మహిళల మానసిక ఆరోగ్యం మీద ఫ్యాషన్ ప్రభావం ఉంటుందా!

Publish Date:Nov 21, 2024

  మహిళల మానసిక ఆరోగ్యం మీద ఫ్యాషన్ ప్రభావం ఉంటుందా!   ఫ్యాషన్ ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నిలబెట్టేది,  ఒక వ్యక్తి రూపాన్ని మార్చేసేది,  ఒక వ్యక్తిని అందంగా చూపెట్టేది.  ముఖ్యంగా అందంగా కనబడాలనే తపనతోనూ,  అందరిలో తాము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలని అనుకుంటారు.  అయితే ఫ్యాషన్ కు మానసిక ఆరోగ్యానికి మధ్య చాలా సంబంధం ఉందని అంటున్నారు మానసిక  నిపుణులు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. మానసిక ఆరోగ్యంపై ఫ్యాషన్ ప్రభావం.. మంచి బట్టలు.. మంచి బట్టలు వేసుకోవడం ఫ్యాషన్ లో భాగమే.. ఒక మనిషిని హుందాగా,  పది మందిలో గౌరవంగా నిలబెట్టడంలో వస్త్రధారణ కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల అందరిలో  చాలా సౌకర్యవంతంగా ఉండగలుగుతారు. దీన్ని బట్టి చూస్తే ఫ్యాషన్ అనేది మనిషి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  మనిషి మానసిక ఆరగ్యం పైన సానుకూల ప్రభావం చూపిస్తుంది.  ఒంటరితనం.. ఫ్యాషన్ అనేది  ఏ ఒక్కరో ఫాలో అయ్యే విషయం కాదు. ఫ్యాషన్ ను కొందరు ఉమ్మడిగా ఫాలో అవుతారు. ముఖ్యంగా ఫ్యాషన్ లో భాగంగా ఫ్యాషన్ షోలు,  ట్రెడిషన్,  వెస్ట్రన్,  ఫారిన్ అంటూ వివిధ రకాల కల్చర్ కు సంబంధించిన దుస్తులను అందరూ ఉమ్మడిగా ధరిస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు.  ఇది వ్యక్తిని ఒంటరితనం నుండి బయటకు తీసుకు వస్తుంది.  అంటే ఫ్యాషన్ అనేది మనిషిని సమాజంలో భాగం చేస్తుంది. ప్రతికూలత కూడా.. ఫ్యాషన్ అనేది కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ.. కొందరిని మానసిక ఒత్తిడిలోకి కూడా నెట్టుతుంది. ముఖ్యంగా ఫ్యాషన్ లో భాగంగా మానసిక ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. ఇతరులతో పోల్చుకోవడం,  ఇతరుల కంటే తాము ఫ్యాషన్ గా లేమని అనుకోవడం,  తమను తాము తక్కువ చేసుకోవడం.  ఇలాంటివన్నీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఫ్యాషన్ అనేది వ్యక్తిని ప్రత్యేకంగా ఉంచినా అది వ్యక్తి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది.  ఖరీదైన దుస్తులు,  ఖరీదైన ఆభరణాలు,  ఖరీదైన హ్యాండ్ బ్యాగులు,  వాచ్ లు, చెప్పులు.. ముఖ్యంగా మ్యాచింగ్ వేర్ అనేది ఫ్యాషన్ లో భాగం కాబట్టి చాలా ఖర్చు అవుతుంది.  ఇది ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుంది.  ఇది క్రమంగా ఒత్తిడి,  ఆందోళనకు దారితీస్తుంది. ఫ్యాషన్ ఇప్పట్లో చాలా వేగంగా మారిపోతుండటం వల్ల ఇది ఎక్కువగా ఉంది. ఫ్యాషన్ అనేది వ్యక్తిని ప్రత్యేకంగా నిలబెట్టేదే.. కానీ ఈ ఫ్యాషన్ ఫాలో అయ్యే పది మందిలో ఏ ఒక్కరో తగినంత ఫ్యాషన్ గా లేకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా మిగిలిన వ్యక్తుల నుండి వివక్ష ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ఫ్యాషన్ గా లేకపోవడాన్ని నేటి కాలంలో అనాగరికంగా భావించడం కూడా దీనికి కారణం. ఫ్యాషన్ లో పోకడలు ఏవైనా  సమాజ ఆమోద యోగ్యంగా ఉన్నంతవరకు ఎలాంటి నష్టం ఉండదు. కానీ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నా,  సమాజ కట్టుబాట్లకు భిన్నంగా ఉన్నా ఆ వ్యక్తిని దూరం ఉంచినట్టు,  ఆ వ్యక్తిని ఒంటరిగా ఉంచినట్టు చేస్తారు. పై కారణాలు అన్నీ గమనిస్తే.. ఫ్యాషన్ అనేది మనిషిని ఉన్నతంగానూ నిలబెట్టగలదు.. అదే విధంగా సమాజం నుండి వేరు చేసి దోషిగానూ నిలబెట్టగలదు.  మానసికంగా ఆత్మవిశ్వాసంగా ఉంచగలదు,  కృంగదీయగలదు కూడా.  వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఫ్యాషన్ ను ఫాలో అవ్వడం మంచిది.                                        *రూపశ్రీ.
[

