinking it, go to the water dispenser as an exercise. Also get your hot water to make the tea and not depend on the office assistants to get it for you. ->DO not take energy boosters and supplements and they can lead to other side effects ->DO not eat unhealthy snacks and processed food. Try keeping fruits, khakras, nuts, digestive biscuits or crackers and simple local snacks to munch in between so that you don’t put on weight. ->Have a light lunch and try including a salad before eating your regular lunch. ->Take a 15 minute brisk walk after lunch as this not only helps you in digesting food it also helps you in staying alert post lunch break session. Check out our tips on how to avoid drowsiness post lunch.  

Best Foods for Flat Stomach

Best Foods For Flat Stomach The secret for a flat stomach is eating supportively . In addition to regular exercise, you have to add some fat burning foods to your diet to help trim your waistline. Foods that are high in protein and fiber are the best kinds of food to eat if you want to burn fat around your middle. Almonds Almonds contain protein, fiber, and vitamin E, a powerful antioxidant. They’re also a good source of magnesium which is a mineral your body must have in order to produce energy, build and maintain muscle tissue, and regulate blood sugar. Eggs Eat at least one egg day, Eggs are the perfect protein source and if you have an egg in the morning you will feel less hungry throughout the day. Soy Soybeans are a great source of antioxidants, fiber, and protein. Liquid soy also makes a good meal replacement. Try a soy protein shake to lose more weight. Apples A large apple contains 5 grams of fiber, but it’s also nearly 85 percent water which helps you feel full. Apples also contain quercetin, a compound shown to help fight certain cancers, reduce cholesterol damage, and promote healthy lungs. Berries Berries are full of fiber which helps with calorie absorption and are also high in antioxidants which can help blood flow in turn making muscles contract more efficiently. Leafy Greens Leafy greens are also a good source of calcium, an essential ingredient for muscle contraction. In other words, they help fuel your workouts. Yogurt The probiotic bacteria in most yogurts helps keep your digestive system healthy, which means a lower incidence of bloating and constipation which is good for your stomach. Walnuts loaded with heart-healthy omega-3s, and anti-inflammatory polyphenols and muscle-building protein, walnuts are one of the healthiest snacks you can eat. They also help curb your appetite if you eat a handful about a half hour before a meal. Salmon Seafood, especially fatty fish like salmon, tuna, and mackerel, is an excellent source of omega-3 fatty acids. These uber-healthy fats may help promote fat burning by making your metabolism. Seafood is an excellent source of abs-friendly protein. Oats Oats are packed with soluble fiber and protein, oats help lower the risk of heart disease and feed your muscles with energy. There’s a reason for the sayings “sow your oats” and “feel your oats.” Oats rock. Click here for Yoga Poses to Get attractive and slim stomach

Good food to avoid heart burn

Good food to avoid Heartburn Heartburn has nothing to do with the heart. Heartburn is a digestive problem that occurs when stomach acid comes into contact with the lining of the esophagus, causing irritation.But the risk factor is something that increases your chances of getting a disease or condition. The same is true with heartburn. Some of the risk factors for heartburn may be beyond our control, such as another medical condition. Other factors, such as certain lifestyle habits, can be modified to help reduce the occurrence of heartburn symptoms. Majority of heartburn symptoms are food related. If you’re the type who couldn’t care less if you are eating salty foods, oily foods, spicy foods, nutty foods, fatty foods, “feel good” foods, and all other assortment of foods that can trigger disorders in your body, then you’re a candidate for heartburn. If you continue to be mindless of what’s going on inside your digestive system, you will soon feel its unpleasant effects.  Symptoms of heart burn: A burning feeling in the chest just behind the breastbone that occurs after eating and lasts a few minutes to several hours. Chest pain, especially after bending over, lying down or eating. Burning in the throat -- or hot, sour, acidic or salty-tasting fluid at the back of the throat. Difficulty swallowing. Feeling of food "sticking" in the middle of the chest or throat. Heartburn may cause chronic cough, sore throat, or chronic hoarseness.   Causes of heart burn Oranges, grapefruits and orange juice are classic heartburn foods. They are likely to cause heartburn, especially when consumed on an otherwise empty stomach. Pepper, Mexican food, chili, and any other food that is loaded with pepper or other spices can trigger heartburn, If these spicy food triggers your heartburn, avoid it. Then slowly reintroduce milder versions of whatever you like, Alcohol also makes the esophagus more sensitive to stomach acid. Good foods to avoid heart burn Fruits: Bananas, Fresh or Dried Apples Vegetables: Broccoli, Cabbage, and Carrots Meats: Lean Ground Beef, Skinless chicken breasts Dairy: Fat free cream cheese, Feta or goat cheese Grains: Corn bread, Multi-grain or white bread, Bran Beverages: Mineral water Home remedies to avoid heart burn   Regular practice of in taking one to two glass of water, In early morning is healthy habit and helpful in acidity control. Tulsi ( Holy basil ) plays an important role in controlling acidity. Consuming few leaves of tulsi leaves anytime gives relief from acidity and is one of the useful home remedies for acidity. Natural and effective dosages for acidity control are: take one table spoon amla with one table spoon haritaki (chebulic myroblan) Take two tablespoon honey with two tablespoon natural cidar vinegar before meal. Mint juice containing peppermint oil are god herbal remedy for treating heart burn. It is recommended to be taken after meal, it reduces gas formation. This is one of the useful home remedies for acidity. Intake cold milk, coconut water, almonds or raw garlic, all these give you relief from acidity and heartburn. Intake Jaggery on hourly basis will give you relief from acidity. Half glass butter milk one table spoon of coriander juice is effective in case of stomach burns, indigestion, and acidity. This is one of the best home remedies for acidity. 

కడుపు నిండా తింటూనే బరువు తగ్గవచ్చు!

