మహిళల్లో మైగ్రేన్ సమస్యకు మూడు సింపుల్ ఆసనాలు.. మ్యాజిక్ చేస్తాయివి..
posted on Feb 10, 2024
మహిళల్లో మైగ్రేన్ సమస్యకు మూడు సింపుల్ ఆసనాలు.. మ్యాజిక్ చేస్తాయివి..
అసలు ఏ జబ్బు లేదు అనే మనుషులు ఈ కాలంలో లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మహిళల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య మైగ్రేన్. తలపై ఎవరో ఒకవైపు సుత్తితో మోదుతున్నట్టు, వికారంగానూ, అసహనాన్ని అనుభవిస్తున్న మహిళల శాతం ఎక్కువగానే ఉంది. మైగ్రేన్ ఉన్నవారు లైటింగ్ చూసినా, శబ్దాలు విన్నా నరకం అనుభవించినట్టే ఉంటుంది. అయితే మూడు మోగాసనాలు వేయడం ద్వారా మైగ్రేన్ తలనొప్పి ఉపశమనం పొందవచ్చు.
అసలు మైగ్రేన్ సమస్య ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా నయం చేయాలి?
మైగ్రేన్ అనేది నాడీ సంబంధిత రుగ్మత, ఇది తీవ్రమైన తలనొప్పి . దీని వల్ల కొన్నిసార్లు వికారం, వాంతులు ఉంటాయి. కానీ ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా దీనిని నయం చేయవచ్చు. యోగా వల్ల శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం అవుతుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఈ కారణంగా మైగ్రేన్ లక్షణాలు మెల్లిగా తగ్గడం ప్రారంభిస్తాయి.
అధోముఖ స్వానాసనం..
ఈ ఆసనం వేయడానికి మొదట బోర్లా పడుకోవాలి.
చేతులను భుజాల క్రింద ఉంచాలి.
ఇప్పుడు చేతులను కొద్దిగా ముందుకు తీసుకెళ్లండి.
తర్వాత కాలి వేళ్లపై బరువు తీసుకొచ్చి, శ్వాస వదులుతూ తుంటిని పైకి లేపాలి.
మోకాళ్లను నిటారుగా ఉంచి తలను చేతుల మధ్య ఉంచాలి.
ఇప్పుడు నడుము నిటారుగా ఉంచి, నెమ్మదిగా చీలమండలతో నేలను తాకాలి.
మార్జాలాసనం..
ఈ యోగా ఆసనం చేయడానికి , మోకాళ్ల మీద కూర్చోవాలి.
మీ చేతులను ముందుకు చాచి వెన్నెముకను సమాంతరంగా ఉంచాలి. శ్వాసను వదులుతున్నప్పుడు ఛాతీని, కడుపును లోపలికి తీసుకుంటూ వెన్నెముకను వంచాలి.
ఆ తరువాత మళ్ళీ సాధారణ శ్వాస తీసుకుంటూ నార్మల్ పొజీషన్ కు రావాలి.
ఇది సాధారణమైన తర్వాత మళ్లీ అదే విధానాన్ని రిపీట్ చేయాలి.
పద్మాసనం..
పద్మాసనం చిన్నప్పటి నుండి అందరికీ అనుభవంలో ఉన్నదే. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా ఉద్యోగాల నుండి భోజనం చేయడం వరకు అన్ని పనులు కుర్చీలలో కూర్చుని చేసుకుంటున్నాం. కానీ పద్మాసనం ఇప్పుడు మైగ్రేన్ సు చక్కని మందుగా మారింది.
కాళ్ళను మడిచి అటూ ఇటూ చేసుకుని కూర్చోవాలి.
ఇప్పుడు కుడిపాదాన్ని బయటికి తీసి ఎడమ తొడ మీద ఉంచాలి. తరువాత ఎడమ పాదాన్ని బయటకు తీసి కుడి తొడ మీద ఉంచాలి.
ఈ స్థితిలో కొద్దిసేపు సాధారణంగా శ్వాస తీసుకోండి.
ఈ పొజిషన్ ను కాళ్లు అటూ ఇటూ మార్చి మళ్లీ వేరుగా చేయాలి.
ఈ మూడు ఆసనాలు రోజూ వేస్తుంటే మహిళల్లో మైగ్రేన్ సమస్య చాలా వరకు కంట్రోల్ అవుతుంది.
*నిశ్సబ్ద