English | Telugu

బిగ్‌బాస్‌: అత‌న్ని గెలిపించ‌డం కోస‌మే ఎలిమినేట్ చేశారు!

బిగ్‌బాస్ సీజ‌న్ 5 చిత్ర విచిత్రాల‌తో సాగుతోంది. గ‌త సీజ‌న్‌ల‌తో పోలిస్తే తాజా సీజ‌న్‌పై నెటిజ‌న్‌లు, కంటెస్టెంట్‌లు ఓ రేంజ్‌లో మండిప‌డుతున్నారు. కావాలనే త‌మ‌ని ఎలిమినేట్ చేశార‌ని ఇటీవ‌ల బ‌య‌టికి వ‌చ్చిన కంటెస్టెంట్స్ బాహాటంగానే బిగ్‌బాస్‌పై నిప్పులు చెరిగిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆదివారం ఎలిమినేట్ అయిన యాంక‌ర్ ర‌వి కూడా ఇదే త‌ర‌హా విమ‌ర్శ‌ల్ని గుప్పించ‌డం విశేషం. ఆదివారం యాంక‌ర్ ర‌వి, కాజ‌ల్‌ల మ‌ధ్య టైగా ముగిసిన విష‌యం తెలిసిందే.

అయితే స‌న్నీ త‌న ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్‌ని కాజ‌ల్‌కి ఇవ్వ‌డంతో ర‌వి ఎలిమినేట్ కాగా కాజ‌ల్ సేఫ్ అయింది. అయితే యాంక‌ర్ ర‌వి ని ఎలిమినేట్ చేయ‌డం అన్యాయం అని ఈ విష‌యంలో ర‌వికి అన్యాయం జ‌రిగింద‌ని యాంక‌ర్ ర‌వి ఫ్యాన్స్ బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ప‌రోక్షంగా యాంక‌ర్ ర‌వి కూడా ఇదే అనుమానాన్ని వెలిబుచ్చ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

అంతే కాకుండా హౌస్‌లో వున్న సంద‌ర్భంలోనూ ల‌హ‌రి, కాజ‌ల్‌, ప్రియ‌ల విష‌యంలోనూ నాగ్.. ర‌విని టార్గెట్ చేయ‌డం కూడా ఇందులో భాగ‌మేన‌ని అంతా వాపోతున్నారు. అత‌న్ని ముందు నుంచి డీగ్రేడ్ చేస్తూ ఓ గుంట‌న‌క్క‌లా చిత్రీక‌రించిన బిగ్‌బాస్ చివరికి స‌న్నీ కోసం ర‌విని బ‌లిచేశార‌ని అత‌ని అభిమానులు, ప్రేక్ష‌కులు మండిప‌డుతున్నారు. అయితే బ‌య‌టికి వ‌చ్చినా ర‌వి కోట్లాది మంది ప్రేక్ష‌కుల సింప‌తీని సొంతం చేసుకున్నాడ‌ని అత‌ని మ‌రో వ‌ర్గం చెబుతోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.