కడుపు నిండా తింటూనే బరువు తగ్గవచ్చు! స్థూలకాయం... ఈ సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణమై పోయింది. కొన్నాళ్ళ క్రితం నాజూకుగా అందంగా ఉన్నవారు కాస్త, బరువు పెరిగిపోయి, కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అసలే అధిక బరువుతో బాధపడుతున్నారంటే ఇంకోవైపు ఎవరు పడితే వారి ఇచ్చే సలహాలు.... వ్యాయామం చేయండి, తిండి తగ్గించండి, స్వీట్స్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. బరువు తగ్గడానికి తిండి తగ్గించాలనుకోవడం బాగానే ఉంది, వ్యాయామం చేయాలనుకోవడం  కూడా బాగానే ఉంది, కానీ తిండి తగ్గించి వ్యాయామం చేయడం సాధ్యమా...? వ్యాయామం చేయడానికైనా శక్తి కావాలి కదా..? మరలాంటప్పుడు కడుపు నిండా తిండి లేకపోతే శక్తి ఎక్కడి నుండి వస్తుంది... ? ఒక్క పూట కాస్త ఆలస్యమైతేనే తట్టుకోలేం.. అందునా స్థూలకాయులు మరీను. అలాగని ఎట్లాగూ బరువు పెరిగాం చేయగలిగేదేముంది అని ఊరుకోవడానికి లేదు, అధిక బరువు ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. బరువు పెరగడానికి మూల కారణం శరీరంలోని హార్మోన్ ల ఇంబాలెన్స్, అధిక మోతాదులో తినేయడం, ఆల్కహాల్ సేవించడం, స్వీట్స్, చాక్లెట్స్ తినేయడం. ఇవి బరువు పెరిగిపోవడానికి ముఖ్య కారణాలు. ఒక్కోసారి అధిక ఒత్తిడి కూడా బరువు పెరగడానికి కారణమేనంటున్నారు నిపుణులు. అధిక ఒత్తిడి వల్ల వెలువడే కోర్టిసోల్ అనే హార్మోన్ పొట్టలో, ముఖ్యంగా నడుం భాగంలో కొవ్వు చేరడానికి కారణమవుతుంది. గుడ్లు : గుడ్లు చాలా బలవత్తరమైన ఆహారం. గుడ్లలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండటం చేత ఆకలి తొందరగా వేయదు. బీన్స్ : ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉన్న కొవ్వు రహిత ఆహారం. వీటిని తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. ఓట్ మీల్ : అధిక బరువుతో బాధపడేవారికి ఓట్ మీల్ ని మించిన మంచి ఆహారం లేదు. ఓట్ మీల్ లో కొవ్వును కరిగించే లక్షణాలతో పాటు ఇందులో శరీరానికి కావలసిన అతి ముఖ్య పోషకాలు ఫైబర్, ప్రోటీన్లు , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజూ పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ ని కడుపు నిండా తినండి. రోజంతా చలాకీగా ఉండగలుగుతారు. కూరగాయలు : విటమిన్స్, మినెరల్స్, మరియు యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆహారం. రాత్రిపూట పడుకోబోయే ముందు కేవలం కూరగాయలు తినడం మీ పొట్ట సైజును తగ్గించడంలో బాగా ఉపకరిస్తుంది. బార్లీ : బార్లీ లో ఉన్న ఫైబర్, విటమిన్లు, మినెరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్ మీకు రోజంతా కావలసినంత శక్తినిస్తాయి, పైగా కొవ్వు రహిత ఆహారం, మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. గ్రీన్ టీ : ఇందులో విటమిన్ సి, బి, మరియు విటమిన్ ఈ మరియు మెగ్నీషియం, జింక్, క్రోమియం, మరియు సెలీనియం పుష్కలంగా ఉంటాయి. దీన్ని మీరు రోజుకు ఎన్ని సార్లైనా తాగవచ్చు. ఆలివ్ ఆయిల్ : చాలా మంది కూరగాయలు తినడమంటే అంతగా  ఇష్టపడరు, అందుకే  వండేటప్పుడు మనం సాధారణంగా వాడే నూనె తో పాటు విటమిన్ కె, విటమిన్ ఈ, సమృద్ధిగా ఉండే ఈ ఆలివ్ ఆయిల్ వేస్తే ఆహారం ఇంకా రుచిగా తయారవుతుంది. అంతే కాదు ఆలివ్ ఆయిల్ లో మీ పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించగలిగే విశిష్ట గుణాలున్నాయి. బరువును తగ్గించుకోవాలని మీరు అనుకుంటున్నారంటే మీకు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పెరిగినట్టే. అలాగని ఒకేసారిగా బరువు తగ్గడానికి మాత్రం ప్రయత్నించకూడదు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే, ఎక్స్ పర్ట్ సలహాలు తీసుకుంటూ, ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండాలి.  

కోల్డ్ తో బాధ పడుతున్నారా ?

  కోల్డ్ తో బాధ పడుతున్నారా ?   కోల్డ్ అనేది సర్వ సాధారణమైన లక్షణం. ఇది పెద్ద జబ్బేం కాదు, అయితేనేం పట్టిందంటే పీడిస్తుంది. తెగ సతాయిస్తుంది. జలుబు చేసేది ముక్కుకే అయినా ముఖమంతా ఏదో పాకుతున్నట్టు యమా చేరాకేస్తుంది. కోల్డ్ వల్ల శరీరమంతా అలసిపోయినట్టు అవుతుంది. మనసు స్థిమితంగా ఉండదు. తిండి తినాలనిపించదు, ఎవరితో మాట్లాడాలనిపించదు. నిద్ర పట్టడం కష్టమౌతుంది. ఇంత ఇబ్బంది పెట్టే కోల్డ్ గురించి ఓ నానుడి ఉంది. దీనికి మందు వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది, వాడితే వారంలో తగ్గుతుంది- అని. అంటే కోల్డ్ కు ఔషధం వేసుకున్నా లాభం లేదనేది తాత్పర్యం. అనేకమంది అనుభవాలు ఆ మాట నిజమే అనిపించేలా చేశాయి. అలాగని మెడిసిన్లు వేసుకోకుండా కోల్డ్ ను ముదరబెట్టుకుంటే ఆనక బాధపడక తప్పదు. దీర్ఘకాలంపాటు జలుబు కనుక తగ్గకపోతే, అది న్యుమోనియాకు దారితీస్తుంది. పూర్వకాలం సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు కోల్డ్ కు చాలానే మందులున్నాయి. మందుల సంగతి అలా ఉంచితే అనేక గృహ చిట్కాలు కూడా ఉన్నాయి. పసుపు, పటిక బెల్లములను సమంగా తీసుకుని నిప్పుల మీద వేసి ఆ పొగను పీల్చినట్లైతే పడిశం సమస్య నివారణ అవుతుంది. మిరియాలను నూరి, బెల్లంతో కలిపి ముద్దగా చేసి తింటే కోల్డ్ తగ్గుతుంది. ఒకవేళ అది మరీ ఘాటుగా ఉంటుంది, తినలేము అనుకుంటే వేడి పాలలో మిరియాల పొడి వేసుకుని తాగినా ఫలితం ఉంటుంది. గులాబీ రేకలను నువ్వుల నూనెలో మరిగించి , దించి వడపోసి నిలువ చేసుకోవడం ఇంకో పధ్ధతి. ఈ గులాబీ తైలాన్ని రెండు పూటలా రెండు చుక్కలు ముక్కులో వేస్తే, జలుబు తగ్గుతుంది. తుమ్ములు కూడా అరికడతాయి. కొందరికి డస్ట్ ఎలర్జీల్లాంటివి ఉంటాయి. పిండి, కారం లాంటివి జల్లించినా, కాస్త అటక దులిపినా వెంటనే ఎలర్జీ బయటపడిపోతుంది. ఆఖరికి సాంబ్రాణి పొగ కూడా పడనివారు ఉంటారు. అలాగే కొందరికి ఎండలో తిరిగితే వెంటనే ఎలర్జీ వస్తుంది. మరి కొందరికి కొన్ని వాసనలు సరిపడవు. ఇంకొందరికి కొన్ని పదార్ధాలు తింటే ఎలర్జీ వస్తుంది. వీళ్ళందరికీ దాదాపుగా కోల్డ్ మొదటి లక్షణంగా ఉంటుంది. కనుక ఏది సరిపడటంలేదో, దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ముక్కు అంటూ ఉన్నాక జలుబు చేయకుండా ఉండదు. కానీ చీటికిమాటికి కోల్డ్ వస్తుంటే ఆలోచించాల్సిందే. డాక్టర్ను సంప్రదించాలి. రెసిస్టేన్స్ పవర్ తగ్గితే కూడా త్వరగా కోల్డ్ చేస్తుందని గ్రహించాలి. మొత్తానికి ఎక్కువకాలం పాటు రొంప వదలకుండా బాధిస్తుంటే, లోపల ఏదో అనారోగ్యం పొంచి ఉందని గ్రహించి తగిన శ్రద్ధ తీసుకోవాలి.  

