English | Telugu

"ఎవడికి కావాలి నీ సారీ".. ష‌ణ్ణుపై సిరి ఫైర్‌!

యూట్యూబర్లు సిరి హనుమంతు, షణ్ముఖ్ జస్వంత్ క్లోజ్ ఫ్రెండ్స్. 'బిగ్ బాస్' ఇంటిలోకి రాకముందు నుంచే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. ఇంటిలోకి వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన సభ్యుల్లో కొంతమంది 'వాళ్ళిద్దరూ కలిసి ఆట ఆడతారు' అని ఆరోపించారు. అటువంటి ఫ్రెండ్స్ మధ్య బుధవారం చిన్న గొడవ చోటు చేసుకుంది. షణ్ముఖ మీద సిరి గట్టిగా అరిచింది. ఎందుకు? ఏమిటి? అంటే...

బుధవారం నాటి ఎపిసోడ్ లో షణ్ముఖ్ జస్వంత్ దగ్గరకు వెళ్ళిన సిరి హనుమంతు ''మనిద్దరం ఒక సాంగ్ (డాన్స్) చేద్దాం" అని అడిగింది. అప్పుడు షణ్ముఖ్ "హమీదాకు కూడా ఏదైనా సాంగ్ చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే నేను గుర్తుకు వచ్చేవాడిని" అని అన్నాడు.‌ దాంతో సిరి హర్ట్ అయింది. అక్కడి నుండి వెళ్ళిపోయింది.

సిరి హర్ట్ అయిన విషయం గమనించిన షణ్ముఖ్ ఆమెకు సారీ చెప్పాడు. అయితే ఆమె పట్టించుకోలేదు.‌ మళ్లీ సారీ చెప్పాడు.‌ అప్పుడు "ఎవడికి కావాలి నీ సారీ? అనాల్సిన మాటలన్నీ అనేసి" అంటూ గట్టిగా అరిచింది సిరి. దాంతో డైనింగ్ టేబుల్ మీద ఉన్న సింగర్ శ్రీరామ్ చంద్ర ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. షణ్ముఖ్, సిరి మధ్య ఇటువంటి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ కామన్ అని సోషల్ మీడియాలో జనాలు అంటున్నారు. ఏమవుతుందో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.