ఎముకల ధృడత్వం కోసం ఏం చెయ్యాలో తెలుసా...?

ఎముకల ధృడత్వం కోసం ఏం చెయ్యాలో తెలుసా...?

ఎముకలు దృఢం ఉండాలన్నా, వృద్దాప్యంలో ఆస్టియోపోరోసిస్ కి దూరంగా ఉండాలన్నా శరీరానికి తగినంత కాల్షియం చాలా అవసరం. అయితే కేవలం ఎక్కువ కాల్షియం తీసుకోవడమే కాదు, దానికి తగినట్లుగా వ్యాయామం కుడా చెయ్యాలని అంటున్నారు పరిశోధకులు. యూనివర్సిటీ ఆఫ్ సిన్ సినాటి మెడికల్ సెంటర్ కి చెందిన పరిశోధకులు తాజాగా చేపట్టిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. కాల్షియం తీసుకోవడంతో పాటు సరైన వ్యాయామం చేస్తేనే ఎముకలు దృడంగా రూపొందుతాయని, పాతికేళ్ళు దాటినా వారు రోజుకు వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియం తీసుకుంటూ ఉండాలి. అదే విధంగా రోజులో కనీసం 20 నిముషాలు నడవడం, మెట్లెక్కడం, స్టెప్ ఏరోబిక్స్ లాంటివి చేస్తే చక్కటి ఫలితం ఉంటుందని వీరి పరిశోధన చెప్తోంది. మరి కాల్షియం మన శరీరానికి ఎంత ముఖ్యమో... వ్యాయామం కూడా అంతే ముఖ్యం.