రోజూ స్కిప్పింగ్ చాలు.. ఆరోగ్యం సూపర్..

రోజూ స్కిప్పింగ్ చాలు.. ఆరోగ్యం సూపర్.. రకరకాల వ్యాయామాలపై దృష్టి సారిస్తూ, కొందరు తమ శరీర సౌష్టవాన్ని సంరక్షించుకుంటుంటే., ఇంకొందరు మాత్రం రోజూ ఒకే వ్యాయామాన్ని రోజు అనుసరిస్తూ తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటున్నారు. ఇది ఏలా సాధ్యం... * శరీరం మొత్తానికి ఓకేసారి వ్యాయామం, తాడాట (స్కిప్పింగ్)తో సాధ్యమవుతుందని ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌లు సూచిస్తున్నారు. * శరీరంలోని అవయవాల కదిలికను వేగవంతం చేయ్యటంతో పాటు వాటి మధ్య సమన్వయానికి స్కిప్పింగ్ తోడ్పడుతుందట. *  రోజు స్కిప్పింగ్ చేయ్యటం వల్ల శరీరం ధృడత్వాన్ని సంతరించుకోవటంతో పాటు పూర్తి స్థాయిలో ఫిట్‌గా తయారవుతుంది. ఎముకలు గట్టిపడటంతో పాటు చర్మంపై ఏర్పడ్డ ముడతలు తొలగిపోతాయి. *  స్కిప్పింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్ చేయ్యటం వల్ల పాదాలకు నొప్పి కలుగుతుంది. దాంతోపాటు పగుళ్లు ఏర్పడతాయి. * ముఖ్యంగా కాంక్రీట్ నేలపై స్కిప్పింగ్ చేసే సందర్భంలో బూట్లు వేసుకోవటం మంచింది. * బరువు తగ్గించటంలో స్కిప్పింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. * స్కిప్పింగ్ ప్రారంభించే ముందు ఐదు నిమిషాల పాటు వార్మప్ చేయ్యటం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది.

గర్భవతులకు వ్యాయామం ఎందుకు అవసరం?

గర్భవతులకు వ్యాయామం ఎందుకు అవసరం? గర్భవతులు చాలా సున్నితంగా ఉంటారు. అయితే గర్భవతులు దృఢంగా ఉండాట్సన్ ఎంతో అవసరమని వైద్యులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. గర్భవతులు వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా మారుతుందనేది గైనకాలజిస్ట్ లు చెప్పే మాట. అయితే గర్భవతులు, వ్యాయామం అనే మాట వినగానే గయ్యిమని అరిచే పెద్దవాళ్ళు కూడా ఉంటారు. కానీ వ్యాయామం అనేది గర్భవతులకు చాలా ముఖ్యం.  ప్రసవానికి ముందు కాలములో  వ్యాయామము చేయడం వల్ల గర్భవతులలో భయాందోళనలు ఏమైనా ఉంటే అవన్నీ  తొలగిపోతాయి. తెలియని విషయానికి భయపడటం సాధారణంగా అందరి విషయంలో జరిగేదే.. దీనికి చిన్న పిల్లల నుండి గర్భవతులు, మహిళలు, వృద్ధులు, పురుషులు ఇలా ఎవరూ మినహాయింపు కాదు. అయితే గర్భవతులలో భయం కలిగినప్పుడు సాధారణంగానే ఆందోళన కలుగుతుంది. ఈ ఆందోళన కాస్తా.. తలనొప్పికి దారితీస్తుంది. అలాంటి సమయంలో ఎంత ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నించినా ఉండలేరు. మనసులో ఏ మూలో ఎంతో కొంత భయం మనిషిని కుదురుగా ఉండనివ్వదు. అలాంటి సమయాల్లోనే లేని అనుమానాలు పుడుతూ ఉంటాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉన్న భయానికి అవి తోడయ్యి గోరంత సమస్యను కొండంత చేస్తాయి.  వ్యాయామము చేస్తే గర్భవతులలో ఉన్న ఈ ఆందోళన తగ్గిపోతుంది. వ్యాయామం వల్ల శరీరం విశ్రాంతిని బాగా కోరుకుంటుంది. దీని ఫలితంగా ఎలాంటి గందరగోళం లేకుండా హాయిగా నిద్రపోతారు. ఇక ప్రసవానికి ముందు మహిళలు వ్యాయామం చేస్తుందం ద్వారా మరొక అద్భుత ప్రయోజనం ఉంటుంది. అదే గర్భవతిలో కండరాలను దృఢంగా చేయడం. ప్రసవం సమయంలో గర్భవతులలో కండరాల సంకోచం వ్యాకోచాలు అధికంగా జరుగుతాయి. ఈ సంకోచ వ్యాకోచాల కారణంగా కండరాలు మరింత బలహీనం అవుతాయి. అదే వ్యాయామం వల్ల కండరాలు దృఢంగా మారితే ప్రసవ సమయంలో నొప్పులను భరించడం సాధ్యమవుతుంది.  అకాలపు ప్రసవాలు, ప్రసవ సమయంలో ప్రమాదాలు, సాధారణ ప్రసవాన్ని భరించలేక సిజేరియన్ వైపు మొగ్గు చూపడం వంటి వాటిని గర్భవతులు వ్యాయామం ద్వారా దూరం ఉంచవచ్చు.  గర్భాశయము అంటే బోలుగా ఉండే ఒక కండరము.  ఈ కండరము ప్రపన సమయములో శిశువును బయటికి నెట్టడానికి సహకరిస్తుంది. ఈ కండరము గర్భాశయ ద్వారము దగ్గర ఉండి ఇతర కండరాల ఒత్తిడిని ప్రతిఘటించి కడుపులో బిడ్డను బయటకు నెట్టేందుకు సహకరిస్తుంది. వ్యాయామం వల్ల ఈ కండరం దృఢంగా మారుతుంది.   ఒక వైపు నొప్పులు మరో వైపు భయము చేరి ప్రసవ సమయములో కండరములు సరిగా పని చేయకుండా అవరోధము కలిగిస్తుంటాయి. అందుకే గర్భవతులు  వ్యాయామము చేస్తూ,  ప్రసవానికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఉంటే గర్భవతులకు ప్రవేశం సమయంలో ఆందోళన ఏర్పడకుండా సాఫీగా జరిగిపోతుంది. కాబట్టి గర్భవతులకు వ్యాయామం ఎంతో ముఖ్యం. అయితే నిపుణులను అడిగి వారి నెలలను బట్టి వ్యాయామాలను తెలుసుకుని చేయాలి.                                    ◆నిశ్శబ్ద.  

