English | Telugu

Rithu Chowdary love Story: రీతూ చౌదరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ!

బిగ్ బాస్ సీజన్-9 మొదలై అప్పుడే మూడు వారాలు పూర్తయింది. ఈ మూడు వారాల్లో ఒకరు సెలెబ్రిటీ ఎలిమినేట్ అవ్వగా.. ఇద్దరు కామనర్స్ ఎలిమినేషన్ అయ్యారు. అయితే నిన్నటి సండే ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి షాకిచ్చాడు నాగార్జున.

బిగ్‌బాస్ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైమ్.. మీకు ఉన్న ఫ్యాన్స్‌ నుంచి కొశ్చన్స్ తెప్పించి.. మీ ఆటతీరు మార్చడానికి చేసే ప్రయత్నం ఇది అంటూ నాగార్జున అన్నాడు‌. ఇక అక్కడ ఉన్న ఆడియన్స్‌తో వాళ్లు చెప్పేది జెన్యూన్ ఆన్సర్ అనుకుంటే యస్ నొక్కండి లేదనుకుంటే థంబ్స్ డౌన్ నొక్కండి అని ఆడియన్స్ కి నాగార్జున చెప్పాడు. ముందుగా రీతూ చౌదరికి వచ్చిన ప్రశ్నని నాగార్జున అడిగాడు. మీరు మీ గేమ్ కన్నా డీమాన్ పవన్ కోసం ఎక్కువ ఆడుతున్నారని నాగార్జున అనగా.. నా గేమ్ నేను ఆడుతున్నాను కానీ పవన్‌తో నాకు ఒక ఎఫెక్షన్, ఫ్రెండ్లీ బాండ్ ఉంది అంతే అంటూ రీతూ సమాధానమిచ్చింది. కానీ రీతూ ఆన్సర్‌కి 35 పర్సంట్ యస్.. 65 పర్సంట్ థంబ్స్ డౌన్.. ఇచ్చారు ఆడియన్స్. తర్వాత సుమన్ శెట్టితో మీ మాటల్లో ఉన్నంత పంచ్ గేమ్‌లో ఎందుకు లేదని నాగార్జున అడిగాడు. గేమ్ విషయంలో కానీ టాస్క్ విషయంలో కానీ నా ఎఫర్ట్ నేను పెడుతున్నాను సర్.. అని సుమన్ ఇచ్చిన ఆన్సర్‌కి 81 పర్సంట్ థంమ్స్ అప్.. 19 పర్సంట్ డౌన్ వచ్చింది. ఇక కామనర్లు అందరిని కలిపి మిమ్మల్ని ఓట్లేసి బిగ్‌బాస్ హౌస్‌కి పంపించింది గొడవలు వేసుకోవడానికా అంటూ నాగార్జున ఫైర్ అయ్యాడు.

అందరికీ కొన్ని గేమ్స్ పెట్టారు. అందులో ఒక గిఫ్ట్ గెలిచిన డీమాన్‌ని అది ఎవరికిస్తావ్ నీ టీమ్‌లో అని నాగార్జున అడిగారు. డీమాన్ స్ట్రయిట్‌గా వెళ్లి రీతూ చేతిలో ఆ గిఫ్ట్ పెట్టాడు. ఏదో గొడవపడినందుకు ఇచ్చినట్లున్నాడు.. అని నాగ్ డైలాగ్ వేశాడు. దీంతో రీతూ మరోసరి క్లారిటీ ఇచ్చింది. నాకు డీమాన్ అంటే జెన్యూన్ ఎఫెక్షన్, జెన్యూన్ కేరింగ్ ఉంది.. అని రీతూ చెప్పింది. ఎఫెక్షన్ చూపించడం కోసం నీకు ఇప్పుడు ఒక గిఫ్ట్ గెలుచుకొని మరీ ఇచ్చాడని నాగార్జున. ఆ తర్వాత అందరికి కొన్ని గేమ్స్ పెట్టారు. అందులో ఒక గిఫ్ట్ గెలిచిన డీమాన్‌ని అది ఎవరికిస్తావ్ నీ టీమ్‌లో అని నాగార్జున అడిగారు. డీమాన్ స్ట్రయిట్‌గా వెళ్లి రీతూ చేతిలో ఆ గిఫ్ట్ పెట్టాడు. ఏదో గొడవపడినందుకు ఇచ్చినట్లున్నాడని నాగార్జున అన్నాడు. దీంతో రీతూ మరోసారి క్లారిటీ ఇచ్చింది. నాకు డీమాన్ అంటే జెన్యూన్ ఎఫెక్షన్, జెన్యూన్ కేరింగ్ ఉందని చెప్పింది. ఎఫెక్షన్ చూపించడం కోసం నీకెప్పుడు ఒక గిఫ్ట్ గెలుచుకొని మరీ ఇచ్చాడని నాగార్జున అన్నాడు. ఇక తన మోహం వాడిపోయింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.