Beauty

]

చర్మం మెరిసిపోవాలంటే.. ఈ సీరమ్ ను వాడాలి..!

Publish Date:Dec 3, 2024

  చర్మ సంరక్షణ అమ్మాయిల లైఫ్ స్టైల్ లో చాలా ముఖ్యమైపోయింది. ఆహారం దగ్గర అయినా రాజీ పడతారేమో కానీ.. చర్మ సంరక్షణ దగ్గర ఏమాత్రం తగ్గేది లేదంటారు ఈ కాలం అమ్మాయిలు. అయితే ముఖం ఎప్పుడూ మెరుస్తూ ఉండాలన్నా.. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా,  వయసు పెరిగినా యవ్వనంగా ఉండాలన్నా చర్మానికి సీరమ్ చేసే మేలు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా విటమిన్-సి సీరమ్ అయితే చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా,  చర్మం మెరుస్తూ ఉండాలన్నా విటమిన్-సి సీరమ్ ను ఎంచుకోవడం తెలివైన మార్గమని చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు.  ఇంతకీ విటమిన్-సి సీరమ్ వాడటం వల్ల కలిగే మేలు ఏంటో తెలుసుకుంటే.. విటమిన్-సి సీరమ్  మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఈ మెలనిన్ ఎక్కువ అయితే ముఖం మీద మచ్చలు,  పిగ్మెంటేషన్ వంటివి వస్తాయి. అదే మెలనిన్ ఉత్పత్తి తగ్గితే  చర్మం క్లియర్ గా ఉంటుంది. అంతే కాదు.. చర్మాన్ని బిగుతుగా యవ్వనంగా, దృఢంగా ఉంచడంలో కూడా విటమిన్-సి సీరమ్ సహాయపడుతుంది. విటమిన్-సి గొప్ప యాంటీ ఆక్సిడెంట్.. ఇది చర్మాన్ని రక్షిస్తుంది.  ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మం  దెబ్బతినే సమస్యను తగ్గిస్తుంది.  విటమిన్-సి చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది. సన్ స్క్రీన్ తో పాటు విటమిన్-సి సీరమ్ వాడుతుంటే  హానికరమైన సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు.   విటమిన్-సి యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది.  ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మాన్ని సాగేలా చేస్తుంది.  చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది.  ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది.   చర్మం మీద కొన్ని మచ్చలు వస్తాయి.  ఇవి మెలిస్మా,  పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యల వల్ల వస్తాయి.   ఇవి తగ్గిపోవడంలోనూ, చర్మం తిరిగి సాధారణ రంగులోకి వచ్చి కాంతివంతంగా మారడంలోనూ విటమిన్-సి సహాయపడుతుంది. ప్రతిరోజూ ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత  టోనర్  ను అప్లై చేయాలి. ఇలా చేస్తే చర్మం PH స్థాయి బ్యాలెన్స్ గా ఉంటుంది. దీని తరువాత ముఖానికి విటమిన్-సి సీరమ్ ను కొన్ని చుక్కలు తీసుకుని అప్లై చేయాలి.  ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.  చర్మానికి సీరమ్ అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే చర్మం రోజంతా మృదువుగా, కాంతివంతంగా,  ఆరోగ్యంగా ఉంటుంది. పగటి సమయంలో విటమిన్-సి సీరమ్ ను ముఖానికి అప్లై చేస్తే గనక దాని తరువాత ఎల్లప్పుడూ సన్ స్క్రీన్ ను అప్లే చేయాలి. 10-15%  విటమిన్-సి ఉన్న సీరమ్ ను ఉపయోగించాలి.  ఇది చర్మం చికాకును, వాపు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.                                              *రూపశ్రీ.
[