శరీరం ఏమి చెబుతుందో వింటున్నారా?

శరీరం ఏమి చెబుతుందో వింటున్నారా? గమనించాలే కానీ మన చుట్టూ ఉండే ప్రతిదీ ఏదో ఒకటి వ్యక్తం చేస్తూనే ఉంటాయి. నేటి గజిబిజి జీవితంలో మనం ఏవీ పరిశీలనగా చూడం. మన చుట్టూ ఉండే చెట్టు, పుట్టా, వస్తువులు, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి.. ఇలా అన్ని ఏదో ఒకటి చెబుతున్నట్టే అనిపిస్తాయి. మరి అన్నీ ఎన్నో చెబుతున్నట్టు అనిపించినప్పుడు మన శరీరం మనతో ఏమీ చెప్పకుండా ఉంటుందా?? శరీరం మాట్లాడుతుందా ఏంటి?? అని ప్రశ్న వేస్తారు చాలామంది. అయితే శరీరానికి కూడా భాష ఉంటుంది, శరీరానికి బాధ ఉన్నట్టే.. ఆ భాష కూడా కొన్ని నిర్ధిష్ట వ్యక్తీకరణలు కలిగి ఉంటుంది. శరీర భాషను అర్థం చేసుకున్నవారు శరీరాన్ని చక్కగా మార్చుకోగలరు. ముఖ్యంగా మహిళల్లో దశల వారిగా శారీరకంగా మార్పులు చోటు చేసుకుంటాయి. మరీ ముఖ్యంగా పెళ్లి, తల్లి కావడం అనేవి శారీరకంగా ఊహించని మార్పులకు కారణం అవుతాయి. ఇలా శారీరకంగా జరుగుతున్న మార్పులతో సమన్వయం అయితే వాటితో కలసి తమను తాము మార్చుకుంటే… కనీసం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే..  నీరు ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకున్నట్టు, శరీరం కూడా ఎన్ని దశలు దాటినా వాటికి తగ్గట్టు తాను మారుతూ శరీరాన్ని మాత్రం దృఢంగా.. అందంగా ఉంటుంది. మార్పు.. చేర్పు.. ఒక మార్పుకు సన్నద్ధం అవడం అంటే చేర్పుకు సిద్ధమవడమే.. ఉదాహరణకు పెళ్ళైన అమ్మాయిలు గర్భవతులయ్యి బిడ్డను మోయడం మొదలుపెట్టాక దానికి తగ్గట్టు ఆహారం నుండి ఎన్నో విషయాలలో మారతారు. కొన్ని ఇష్టాలు దూరం పెడతారు, మరికొన్ని ఇష్టం లేకపోయినా అలవాటు చేసుకుని ఇష్టంగా మార్చుకుంటారు. అయితే అదంతా కడుపులో బిడ్డ మీద ఉన్న ప్రేమతో చేస్తారు. అదే సాధారణంగా డెలివరీ తరువాత లావైతే… ఆ లావు తగ్గకపోతే… చాలా మంది చెప్పేమాట ఏముంది పెళ్ళై బిడ్డ కూడా అయింది. ఈ మాత్రం ఉండరా ఏంటి?? అందరూ ఇలా కామెంట్ చేసేవాళ్లే కానీ ప్రెగ్నెన్సీ, డెలివరీ వల్లే ఇలా అయ్యాను అని ఎవరూ అర్థం చేసుకోరు.. వంటి మాటలు చెబుతారు. అయితే ఒకరు ఏదో అనుకోవడం, ఆ ఇంకొకరికి సంజాయిషీ చెప్పడం ఇవన్నీ కాదు ముఖ్యం. మన శరీరాన్ని మనం ఎంత ఫిట్ గా ఉంచుకుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. అందుకే చక్కని ఆహారం, తక్కువ ఆహారంతో ఎక్కువ శక్తి అందేలా తీసుకోవాలి. తక్కువ మొత్తాన్ని ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఉదయం నిద్ర లేవడం, కాసింత యోగా, ధ్యానం, మనసును ఆహ్లాదపరిచే పనులు చేయడం ఇవన్నీ చేస్తుంటే మనసు ఉల్లాసంగా మారి సహజంగానే శరీరం కాస్త తేలికపడిన భావన అనిపిస్తుంది. ప్రేమించడం.. ప్రేమ చాలా గొప్పది. అది అనిర్వచనీయమైన భావాన్ని వ్యక్తం చేసే గొప్ప మార్గం. అయితే ఎవరో బయటి వాళ్ళను, వస్తువులను, సినిమా తారలను ఇలా వీళ్లను కాకుండా మన శరీరాన్ని మనం ప్రేమించుకోవాలి. మన శరీరంలో ఎంతో గొప్ప అవయవాలు ఉన్నాయి. గుండెకు ఏదైనా సమస్య వస్తే అది ఎన్ని లక్షలు పెట్టినా దొరకడం కష్టం కిడ్నీలు ఫెయిల్ అయితే జీవితానికి అనుక్షణం గండం ఊపిరితిత్తులు చెడిపోతే ప్రాణం ఆనంతవాయువుల్లో కలిసిపోతాయి కళ్ళకు  ఏమైనా అయితే ప్రపంచమే చీకటి వినికిడి లేకపోతే ఎంతో గొప్పవైన శబ్దాలను వినలేక ఎప్పుడూ నిశ్శబ్దలోకంలో ఉండిపోతారు. ఇలా ఒకటా రెండా… మన శరీరంలో ఎంతో అమూల్యమైన అవయవాలు ఉన్నాయి. మరి ఇంతకంటే గొప్ప వస్తువు ఎక్కడైనా ఉంటుందా?? చేతిలో పట్టుకునే బొడి 20వేల ఫోన్ గురించి ఆలోచించి స్క్రీన్ గార్డ్, బాక్ కవర్ అన్నీ వేయించి జాగ్రత్త పెట్టుకునే మనం శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా.. అందుకే శరీరాన్ని ప్రేమించుకోవాలి. మనల్ని ఈ శరీరం ఎంతో కాలంపాటు మోస్తుంది. ఎప్పటికప్పుడు శరీర అనారోగ్యాన్ని నయం చేసుకోవాలి. దృఢంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. పాజిటివ్ మైండ్.. పాజిటివ్ మైండ్ అనేది మనిషిని ఎలాంటి పరిస్థితులలో అయినా పర్ఫెక్ట్ గా, బ్యాలెన్స్ గా ఉండేలా చేస్తుంది. ఏది జరిగినా మన మంచికే అనే పెద్దలు చెప్పిన మాట నిజమే.. కొన్ని సంఘటనలు, సందర్భాలు మనకు తెలియకుండా జరుగుతూ.. చెప్పకుండా వస్తుంటాయి. అలాంటి వాటి విషయంలో పాజిటివ్ మైండ్ ఉండటం ఎంతో అవసరం. ఒక పెద్ద గీత పక్కన దాని కంటే పెద్ద గీత గీసి మీదట గీసిన గీతను చిన్నగా చేయచ్చు. అలాగే మనకున్న సమస్యను ఎప్పుడూ మనకంటే సమస్యలు ఎక్కువ ఉన్న వారితో కంపెర్ చేసుకుని మనకే నయం కదా అన్న తృప్తిని మనలోకి ఒంపుకోవాలి.  మనిషి ఎప్పుడైతే ఏదైనా విషయానికి పాజిటివ్ గా ఉంటాడో అప్పుడు అతని చుట్టూ పాజిటివ్ ప్రపంచం మెల్లగా నిర్మాణమవడం మొదలు పెడుతుంది. ఆ పాజిటివ్ అనేది మనిషికి చెప్పలేనంత శక్తిని అందిస్తుంది. కాబట్టి పాజిటివ్ గా ఉండటం ఎంతో ముఖ్యం. మనం పాజిటివ్ గా ఉంటే మన శరీరం కూడా మనం చెప్పినట్టు వింటుంది. చెప్పినదానికి  స్పందిస్తుంది. కాబట్టి మనిషి శరీరం ఏమి చెబుతుందో అర్థం చేసుకోవాలి. దానితో సంభాషించాలి, దాన్ని ప్రేమించాలి. అప్పుడు శరీరం కూడా మనకు తగ్గట్టు స్పందిస్తుంది.                                       ◆నిశ్శబ్ద.

