ఈజీగా బరువు తగ్గాలంటే ఈ పండ్లు తినాల్సిందే..!
posted on Jan 9, 2024
ఈజీగా బరువు తగ్గాలంటే ఈ పండ్లు తినాల్సిందే..!
కాస్త బొద్దుగా ఉన్నా సరే చాలామంది అమ్మాయిలు తెగ ఫీల్ అయిపోతారు. సన్నగా నాజుగ్గా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం అనేమాట అటుంచితే మంచి బట్టలు వేసుకోవచ్చు, అందంగా కనిపించవచ్చు అనేది వారి ఇన్నర్ ఫీలింగ్. అయితే బరువు పెరిగినంత ఈజీగా బరువు తగ్గడం జరగదు. చాలామంది బరువు కారణంగా డిప్రెషన్ లోకి కూడా వెళుతుంటారు. అయితే ప్రతిరోజూ ఆహారంలో పండ్లు చేర్చుకోవడం వల్ల బరువు సులువుగానే తగ్గవచ్చు. బరువు తగ్గడానికి ఉపయోగపడే పండ్లు ఏంటో తెలుసుకుంటే..
పుచ్చకాయ..
పుచ్చకాయ వేసవికి ఎంతోమంది ఫెవరేట్ పండు. అదికశాతం నీటితో నిండిన ఈ పండు తీసుకుంటే బరువు ఈజీగా తగ్గవచ్చు. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఈ పండు తింటే కడుపు నిండిన ఫీల్ ఉంటుంది. బీపి, కడుపు సంబంధ సమస్యలు, అధిక బరువు, కాలేయం సమస్యలు అన్నీ తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలలో ఉన్నప్పుడు పుచ్చకాయ కనబడితే దాన్ని అస్సలు వదలకండి.
అరటి పండ్లు..
అరటిపండ్లు అందరికీ బెస్ట్ ఫ్రెండ్లు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. అరటిపండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిలో పొటాషియం, విటమిన్-బి6 సమృద్దిగా ఉంటాయి. కేలరీలు కూడా తక్కువే. పైబర్ ఉండటం మూలాన ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ కలిగిస్తుంది. నూనెలు, అధిక చక్కెర, అధిక కార్భోహైడ్రేట్లు ఉన్న ఆహారానికి బదులు రోజులో రెండు అరటి పండ్లు తీసుకుంటూ ఉంటే బరువు తగ్గడం సులువు అవుతుంది.
యాపిల్స్..
యాపిల్స్ లో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ ఉంటాయి. పైపెచ్చు యాపిల్ లో పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. ఒక యాపిల్ తినగానే ఇక కడుపు నిండిపోయిందని అంటుంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి కూడా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే ఫాలీపెనాల్స్ బరువు తగ్గిస్తాయి.
జామ..
జామ పండ్లను మధుమేహరోగులకు ది బెస్ట్ అని చెబుతారు. అయితే మధుమేహం ఉన్నవారికే కాదు.. బరువు తగ్గాలని అనుకునే వారికి కూడా ఇది గొప్ప ఫలితాలు చేకూరుస్తుంది. జామపండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ. ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది. విటమిన్స్, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
దానిమ్మ..
దానిమ్మ పండు కూడా బరువు తగ్గించడంలో aచాలా సహాయపడుతుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ దానిమ్మను తీసుకుంటూ ఉంటే ఈజీగా బరువు తగ్గుతారు.
*నిశ్శబ్ద.