Read more!

English | Telugu

ర‌వి ఎలిమినేట్ అయ్యాక స‌పోర్ట్ చేయండంటూ స‌ర‌యు షాకింగ్ పోస్ట్‌!

 

టైటిల్ ఫేవ‌రేట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట‌రైన యాంక‌ర్ ర‌వి అనూహ్యంగా ఈ ఆదివారం ఎలిమినేట్ కాంవ‌డంతో అంతా షాక‌వుతున్నారు. హౌస్‌లో గ‌త 9 వారాలుగా నామినేట్‌ అవుతూ సేఫ్ అవుతూ వ‌స్తున్న ర‌వి ఈ ఆదివారం ఓటింగ్ కార‌ణంగా ఎలిమినేట్ కావాల్సి వ‌చ్చింది. అత‌ని గేమ్ తీరు, ఇత‌రుల్ని ఇన్‌ప్లూయెన్స్ చేయ‌డం.. కొంత మందిరి హౌస్ నుంచి బ‌య‌టికి పంపించ‌డంలో ప‌రోక్షంగా ప‌ని చేయ‌డం.. ప్ర‌తీ దానికీ అమ్మ‌తోడు అంటూ అబ‌ద్ధాలు ఆడ‌టం.. ఇవే ర‌విని ఇంటి నుంచి బ‌య‌టికి పంపించేశాయి అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా వుంటే యాంక‌ర్ ర‌విపై స‌ర‌యు షాకింగ్ కామెంట్స్ చేయడం ఆస‌క్తిక‌రంగా మారింది. బిగ్ బాస్ 5లో హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫ‌స్ట్ కంటెస్టెంట్ అయిన ఆమె ఒక్క‌రు త‌ప్ప హౌస్‌లో వున్న వాళ్లంతా ఫేక్ అని కామెంట్ చేసింది. ఆ ఒక్క‌రు ర‌వి అని అత‌నికి స‌పోర్ట్ చేయండ‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. విచిత్రం ఏంటంటే యాంక‌ర్ ర‌వి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆదివారం ఎలిమినేట్ అయ్యాడు. ఆ విష‌యం స‌ర‌యు తెలిసి పోస్ట్ పెట్టిందా? లేక తెలియ‌క పెట్టిందా? అన్న‌ది ప‌లువురికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

"స‌పోర్ట్ ర‌వి" అంటూ ఇన్‌స్టా వేదిక‌గా స‌ర‌యు పెట్టిన పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ర‌వి హౌస్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేశాక త‌ను స‌పోర్ట్ చేసి ఏం లాభ‌మ‌ని, ఇంత లేట్‌గా ఎందుకు స్పందిస్తోంద‌ని, ఇదే ప‌ని వారం ముందు చేసి వుంటే ర‌వి సేవ్ అయ్యేవాడ‌ని నెటిజ‌న్ లు స‌ర‌యుపై కామెంట్‌లు చేస్తున్నారు. మ‌రీ ఈ లాజిక్‌ని స‌ర‌యు ఎలా మిస్స‌యిందో త‌న‌కే తెలియాలి.