జాగింగ్ చేసేద్దాం ఇలా...

జాగింగ్ చేసేద్దాం ఇలా... మహిళలు తమ శారీరక ఆరోగ్య స్పృహ పెరిగినప్పుడు చాలామంది ఎంచుకునే వ్యాయామం ఏదైనా ఉందంటే అది వాకింగ్. అన్ని వయసుల వారు దీన్ని తమ లైఫ్ స్టయిల్ లో భాగం చేసుకోవచ్చు. అయితే ఈ నడిస్కను కాస్త వేగంగా చేస్తే దాన్నే జాగింగ్ అని అంటారు. నడక కంటే కాస్త ఎక్కువ ఫలితాలను ఇచ్చే ఈ జాగింగ్ పెద్ద వయసు వారు తప్ప టీనేజ్ నుండి మధ్యవయసు వారి వరకు ఎవరయిన చేయొచ్చు. అయితే ఇలాంటి ఆరోగ్య  సమస్య కాళ్ళ నొప్పులు వంటివి లేకపోతే 50 ఏళ్ళు దాటినా వారు కూడా జాగింగ్ చేయవచ్చు. వాకింగ్ కు ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు లేకపోయినా అది అలా సాగిపోతుంది. కానీ జాగింగ్ చేయడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. దీనివల్ల జాగింగ్ చేసినప్పుడు ఎలాంటి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జాగింగ్ చేయడానికి  కంఫర్ట్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి వాటి గురించి కొన్ని ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు ఇవిగో... చాలామందికి జాగింగ్ చేసేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి అనేది అవగాహన ఉండదు. కొందరు మహిళలు చీరల్లో ప్రయత్నం చేస్తుంటారు. అయితే జాగింగ్ చేసేటప్పుడు చుడిదార్  గాని, లూజ్ ప్యాంట్ లేదా జాగింగ్ డ్రస్ ను ధరించాలి, దీనివల్ల కాళ్ళు తొందర తొందరగా కదపడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.  ఇకపోతే జాసింగ్ చేసే సమయం కూడా అన్ధస్రూ దృష్టిలో పెట్టుకోవాలి. ఏవో ఒక పనులున్నాయని, కుదరడం లేదని ఏ సమయం కంటే ఆ సమయంలో జాగింగ్ చేస్తుండటం కరెక్ట్ కాదు. మనం సమయానికి భోజనం చేయడం వల్ల ఎలాగైతే జీర్ణవ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుందో… సమయానికి కరెక్ట్ గా జాగింగ్ చేయడం వల్ల కూడా దానికి తగిన పలితాన్ని పొందగలుగుతాము. అయితే జాగింగ్ కోసం ఎంచుకునే వేళలు ఉదయం లేదా సాయంత్రం అయితే బాగుంటుంది.  జాగింగ్ చేసేవారు ఎక్కువ మంది పాటించనిది ఏదైనా ఉందంటే అది కాళ్ళకు వేసుకునే షూ. చాలాశాతం మంది చెప్పులు వేసుకుంటారు.... అయితే జాగింగ్ కోసం తయారు చేయబడ్డ షూస్ వేసుకోవాలి. షూస్ లోకి  కాటన్ సాక్స్ వేసుకుంటే.... పాదాలకు ఇంకా మంచిది. జాగింగ్ చేయడం ఆరోగ్యానికి ఫిట్ నెస్ కు మంచిదనే అభిప్రాయంతో మొదలుపెట్టినప్పుడు చాలా ఎక్కువగా చేయకూడదు. జాగింగ్ ను ఇంత దూరం, ఇన్ని నిమిషాల సమయం అనే ప్లానింగ్ తో మొదలు పెట్టాలి. ఆ టీసురువత మెల్లగా దాన్ని పెంచుకుంటూ పోవాలి. ఇలా చేయడం వల్ల దూరం పెరిగినా శరీరానికి అలసట తెలియకుండా ఉంటుంది.  టీనేజ్ అమ్మాయిలు, యువతులు వాకింగ్ కంటే జాకింగ్ కె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారుమ్ వారి వయసుకు తగినట్టు జాగింగ్ ను ఎంజాయ్ చేయగలుగుతారు కూడా. అయితే సరైన బ్రా, టీ షర్ట్, షూస్ ఎంపిక చేసుకుని జాగింగ్ చేయడం ఎంతో ముఖ్యం.    జాగింగ్ సాద్స్రణంగా ఉదయం చేస్తుందం మంచిది. అది కూడా ఉదయాన్నే లేవగానే కాస్త  ఫ్రెష్ అయ్యి వాకింగ్, జాగింగ్, యోగ వంటివి చెయ్యాలి. అంతేకానీ ఉదేశ్యం ఆలస్యంగా లేచి టిఫిన్లు గట్రా తిని ఆ తరువాత నింపాదిగా జాగింగ్ చేయకూడదు. అలాగే సాయంత్రం కూడా కాఫీలు, టీలు, స్నాక్స్ అంటూ అన్ని తిని జాగింగ్ చేయకూడదు.   మధ్య వయసు వారిలో కొంతమందిలో కనిపించే బిపి ఉన్నా, హార్ట్ సంబంధించిన అనారోగ్యాలు ఉన్నా డాక్టర్ ను సంప్రదించిన తరువాత వారి సూచనల ప్రకారము మాత్రమే జాగింగ్ చేయాలి. ఇలా కొన్ని జాగింగ్ టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా ఆరోగ్యమైన అలవాటును హాయిగా కొనసాగించవచ్చు.                                  ◆నిశ్శబ్ద.

