రోజూ ఈ డ్రింక్ తాగితే చాలు.. ముఖం మీద ముడతలు మంత్రించినట్టు మాయమవుతాయట..!


రోజూ ఈ డ్రింక్ తాగితే చాలు.. ముఖం మీద ముడతలు మంత్రించినట్టు మాయమవుతాయట..!

 


ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి, ఇతర చర్మ సమస్యలను దూరం చేసుకోవడానికి ఎన్నో రకాల క్రీములు, మందులు వాడుతూ ఉంటాం. కానీ వాటి వల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.  అలాంటి వాటిని దూరంగా ఉంచి సహజ పదార్ధాలను ఉపయోగించడం ద్వారా  చర్మాన్ని ఆరోగ్యంగా,  యవ్వనంగా ఉంచుకోవచ్చు. ఇందుకోసం  ముఖానికి అప్లై చేసే ఇంటి టిప్స్ తో పాటు ఇంట్లో తయారు చేసుకుని తాగే పానీయాలు కూడా ప్రభావవంతంగా ఉంటాయి.  కేవలం రెండు రకాల విత్తనాలు ఉపయోగించి చేసుకునే ఈ డ్రింక్ తాగితే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుందట. కొల్లాజెన్ చర్మానికి ఎలాస్టిక్ గుణాన్ని ఇస్తుంది.  చర్మం వదులుగా మారకుండా బిగుతుగా ఉండేలా చేస్తుంది.

గ్లోయింగ్ స్కిన్ డ్రింక్..

 ముఖానికి సంబంధించిన సమస్యలకు ప్రధాన మూలం  పొట్ట,  శరీరం. చర్మానికి ఏవేవో అప్లై చేయడం వల్ల ఈ సమస్య అస్సలు తగ్గదు. దీనికి లోపలి నుండి వైద్యం అవసరం అవుతుంది. చర్మం  అవసరాలు, దాని  సమస్యలను అర్థం చేసుకోవడం..  శరీరానికి ఏమి అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  చర్మం వదులుగా కనిపించడం ప్రారంభించినప్పుడు.. దాని రంగు క్రమంగా తగ్గడం  ప్రారంభించినప్పుడు కింద చెప్పబోతున్న డ్రింక్ తాగాలి.  ఇది కొల్లాజెన్ లోపాన్ని భర్తీ చేయడంలో.. చర్మాన్ని బిగుతుగా చేయడంలో  ప్రయోజనకరంగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు..

అవిసెగింజలు.. 1 టీ స్పూన్

సబ్జా గింజలు.. 1 టీస్పూన్

నీరు.. 1 గిన్నె

నారింజ రసం.. 200మి.లీ(ఆరెంజ్ రసం కు బదులు సిట్రస్ జ్యూస్ ఏదైనా వాడచ్చు)

నిమ్మరసం.. 1 టీస్పూన్

తయారీ విధానం..

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 1 స్పూన్ సబ్జా గింజలు వేసి 10 నిమిషాలు నానబెట్టాలి.

 పాన్‌ను కొద్దిగా వేడి చేసి అందులో అవిసె గింజలను వేయించి మెత్తగా  పౌడర్‌లా చేసుకోవాలి.

 ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ లేదా సిట్రస్ జ్యూస్  తీసుకుని అందులో అవిసె గింజల పొడి, నానబెట్టిన సబ్జా గింజలు వేసి బాగా కలపాలి.

ఈ పానీయం రోజూ తాగాలి. క్రమంగా  ముఖంలో సహజమైన మెరుపు ఎలా కనిపించడం ప్రారంభిస్తుందో చూసి ఆశ్చర్యపోతారు. .

ఎలా పనిచేస్తుందంటే..

ఈ డ్రింక్  మొదటి పదార్ధం అవిసె గింజలు..  వీటిలో ఒమేగా-3,  లిగ్నాన్స్‌ పుష్కలంగా ఉంటాయి.  ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి,  చర్మపు మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్న ఈ పానీయం చేయడానికి సబ్జా విత్తనాలను కూడా ఉపయోగించారు. ఇవి  చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి, చర్మాన్ని  హైడ్రేట్ గా ఉంచుతాయి. మూడవ పదార్ధం నారింజ లేదా నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది  సహజ కొల్లాజెన్ సంశ్లేషణను మెరుగుపరచడంలో,  చర్మాన్ని కాంతివంతం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది .


                                      *రూపశ్రీ.