English | Telugu

Bigg boss 9 Telugu : ఆ నలుగురికి షాక్ ఇచ్చిన ప్రియా శెట్టి.. కొమ్ములు ఎవరికి వచ్చాయంటే!


బిగ్ బాస్ సీజన్-9 లో మూడో వారం అందరు ఊహించినట్టుగానే ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యింది. అయితే తను ఎలిమినేట్ అవ్వాలని ఆడియన్స్ అంతా గత రెండు వారాలుగా నిరీక్షిస్తున్నారు. ఎట్టుకేలకి వారి కల నెరవేరింది. అరుంధతి సినిమాలో పశుపతి వాళ్ళ అమ్మ.. ' బిడ్డకు విడుదల' అన్నట్టుగా ప్రియా శెట్టి బయటకొచ్చేసింది.

హౌస్ లో అందరు ఉన్నప్పుడు నాగార్జున ఎవరి గేమ్ ఎలా ఉందని అడిగినప్పుడు.. అక్కడి ఆడియన్స్ ప్రియాకి 20% ఇచ్చారు. అంటే అసలు హౌస్ లో తను ఉండటం ఎవరికి ఇష్టం లేదన్నమాట. ఎందుకంటే ప్రతీ దానికి నోరేసుకొని పడిపోతుంది. అనవసరమైన వాటిల్లో దూరిపోవడం, టాస్క్ లలో అసలు కన్పించకపోవడం.. ఇలా తనకి అన్నివైపుల నుండి నెగెటివ్ వచ్చేసింది.

సండే ఎపిసోడ్ లో ప్రియా శెట్టి ఎలిమినేషన్ అయి స్టేజ్ మీదకి వచ్చేసింది. ‌తను వచ్చీ రాగానే తన జర్నీ వీడియో చూపించాడు నాగార్జున. అది చూసి ప్రియా కాస్త ఎమోషనల్ అయిన ప్రౌడ్ గా ఉందని నవ్వుతూ చెప్పింది. ఇక హౌస్ మేట్స్ ఎవరు ఎలా ఉన్నారంటూ ప్రియా చెప్పింది. అందరితో తన బాండింగ్ చెప్తూ ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత ఒక ముగ్గురికి హార్న్(కొమ్ములు) ఇచ్చి వారి గురించి చెప్పమని ప్రియని నాగార్జున అడిగాడు. దాంతో ఫస్ట్ హార్న్(కొమ్ములు) హరీష్‌కి ఇచ్చింది. ఎవరైనా మీది తప్పంటే మీరు అసలు వినరండి.. ఫస్ట్ అందరి పర్ స్పెక్టివ్ వినండి.. అందరితో కలవండి అంటూ ప్రియ సలహా ఇచ్చింది. ఆ తర్వాత మా మమ్మీ తనూజకి ఇస్తున్నానని చెప్పింది. తను చాలా మంచిది నాకు ఒక్కటే ఉంది... అలగకు.. దానికి మించి ఏం లేదు.. నీ హగ్స్ మిస్ అవుతానంటూ ప్రియ ఎమోషనల్ అయింది. ఆ తర్వాత బాబాయ్ భరణి.. సిల్లీ రీజన్స్‌కి అందరిని నామినేట్ చేయకండి బాబాయ్.. నామినేషన్స్ చాలా ఇంపార్టెంట్.. మీ గేమ్ బాగా ఆడుతున్నారు.. రైట్ మూవ్స్ చేస్తున్నారు.. ఎప్పుడు ఏం చేయాలో.. ఎవరిని ఎలా చేయాలో చేస్తున్నారు.. సూపర్ గేమ్.. నెక్స్ట్ లెవల్.. కానీ కొంచెం అందరితో బావుండండి అంటూ ప్రియ చెప్పింది. ఇక ఎవరికి ఇవ్వాలనుకోవడం లేదని ప్రియ అంది.

ఇక ఎవరు లేరని నాగార్జునతో చెప్పిన ప్రియా.. తన ముగ్గురు ఫ్రెండ్స్ తో బాండింగ్ గుర్తుచేసుకొని ఏడ్చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి కొమ్ములు పెట్టుకోమంది. ఎందుకంటే ఫ్రెండ్స్‌ని చేసుకోవడం తప్పు కాదు కానీ ఫ్రెండ్స్‌యే నీ గేమ్ అయిపోయారు నీకు.. నేను టాప్-3లో టాప్-1లో నువ్వుండాలి అంతే అంటూ ప్రియ చెప్పింది. ఇక ప్రియా వెళ్తూవెళ్తూ ఇమ్మూ మిస్ యూ అంటూ చెప్పింది. రేపటి నుండి ప్రతీరోజు నన్ను గుర్తుచేస్తుంటా టీవీలో చూడమంటూ ప్రియాతో ఇమ్మాన్యుయేల్ అన్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.