తీపి దగ్గర తడబడుతున్నారా?

తీపి దగ్గర తడబడుతున్నారా? అమ్మాయిలకు స్వీట్స్ కు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాక్లెట్లు, ఐస్ క్రీములు, ఇంకా తీపి పదార్థాలు అంటే చెప్పలేనంత ఇష్టం. మరీ ముఖ్యంగా బయటకు ఎక్కడికైనా వెళితే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా వేడుక చేసుకుంటే తీపి పదార్థాల వల్ల కలిగే ఇబ్బందుల గురించి మనసులో ఒకవైపు భయం ఉన్నా వాటిని వదల్లేక తినేస్తుంటారు.  అయితే ఇలా తీపి పదార్థాలను తినడం అనేది సాధారణమైన అలవాటు కాదని. దీని వెనుక కారణం ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తీపి పదార్థాలు తినాలని అనిపించడం వెనుక కారణం అనే మాట వినగానే చాలామంది షాక్ కు గురవుతారు కచ్చితంగా. అయితే దీనివల్ల భయపడాల్సిన అవసరం ఏమి లేదు. తీపి పదార్థాలు తినాలని అనిపించడానికి గల కారణాలు తెలుసుకుంటే తీపి వల్ల కలిగే అన్ని రకాల సమస్యలనూ పరిష్కరించుకోవచ్చు. తీపి తినాలని అనిపించడానికి కారణాలు!! ◆ ఒత్తిడికి లోనవడం తీపి తినడానికి కారణం అవుతుంది అనే మాట ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కానీ ఇది నిజమని తెలిసింది. ఒత్తిడికి లోనైనప్పుడు సహజంగానే శరీరానికి నిస్సత్తువ ఆవరించినట్టు బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తెలియకుండానే ఏదైనా తీపి తినాలని అనిపిస్తుంది. అలా అనిపించగానే మహిళలు ఇంట్లోనూ, బయట పనిచేసేచోటా తీపి కోసం చాక్లెట్ ల మీదా బయట అమ్మే తీపి పదార్థాల మీద ఆధారపడతారు. ◆ చాలామంది మహిళలను వేధించే సమస్యలలో నిద్రలేమి ముఖ్యమైనది. నిద్రలేమి ఉన్నవారికి శరీరంలో కలిగే హార్మోన్స్ ప్రభావం వలన తీపి తినాలని అనిపిస్తుంది. ◆ అలసట అనేది మనిషిలో అంతర్లీనంగా భాగమైపోయి కనిపించే సమస్య. చాలామంది అలసటను గురైనప్పుడు చాక్లెట్ నోట్లో వేసుకోగానే ఎనర్జీ వచ్చినట్టు ఫీలవతారు. ఆ కారణంతో చాక్లెట్ లకు స్వీట్ లకు అలవాటు పడితే వాటికి ఆడిక్ట్ అయిపోతారు. ◆ శారీరక శ్రమ లేనివాళ్ళలో స్వీట్లంటే ఎక్కువ ఇష్టం ఉంటుందట. శరీరంలో ఏర్పడ్డ మార్పులు దీనికి కారణమవుతాయి. శారీరక శ్రమ లేనప్పుడు సహజంగానే మనుషులు మహా బద్ధకంగా కనిపిస్తుంటారు. వారికి స్వీట్లు, చాక్లెట్లు అంటే చెప్పలేని మక్కువ ఏర్పడుతుంది. ◆ శరీరంలో తగినంత నీతి శాతం లేకపోయినప్పుడు కూడా తీపి మీదకు మనసు మల్లుతుందట. బాడీ డీహైడ్రేషన్ అయినప్పుడు తీపి తినాలని అనిపించినా సందర్భాలు గుర్తుచేసుకుంటే ఇది నిజమేనని అనిపిస్తుంది. నోరు తడి ఆరిపోవడం తీపి తినాలని అనిపించడం గమనించవచ్చు. ఈ సమస్యకు చెక్ పెట్టాలి ఇలా…. తీపి తినాలని అనిపించినప్పుడు ఎక్కువ చెక్కెరలు కలిగిన పదార్థాలను టచ్ చేయకూడదు. తీపిని కంట్రోల్ లో పెట్టాలంటే కొన్ని టెక్నిక్స్ వాడాలి. ◆ తీపి తినాలని అనిపించినప్పుడు చాక్లెట్ లు తినడం చాలామంది అలవాటు.  డార్క్ చాక్లెట్ లు పెద్ద పెద్దవి కొనుక్కుని లాగిస్తారు. అలా చేస్తే చాలా మొత్తంలో కేలరీలు పొట్టలోకి చాలా సులువుగా వెళ్లిపోతాయి. పైపెచ్చు అంత పెద్ద చాక్లెట్ లు ప్రతిసారి కొనడం అంటే కష్టమే. అందుకే చిన్న చిన్న చాక్లెట్  లేదా పెద్ద చాక్లెట్ లో చిన్న ముక్కలు ఒక రెండు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కాసింత ఉత్సాహం వచ్చినట్టు ఉంటుంది. ◆ తీపి అంటే స్వీట్లు, చాక్లెట్లు మాత్రమే కాదు. తీపిని ఇచ్చే పదార్థాలు చాలా ఉంటాయి. చిలగడ దుంప, స్వీట్ కార్న్ మొదలైన వాటిలో తీపిదనం బానే ఉంది. కాబట్టి తీపి తినాలని అనిపించినప్పుడు వాటిని తీసుకోవచ్చు. ◆ తీపికి కేరాఫ్ అడ్రస్ గా డ్రై ఫ్రూట్స్ ని పేర్కొనవచ్చు. కిస్మిస్, ఖర్జూరం, అంజీర్ మొదలైన ఎండు ఫలాలలో తీపిదనం ఎక్కువ కాబట్టి తీసుకోవచ్చు. ◆ అన్నిటికంటే ఉత్తమమైనవి ఆరోగ్యమైనవి సహజమైన పండ్లు. అరటి, బొప్పాయి, దానిమ్మ, ఆరెంజ్, సపోటా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండు తీపిదనాన్ని నింపుకున్నదే. కాబట్టి తీపి కోసం మనసు కొట్టుకుంటున్నప్పుడు హాయిగా పండ్లను తీసుకోవచ్చు. ◆ తీపికి మరొక ఆప్షన్ తేనె, బెల్లం. తీపి తినాలని అనిపించినప్పుడు టీ స్పూన్ తేనె లేదా ఓ ముక్క బెల్లం నోట్లో వేసుకుంటే మంచిది. అమ్మో తీపి తినాలని అనిపిస్తుంది. తింటే లావైపోతాం. అనే సందేహాలు పెట్టుకోకుండా పైన చెప్పుకున్న ప్రత్యామ్నాయాలు ఫాలో అయితే సమస్యే ఉండదు.                                     ◆నిశ్శబ్ద.

