Read more!

English | Telugu

యాంకర్ రవి ఎలిమినేషన్ ఎఫెక్ట్.. నిరసనకు దిగిన తెలంగాణ జాగృతి!

తెలుగు బిగ్ బాస్ సీజన్-5 లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ రవి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. దీంతో రవి అభిమానులు బిగ్ బాస్ నిర్వాహకులపై విరుచుకుపడుతున్నారు. రవి ఎలిమినేషన్ వెనుక కుట్ర ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంలోకి ఊహించని విధంగా తెలంగాణ జాగృతి ఎంటర్ కావడం ఆసక్తికరంగా మారింది.

రవికి అన్యాయం జరిగింది అంటూ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమం తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిగ్‌ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో నిర్వాహకులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. స్ట్రాటజీ ప్రకారమే రవిని ఎలిమినేట్ చేశారని ఆరోపించారు. రవి కంటే వీక్‌గా ఉన్న కంటెస్టెంట్లను హౌస్‌లో ఉంచి ఒకరికి ప్రయోజనం చేకూరేలా షో నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని నవీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిగ్ బాస్ షో ఓటింగ్ పై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడని ఓటింగ్ ని తప్పుబడుతూ నిరసనకు దిగడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. అదీగాక ఒక టీవీ షోలో ఎలిమినేషన్ గురించి ఏకంగా తెలంగాణ జాగృతి రంగంలోకి దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి ఈ వివాదంపై బిగ్ బస్ షో నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.