Health

]

నెలసరి మూడురోజుల్లో ఈ అయిదు పనులు అస్సలు చేయకండి!

Publish Date:Nov 28, 2024

నెలసరి మూడురోజుల్లో ఈ అయిదు పనులు అస్సలు చేయకండి! ప్రకృతి మహిళలకు మాత్రమే ఏర్పాటు చేసిన వ్యవస్థ ఋతుచక్రం, గర్భధారణ, ప్రసవం మొదలైనవి. అయితే పీరియడ్స్ సమయంలో మహిళల ప్రవర్తనను, అలవాట్లను చూసి కొంతమంది విమర్శిస్తుంటారు. మరికొందరు పెదవి విరుస్తుంటారు. అయితే నెలసరి సమయంలో మహిళలు తమ గురించి  తాము కేర్ తీసుకోవడం చాలా అవసరం. కేవలం మహిళలే కాదు, ఆ సమయంలో మగవారు కూడా మహిళలకు తమదైన సహాయం, సహకారం అందించాలి. ఎందుకంటే  కొన్ని పనులు చేయడం వల్ల పీరియడ్స్ బాధాకరంగా మారుతుంది.  అయితే పీరియడ్స్ సమయంలో మహిళలు   అయిదు పనులు అస్సలు చేయకూడదు. ఇంతకీ అవేంటి?? ఎందుకు చేయకూడదు?? పూర్తిగా తెలుసుకుంటే.. పీరియడ్స్ సమయంలో ఈ 5 తప్పులు చేయకండి.. యోగా.. పీరియడ్స్ సమయంలో యోగా చేసే అలవాటు ఉన్న మహిళలు  యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శరీరాన్ని తలకిందులు చేసే యోగాసనాలు వేయడం మానుకోవాలి. సర్వంగాసనం, శీర్షాసనం,  హలాసనం మొదలైన వాటిలో కాళ్ళను పైకి లేపాల్సి ఉంటుంది.  దీని కారణంగా రక్తస్రావం యొక్క సహజ గురుత్వాకర్షణ ప్రవాహం చెదిరిపోతుంది.  వర్కౌట్.. యోగా.. వర్కౌట్ వేరు వేరు అయినా అవి శరీరం మీద ఒత్తిడి కలిగించేవే.. ఈ సమయంలో వర్కవుట్ అయినా ఇంటెన్స్ యాక్టివిటీ చేయకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ పెరగడం మొదలవుతుంది.  శరీరం రిలాక్స్‌గా ఉండదు. హెవీ వర్కవుట్స్ వల్ల పొట్టపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. విశ్రాంతి.. పీరియడ్స్ సమయంలో విశ్రాంతి ఉండాలి అనే నెపంతో చాలామంది రోజంతా పడుకునే ఉంటారు. అయితే ఇలా రోజంతా మంచం మీద పడుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే నెలసరి కాలంలో నొప్పి,  తిమ్మిరి చాలా తీవ్రంగా ఉంటుంది. పడుకునే ఉండటం వల్ల కూడా ఇవి అధికమయ్యే అవకాశం ఉంది. నెలసరి  సమయంలో  లైట్ స్ట్రెచింగ్, వాకింగ్  బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. దీని వల్ల మానసిక స్థితిని మెరుగుపరిచే హార్మోన్లు పెరుగుతాయి,  నొప్పి కూడా తగ్గుతుంది. ఆహారం..  పీరియడ్స్ సమయంలో చిప్స్, చాక్లెట్, బర్గర్ లాంటివి తినాలని అనిపిస్తుందని చాలా మంది అంటూ ఉంటారు. కానీ వీటిని ఆపేయడం మంచిది.   వీటిలో పోషకాహారంకు బదులుగా  కేలరీలు ఉంటాయి, దీని కారణంగా శరీరానికి నిజమైన పోషకాహారం లభించదు. పైపెచ్చు బరువు పెరగడానికి దారి ఇస్తుంది.  తలస్నానం.. నెలసరిలో ఉన్నప్పుడు తలస్నానం చేయడం గురించి చాలా వాదనలు ఉన్నాయి. తలస్నానం చేయచ్చని, చేయకూడదని వైద్యులు,  సైన్స్  అంగీకరించడం లేదు, అయితే యోగా ప్రకారం, పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయకూడదు.  తలపై నీటిని పోయడం వల్ల, అపాన వాయువు క్రిందికి ప్రవహిస్తుంది, ఇది హానికరం.  ఈ అయిదు పనులు ఆ మూడు రోజులు చేయకుండా ఉంటే లాభాలే తప్ప నష్టాలేమి లేవు. కాబట్టి వీటిని ఫాలో అయితే మంచిది.                                   *నిశ్శబ్ద.