బరువూ బరువూ ఎట్లా నీతో…. అంటున్నారా?

బరువూ బరువూ ఎట్లా నీతో…. అంటున్నారా? ఇదేదో సినిమాలో పాట కాదు. కొత్తగా వచ్చిన స్లోగన్ అంతకన్నా కాదు. అధికబరువు సమస్య ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ఇంటెన్షన్. ఏంటి నిజమేనా కాదా?? బయటకు అధిక బరువు వల్ల తమకేమీ ఇబ్బంది అనిపించట్లేదులే అనే అభిప్రాయం కలిగించేలా ఉన్నా అధిక బరువు ఉన్న ప్రతి ఒక్కరి మనసులో అందరికీ ఈ బరువు వల్ల చెప్పలేని చావొచ్చింది అనే ఫీలింగ్ తప్పకుండా ఉంటుంది. అయితే అధిక బరువు ఉన్న వాళ్ళు చాలామందిలో ఫుడ్ విషయంలో చాలా అపోహలు ఉంటాయి. మరీ ముఖ్యంగా వాళ్ళూ, వీళ్ళు చెప్పే సలహాలు, అక్కడా ఇక్కడా చూసిన చిట్కాలు అన్నీ ఫాలో అవుతూ ఉంటారు. ఎక్కువ మందిలో బరువు తగ్గాలి అంటే చపాతీ తినాలి అనే అపోహ  ముఖ్యమైనది. మొదట అందరూ తెలుసుకోవలసినది. మన శరీరం ఎత్తుకు తగిన బరువు ఉందా లేదా అనేది. ఎత్తు, ఎత్తుకు తగిన బరువు ఉన్న వారిలో ఇతర ఆరోగ్య సమస్యల ముప్పు తక్కువగా ఉంటుంది. కానీ ఎత్తుకు తగిన బరువు కంటే ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా కూడా ప్రమాదమే… ఈ బరువును బట్టి మాస్ ఇండెక్స్ తో కొలుస్తారు. ఇది మహిళలలో 30 కంటే ఎక్కువ ఉండకూడదు, అలాగే 23 కంటే తక్కువ ఉండకూడదు. ఆ రెండింటి మధ్య ఉన్నవారు సహజంగానే ఎత్తుకు తగిన బరువు కానీ దాని అటు ఇటుగా కొద్దిగా తేడాతో కానీ ఉండవచ్చు. ఇక చాలామందిలో ఉండే ముఖ్యమైన ఆలోచన చపాతీ తింటే బరువు తగ్గుతారా అని. అయితే చపాతీ అయినా, అన్నం అయినా వేరే ఏ టిఫిన్ అయినా దానిని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఏ ఆహారం అయినా ఎంత తింటున్నాం అనే దానిమీదనే ప్రతి ఒక్కరి బరువు ఆధారపడి ఉంటుంది. సాధారణంగా చాలామంది చపాతీ సూచించడానికి గల కారణం ఏమిటంటే వాటిని లెక్కపెట్టుకుని ఇన్ని అని తినచ్చు. అదే అన్నం అయితే ఒకటికి మూడు రకాల కూరలు ఉన్నప్పుడు ఎంత తక్కువ తిన్నా మూడింటితో కలిపి సుమరుగానే కడుపులోకి వెళ్ళిపోతుంది.  బరువు తగ్గాలి అనుకునేవారు చేయాల్సింది అన్నం మానేయడం, చపాతీ తినడం వంటి చిట్కాలు పాటించడం కాదు. బరువు తగ్గాలి అంటే తీసుకునే ఆహారంలో నూనెలు, తీపు, ఉప్పు, కారం, మసాలా దినుసులు మొదలైనవి తగ్గించుకోవాలి. తీపి తినాలని అనిపించినప్పుడు బెల్లం కానీ, తేనె కానీ, తీపిని ఎక్కువగా కలిగి ఉండే ఖర్జురం, కిస్మిస్, అంజీర్ వంటి ఎండు ఫలాలు కానీ చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి. అలా చేస్తే బరువు అనేది ప్రశ్నే కాదు. బయటకు వెళ్ళినప్పుడు అనుకోకుండానే మనస్సు ఫాస్ట్ ఫుడ్ వైపుకు వెళ్తుంది. అందుకే సాయంకాలాలలో అందరితో కలిసి అలాంటి చోటికి వెళ్లకుండా పార్కులు, గుడులు వంటి ప్రదేశాలకు వెళ్ళాలి. అలా వెళ్తే అక్కడ ఎంతో ప్రశాంతత లభిస్తుంది. పాలు పెరుగు తింటే లావు అవుతాము ఏమో అనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ వాటిని తీసుకోకపోతే కాల్షియం లోపిస్తుంది. కాబట్టి పాలు పెరుగు వాటి ఇతర ఉత్పత్తులు తీసుకోవాలి. ఓట్స్, సోయా, ఫైబర్ అధికంగా  ఉన్న వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా సహజంగా లభించే విటమిన్స్, ప్రోటీన్స్ ను శరీరానికి అందేలా చేయాలి. ఇలా చేస్తే బరువు బరువు నీతో ఎలా అని ప్రశ్న వేసుకునే బదులు బరువు బరువూ ఇదిగో ఇలా అని దానికి ఒక దారి చూపించేయవచ్చు.                                     ◆నిశ్శబ్ద.

