English | Telugu

ఫ్లోలో నిజం చెప్పేసిన రష్మి!

యాంకర్ రష్మీ గౌతమ్ అంటే హాట్ లేడీ. 'గుంటూరు టాకీస్' వంటి సినిమాలలో రష్మి చాలా హాట్ హాట్ గా కనిపించింది. ఇటు టీవీ కార్యక్రమాలలోనూ హాట్ ఇమేజ్ ఆమెకు ఉంది. అటువంటి రష్మి ఫేస్ కామెడీగా ఉంటుందనే 'హైపర్' ఆది కామెంట్ చేశాడు. వీళ్ళిద్దరూ 'ఢీ' షోలో టీం లీడర్లుగా చేస్తున్న సంగతి తెలిసిందే. షోలో 'సుడిగాలి' సుధీర్, రష్మీ గౌతమ్ మధ్య ట్రాక్ రన్ చేస్తూ ఉంటారు కదా! వచ్చే వారం ఎపిసోడ్ లో కూడా అటువంటిది ఒకటి ప్లాన్ చేశారు.

మాటలో మధ్యలో 'నా ముఖం చూస్తే కామెడీగా ఉందా?' అని సుధీర్‌తో రష్మీ గౌతమ్ అంటే... మధ్యలో 'హైపర్' ఆది కలుగజేసుకున్నాడు. 'ఫ్లోలో నిజం చెప్పేసింది' అని కామెంట్ చేశాడు.

ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి... నెక్స్ట్ ఎపిసోడ్ లో 'అర్జున్ రెడ్డి' సినిమాలో 'మధురమే ఈ క్షణమే...' పాటకు రష్మీ గౌతమ్, దీపికా పిల్లి పెర్ఫార్మన్స్ చేశారు. ప్రోమోలో వాళ్ళిద్దరి డాన్స్ చూస్తుంటే... సెగలు పుట్టించినట్టు తెలుస్తోంది. అయితే... సుధీర్, రష్మి మధ్య మాటలు లేవంటూ ఇద్దరి మధ్య ప్యాచప్ చేస్తున్నట్టు ఒక స్కిట్ చేశారు. 'మీ టీమ్ వాళ్ళు ఎలా ఆన్నారు సుధీర్ గారు?' అని రష్మి అడిగితే... 'అందరూ బావున్నారు' అని సుధీర్ సమాధానం ఇచ్చాడు. 'ఇది బ్లాక్‌బస్టర్ ప్లాప్' అని ప్రియమణి సెటైర్ వేశారు.

లాస్ట్ వీక్ సుహాస్, సోహైల్ వంటి చోటా హీరోలను తీసుకొచ్చి ఆడియన్స్ ను అట్రాక్ట్‌ చేసే ప్రయత్నం చేశారు. అది అంతగా వర్కవుట్ కాకపోవడంతో షోలో జడ్జ్ లు, టీమ్ లీడర్లతో డిఫరెంట్ స్కిట్స్, డాన్స్ పెర్ఫార్మన్స్ ప్లాన్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.