ఎముకల ధృడత్వం కోసం ఏం చెయ్యాలో తెలుసా...?

Publish Date:Nov 18, 2024

ఎముకల ధృడత్వం కోసం ఏం చెయ్యాలో తెలుసా...? ఎముకలు దృఢం ఉండాలన్నా, వృద్దాప్యంలో ఆస్టియోపోరోసిస్ కి దూరంగా ఉండాలన్నా శరీరానికి తగినంత కాల్షియం చాలా అవసరం. అయితే కేవలం ఎక్కువ కాల్షియం తీసుకోవడమే కాదు, దానికి తగినట్లుగా వ్యాయామం కుడా చెయ్యాలని అంటున్నారు పరిశోధకులు. యూనివర్సిటీ ఆఫ్ సిన్ సినాటి మెడికల్ సెంటర్ కి చెందిన పరిశోధకులు తాజాగా చేపట్టిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. కాల్షియం తీసుకోవడంతో పాటు సరైన వ్యాయామం చేస్తేనే ఎముకలు దృడంగా రూపొందుతాయని, పాతికేళ్ళు దాటినా వారు రోజుకు వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకుంటూ ఉండాలి. అదే విధంగా రోజులో కనీసం 20 నిముషాలు నడవడం, మెట్లెక్కడం, స్టెప్ ఏరోబిక్స్ లాంటివి చేస్తే చక్కటి ఫలితం ఉంటుందని వీరి పరిశోధన చెప్తోంది. మరి కాల్షియం మన శరీరానికి ఎంత ముఖ్యమో... వ్యాయామం కూడా అంతే ముఖ్యం.
[

Yoga

]