Staying Fit During Festive Season

Staying fit during festive season This festive season is so very unique as we are just done with Dussera and now heading for Diwali.  This is the time to come out of the festival blues, at the same time need to gear up for the upcoming one. In this junction, if you neglect your fitness regime, it will surely effect your health. So, here are few tips help you to keep your fitness level intact. Must work out for 30 min: How much ever busy you are, never neglect your daily gym, yoga or workout classes. If you are occupied with guests or works to attend, at least take out half hour from your day and go for a walk. Switch on some festive music and dance on your own.. This will keep you healthy physically and mentally too. When we are preoccupied with things taking time for self gives us lot of relaxation. Fresh fruits and Green veggies: Consume more of fresh fruits or vegetable salads. Try to have a fruit dinner for a week to bring back your metabolism. Eating more salads before dinner also will compensate the oily and sweet food you have consumed in last couple of weeks. Avoid junk food: Saying ‘NO” is an art , and one must learn this when it comes to junk food. Festivals are the family time where food consumption will go out of control and we end up eating all the junk. So cut the junk food immediately from your diet so that your fitness levels will be maintained. Stay hydrated: Along with veggies and fruits, consume lot of water and stay hydrated. Staying hydrated helps  to keep your skin clear and your body healthy. It also keeps things “moving smoothly” in the digestive track, helping prevent stomach aches and improve bowel moments. By following above said simple tips you can be healthy, fit and fine. Just remember, don’t stress it. Even if you don’t get to do any of these things, or only add some of these tips in to your routine, just have fun! --Bhavana

Why You Should Eat More Of Broccoli

    Why You Should Eat More Of Broccoli     Broccoli is one vegetable which is filled with numerous health benefits for people of all ages. Broccoli basically belongs to the family of green leafy vegetables like cabbage, spinach and Brussels sprouts whose stalks and large flower heads are edible.  When you start to see all the great benefits of broccoli, you’ll now look to it as a go-to meal choice. Broccoli is one of those staple vegetables we were force-fed as children but continue to eat as adults. But the chemicals that produce that taste have health benefits that include protectingagainst several kinds of cancer - making this vegetable something of a wonder food. Broccoli has a lot of benefits for flawless skin. It is rich in antioxidants such as vitamins C and E. Vitamin C stimulates collagen production, thus keeping your skin healthy whereas vitamin A protects your skin cell membranes and prevents ultraviolet radiation damage. According to research quercetin found in broccoli is a natural anti-inflammatory agent, able to fight against aging. Vitamins B and E are also found in this delicious vegetable, and both are proven to give your skin a healthy glow. Broccoli contains a substance called glucoraphanin which gets converted into sulforaphane resulting in healthy skin and repairing of skin damage. Thus, eating broccoli renews your skin more quickly and gives your complexion a beautiful natural glow. It helps in detoxification of the body and straitening the immune system. Broccoli contains an unusual combination of three phytonutrients, glucoraphanin, gluconasturtiian, and glucobrassicin. Together these nutrients have a strong impact on our body’s detoxification system. Vitamin C, beta-carotene and other vitamins and minerals such as selenium, copper, zinc, and phosphorus present in dark green vegetables like broccoli can greatly improve your immune system, thus protecting you from various infections. Vitamins A and K, omega-3 fatty acids, amino acids and folate, on the other hand, add glamour and shine to your skin as well. Besides that, broccoli is also rich with ascorbic acid which helps detoxify the liver and is helpful for anyone in need of an immunity boost. Helps you stay away from a lot of health concerns. Studies have found that sulforaphane, a chemical compound found in broccoli, may be able to stop enzymes linked to joint deterioration and hinder inflammation. High amounts of vitamin K, also found in broccoli, can slow down the progression of osteoarthritis. there are a plenty of benefits to those who eat broccoli when battling a kidney disease. To patients with kidney disease, broccoli is especially helpful in preventing cardiovascular issues.Broccoli is filled with flavonoids, which are known for being the best cleaning agents of blood vessels. Eating broccoli is helpful in preventing infection being that it’s also abundant with vitamin C. It’s absolutely necessary for those suffering from any kidney issues to be wary of infection, and this super-vegetable can be one step closer to ensuring that. Researchers have proven that broccoli can prevent cancer. Broccoli has certain properties that can remove estrogens that cause cancer from the body. It has anti carcinogenic properties that prevents cancer. Broccoli is highly suitable to prevent breast and uterus cancer. It also fight cholesterol too. Broccoli’s amount of fiber may be great for our bowel movements, but it can be celebrated for more than that. Because broccoli is an invaluable source of soluble fiber, the vegetable can help lower cholesterol, especially when prepared by steaming it. So with all these amazing health benefits, there are more reasons for you to start including this magical vegetable in your diet for a healthier you!    ..Divya