English | Telugu

Kavya Shree Wild Card Entry: బిగ్ బాస్ సీజన్-9 వైల్డ్ కార్డ్స్ ఎవరంటే.. కావ్యశ్రీ ఎంట్రీ నిజమేనా!

బిగ్ బాస్ సీజన్-9 మొదలై మూడు వారాలు కంప్లీట్ అయి నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఈ మూడు వారాల్లో ప్రతీరోజు ఏదో ఒక కొత్తదనం కన్పిస్తుంది. అయితే ఇది పెద్దగా హిట్ అవ్వాలని భావించిన బిగ్ బాస్.‌. హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చాడు. వైల్డ్ కార్డు ఎంట్రీల గురించి బయట నెట్టింట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆడియన్స్‌కి మరో సర్‌ప్రైజ్ ఇస్తూ బిగ్‌బాస్ 2.0లో భాగంగా మరో ఐదుగుర్ని హౌస్‌లోకి పంపించబోతున్నారు. ఐదవ వారంలో ఈ ప్రాసెస్ జరగనుంది. ఇప్పటికే రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్), దివ్వెల మాధురి (కేరాఫ్ దువ్వాడ శ్రీనివాస్), సుహాసిని (దేవత సీరియల్ ఫేమ్) .. ఈ ముగ్గురూ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కన్ఫమ్ అయ్యారు. తాజాగా ఆ లిస్ట్‌లో కావ్యశ్రీ కూడా చేరింది.

బుల్లితెర ఆడియన్స్‌కి కావ్య గురించి పరిచయం అక్కర్లేదు. గోరింటాకు, చిన్ని సహా ఎన్నో సీరియల్స్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది కావ్య. అలానే బిగ్‌బాస్ సీజన్-8 విన్నర్ నిఖిల్ మలియక్కల్-కావ్య ఒకప్పుడు రిలేషన్‌లో కూడా ఉన్నారు. వాళ్ల ప్రేమ, బ్రేకప్ గురించి కూడా ప్రేక్షకులకి తెలుసు. కావ్యని సీజన్-9కి తీసుకురావాలని బిగ్‌బాస్ టీమ్ చాలా ప్రయత్నించింది. కానీ కావ్య దీనికి ఒప్పుకోలేదని టాక్.

అయితే చివరికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చేందుకు కావ్య ఓకే చెప్పిందట. ఇప్పుడు కావ్య వస్తుందని తెలియగానే నిఖిల్ ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే నిఖిల్ కప్పు కొట్టడంలో కావ్య గురించి హౌస్‌లో చేసిన కామెంట్లు, ఎమోషన్ కూడా ఒక కారణం. అయితే హౌస్‌లో ఒకలా బయటికొచ్చాక ఒకలా కావ్య గురించి నిఖిల్ కామెంట్లు చేశాడు. దీంతో కావ్య కూడా పలు షోలలో నిఖిల్ గురించి ఇండైరెక్ట్ కామెంట్లు చేసింది. మరి ఇప్పుడు హౌస్‌లోకి వస్తే నిఖిల్ గురించి కావ్య ఎలా మాట్లాడుతుందో.. తమ బ్రేకప్ గురించి ఏం చెప్తుందో చూడాలి మరి.