మంచి అలవాట్లు - దినచర్య

Publish Date:Nov 26, 2024

  సారవంతమైన భూమిలో పంటలు బాగా పండుతాయి. అయితే భూమిని సారవంతం చేయుటకు రైతు కష్టపడి, అందులోని పనికిరాని మొక్కల్ని తొలగించి, దున్ని, నీరుబట్టి, ఎరువులు వేసి అపరిమితంగా కృషి చేస్తాడు. అప్పుడు ఆ భూమి సిరుల పంటలు పండిస్తుంది. మానవ శరీరం కూడా భూమి వంటిదే. దాన్ని అదుపులో వుంచి చెడును తొలగించి మంచిని పెంచితే పురుషార్ధాన్ని సాధిస్తుంది. శరీరాన్ని సత్వపధాన పయనింప చేయుటకు మంచి అలవాట్లు ఎంతగానో సహకరిస్తాయి. అవి యోగాభ్యాసానికి అనుకూలంగా శరీరాన్ని మనస్సును మలుస్తాయి. మన అలవాట్లు మంచివైతే అందరూ మనల్ని ఆదరిస్తారు. మంచి అలవాట్లు మనిషికి క్రమ శిక్షణ, సచ్చీలత, సత్సంప్రదాయాల్ని నేర్పుతాయి. చిన్నతనం నుంచి బాలబాలికలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత. అయితే యిప్పుడు రకరకాల ప్రలోభాలకు, ఆకర్షణలకు లొంగి యువకులు, పెద్దవాళ్ళేగాక బాలబాలికలు సైతం చెడు అలవాట్లకు లోనవుతున్నారు.ఈ చెడును తొలగించడం దేశ పౌరులందరి కర్తవ్యం. యోగాభ్యాసం వల్ల మంచి అలవాట్లు సాధకులకు అలవడుతాయి. దినచర్య, ఆహరం, ఉపవాసం, నీళ్ళు, మలవిసర్జన, మూత్రవిసర్జన, స్నానం, నిద్రలను గురించిన వివరాలు తెలుసుకొని, వాటిని సక్రమంగా అమలుబరిస్తే యోగాభ్యాసం తప్పక విజయం సాధిస్తుంది. 1. దినచర్య : ఆరోగ్యంగా వుండటానికి క్రమశిక్షణతో కూడిన దినచర్య అవసరం. ప్రతిదినం మనం చేసే పనులు సరిగాను, సక్రమంగాను వుండాలి. అంటే దినచర్య మంచిగా వుండాలన్నమాట. ప్రతిరోజూ రాత్రిళ్ళు త్వరగా పడుకొని ప్రొద్దున్నే త్వరగా లేచి దాహం వేసినా వేయకపోయినా చెంబెడు లేక గ్లాసెడు మంచినీళ్ళు తాగాలి. మలమూత్ర విసర్జన కావించి, ముఖం కడుక్కొని ఉదయం అవకాశం దొరికితే వాహ్యాళికి వెళ్ళాలి. తరువాత స్నానం చేయాలి. ముఖం కడుక్కునేప్పుడు నాలిక మీడగల పచిని బద్దతో తప్పక గీకివేయాలి. చాలా మంది పుక్కిలించి ఉమ్మి వూరుకుంటారు. అది సరికాదు. అంతే గాక నోటి లోపలి కొండనాలుకను చేతిబోతన వ్రేలితో (గోరు తగలకుండా చూసుకొని) రెండు మూడు సార్లు కొద్దిగా నొక్కి శుభ్రం చేయాలి. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం చేసిన తరువాత పళ్ళు తోముకోవాలి. అందువల్ల పళ్ళకు, చిగుళ్ళకు, నాళికకు, నోటికి అంటిన చెడు తొలగిపోతుంది. సూదులతోను, గుండు సూదులతోను పళ్ళు కుట్టుకోకూడదు. ఏమి తిన్నా నోటిలో నీళ్ళు పోసుకుని రెండు మూడుసార్లు తప్పక పుక్కిలించి ఉమ్మివేయాలి. సాధ్యమైనంత వరకు చన్నీళ్ళతో స్నానం చేయడం మంచిది. చలికాలంలోనూ, బాగా జబ్బు పడినప్పుడు గోరు వెచ్చని నీటితో శరీరాన్ని బాగా రుద్దుతూ స్నానం చేయవచ్చు. శరీర మాలిన్యం తొలగడమే స్నానం యొక్క లక్ష్యం కావాలి. మనం ధరించే బట్టలుబిగుతుగా వుండక, వదులుగా వుండాలి. ప్రతిరోజూ ఉతికిన బట్టలు ధరించాలి. కొన్ని గ్రామాల్లో యిప్పటికీ ఉతికిన బట్టలు జనం ధరిస్తూ వుంటారు. కానీ అన్ని చోట్ల యిది సాధ్యం కావడం లేదు. అయినప్పటికీ ఉతికిన బట్టలు ధరించడం అన్ని విధాల మంచిది. నిద్ర ప్రతి జీవికి అవసరం. హాయిగా నిద్రపడితే ఆ మనిషి ఆరోగ్యంగా వున్నట్లు భావించాలి. నిద్రపట్టకపోవడం ఆనారోగ్యానికి గుర్తు, పడుకునే ప్రదేశం శుభ్రంగాను, గాలి వెలుగు వచ్చే విధంగానూ వుండాలి. మంచం లేక చాప, పరుపు, పక్క గుడ్డలు శుభ్రంగా వుండాలి. ఇతరులతో మంచిగాను, తీయగాను మాట్లాడాలి. సత్యం పలుకుతూ వుండాలి. అయితే సత్యం ప్రకటించే విధానం కటువుగా వుండక, మంచిగా మధురంగా వుండాలి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్ అని సూక్తి కదా ! స్వార్ధచింతనను తగ్గించుకొని చేతనైనంత వరకు పరులకు ముఖ్యంగా నిస్సహాయులకు, దీనులకు, రోగులకు సేవ, సాయం, మంచి చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ పడుకోబోయే ముందు ఆనాటి తన దినచర్యకు ప్రతివ్యక్తి సమీక్షించుకొని, రేపటి దినచర్యను నిర్ధారించుకోవాలి. ఏనాటికానాడు తాను చేసిన పొరపాట్లను గమనించుకోవాలి. ముఖ్యమైన విషయాలకు డైరీలో తేదీల వారీగా వ్రాసుకోవాలి. యీ విధమైన దినచర్యకు ప్రతి వ్యక్తి అలవాటు పడితే, క్రమశిక్షణ అలవడుతుంది. తద్వారా దేశానికి మేలు జరుగుతుంది.

