English | Telugu

ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చిన శ్రీముఖి!

"నేను చెప్తున్నాను. మీరెవరో గెటప్పులు లేకుండా నాకు తెలుసు. ఇండస్ట్రీలో లేకుండా చేస్తా" అని శ్రీముఖి వార్నింగ్ ఇచ్చింది. ఎవరికో తెలుసా? 'మాయా ద్వీపం'లో రాక్షసుల గెటప్పులు వేసుకున్న ఆర్టిస్టులను! ఎందుకంటే... సోహైల్, మెహబాబా, విష్ణుప్రియతో కలిసి శ్రీముఖి 'మాయా ద్వీపం' కార్యక్రమానికి వచ్చింది. అక్కడ ఓ టాస్క్ లో భాగంగా నెత్తి మీద కుండ పెట్టుకుని... చిన్న వంతెన దాటాలి. కుండను కింద పడేయాలని రాక్షసులు ఏదో ఒకటి విసురుతూ ఉంటారు. అప్పుడు శ్రీముఖికి కోపం వచ్చి వార్నింగ్ ఇచ్చింది.

సోహైల్, శ్రీముఖి కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో 'ఉండిపో...' పాటకు డాన్స్ చేశారు. అయితే, అంతకు ముందు 'సోహైల్ అన్నయ్యా' అని శ్రీముఖి అనడంతో అతడు ఒక్కసారి షాక్ అయ్యాడు. 'చిన్నపిల్లల షోకు పెద్దవాళ్ళను ఎందుకు పిలవాలని అనిపించింది?' అని ఓంకార్ ను శ్రీముఖి అడగ్గా... 'మనలో ఉన్న పిల్లల్ని చూశారు' అని విష్ణుప్రియ అనడం... 'ఇవే తగ్గించుకుంటే మంచిది' అని సెటైర్స్... ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా ఉందనే హోప్ ఇచ్చాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.