బొమ్మలతో పౌష్టికాహారం పట్ల అవగాహన

Publish Date:Nov 25, 2024

  బొమ్మలతో పౌష్టికాహారం పట్ల అవగాహన ప్రముఖ బాల సాహితీవేత్త, వైద్య ఆరోగ్య సైన్స్ రచయిత్రి డాక్టర్ కందేపి రాణీప్రసాద్ నూతనంగా ఒక కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పండ్లు ఫలాలను తింటే ఆరోగ్యం లభిస్తుందని అందరికీ తెలుసు. అయితే పిల్లలు అన్ని ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడరు. ఆ విషయం మాతృమూర్తులందరికీ విదితమే. పండ్లతో, డ్రై ఫ్రూట్స్.తో అనేక రకాల బొమ్మలను చేసి పిల్లలకు చూపించడం వలన ఆయా ఆహార పదార్థాల పట్ల ఆసక్తి కలుగుతుందని ఆలోచించిన రాణీప్రసాద్ డ్రైఫ్రూట్స్.తో అనేక బొమ్మల్ని సృష్టిస్తున్నారు. ఆయా బొమ్మల్ని పిల్లలకు చూపించి అందులోని పోషక పదార్థాల విలువల్ని వివరిస్తూ తల్లీ పిల్లలను చైతన్య పరుస్తున్నారు. అంజీర్లు, బెర్రీ పండ్లు, చెర్రీ పండ్లు, బాదంపప్పు జీడి పప్పు, పిస్తా, పప్పు, కిస్‌మిస్‌లు, చియా సీడ్స్, వంటి అనేక రకాల డ్రైఫ్రూట్స్.తోనూ, యాపిల్, అరటి, బత్తాయి, కమలా, అవకాడో, జుకినీ, కివీ, డ్రాగన్ వంటి పండ్లతోనూ అనేక బొమ్మలు తయరుచేసి తమ ఆసుపత్రికి వచ్చే పిల్లలకు ఎగ్జిబిషన్ల ద్వారా చూపిస్తున్నారు. వాటిని ఎలా తయారు  చేసుకోవచ్చో, వాటిలోని పోషకాలు ఏమిటో కూడా వివరిస్తున్నారు. అంతే కాక వాటిని వ్యాసాలుగా రాసి పత్రికల్లో ప్రచురిస్తున్నారు. పిల్లలకు డ్రైఫ్రూట్స్ తినడం పట్ల ఆసక్తిని కలగజేయడం లక్ష్యంగా బొమ్మలు తయారు చేస్తున్నానని రాణీప్రసాద్ చెప్పారు పిల్లలు పౌష్టికాహారం తీసుకోకపోవడం అనేది చాలా పెద్ద సమస్య. ఈ సమస్యకు రాణీప్రసాద్ తన కళల ద్వారా పరిష్కారం చూపుతున్నారు. పిల్లలకు నోటితో చెప్పడం కన్నా చిత్రాల ద్వారా కథల ద్వారా చెప్పటం వల్ల ఎంతో ఉపయోగముంటుంది. తమ ఆసుపత్రికి వచ్చే చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే డ్రైఫ్రూట్స్ విలువనూ, ఉపయోగాన్నీ చక్కగా వివరించి చెపుతున్నారు. రాణీప్రసాద్ ఇంతకు ముందే పొడుపు కథల ద్వారా పిల్లలకు మానవ శరీర ఆవయవాల్ని పరిచయం చేశారు. అలాగే పిల్లల తల్లుల కోసం ‘మెడికల్ రంగోలీ’ తయారు చేసి వైద్య శాస్త్రాన్ని ముగ్గుల్లోకి రప్పించారు. పోలియో చుక్కలు, టీకాలు వేయించే వాటిని కవితలుగా మలిచి తమ ఆసుపత్రి ప్రిస్కిప్షన్ ప్యాడ్ మీద ప్రింటు చేస్తూ ప్రజల్ని చైతన్యవంతంగా మలుస్తున్నారు. ఇప్పుడు పిల్లలకు బలవర్ధకమైన ఆహారం మీద ఇష్టాన్నీ ప్రేమనూ పెంచడానికి తన కళల ద్వారా ప్రయత్నిస్తున్నారు. కళ అనేది తమ మానసిక ఆనందం కోసమే కాకుండా పదుగురినీ జాగృతం చేసేది అని రాణీ ప్రసాద్ నిరూపిస్తున్నారు.

సుగంధ నూనెలతో ఇల్లు పరిమళభరితం

Publish Date:Nov 15, 2024

సుగంధ నూనెలతో ఇల్లు పరిమళభరితం ఇల్లు పరిమళభరితంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఐతే కొన్నిసార్లు వంట చేసిన తరువాత ఏర్పడే ఘాటు వాసనలతో, గాలి, వెలుతురు లేక ఏర్పడే దుర్వాసనలతో ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అటువంటి సమస్యలని రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించుకోవచ్చు. 1. అరబకేట్ నీటిలో పావుకప్పు వెనిగర్, పెద్ద చెంచా నిమ్మరసం నూనె కలిపి గదిలో కాస్త చల్లితే.. గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణంతో నిండిపోతుంది. 2. కార్పెట్లు మురికిగా మారి దుర్వాసన వస్తుంటే.... కప్పు బేకింగ్ సోడాకి, చెంచాడు ఏదైనా సుగంధ నూనేలని కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ పై చల్లి తెల్లారి వాక్యుమ్ క్లీనర్ తో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. 3. కిటికీ అద్దాలు దుమ్ముపట్టి ఉంటే కప్పు వెనిగర్ కి చెంచా లావెండర్ పరిమళన్ని జోడించి తుడిస్తే సరి. అవి తలుక్కుమనడమే కాకుండా సువాసనభరితంగా కూడా ఉంటాయి. 4. వంట చేసిన తరువాత గది అంతా ఆవరించే ఘాటు వాసనలు తొలగిపోవడానికి ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని దానిలో దాల్చిన చెక్కని వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెదజల్లుతుంది. 5. దుస్తులు ఒక్కచోట పోగుపడి.. ముక్కిపోయిన వాసన వస్తుంటే ఎండలో ఆరవేయ్యాలి. వీలుకానప్పుడు నిమ్మ, లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలుని ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచితే సరిపోతుంది.

Happy Pongal Muggulu With Dots

Publish Date:Jan 13, 2023

Happy Pongal Muggulu With Dots Muggulu symbolizes happiness and prosperity.It is believed that they create humbleness on welcoming the visitors.

Pongal Muggulu

Publish Date:Jan 13, 2015