English | Telugu

శేఖ‌ర్‌ను చూస్తే చాలు.. ముద్దు పెట్ట‌కుండా ఉండ‌లేక‌పోతున్న శ్రీ‌ముఖి!

లాస్ట్ మంత్ 'సిక్స్త్ సెన్స్' షోకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, యాంకర్ శ్రీముఖి వెళ్లారు. షోలో శేఖర్‌కు శ్రీముఖి ముద్దు పెట్టింది. తర్వాత ఏమనుకుందో ఏమో గానీ శేఖర్ దగ్గరకు వెళ్లి 'మీ భార్య పేరు ఏంటి?' అని అడిగి మరీ 'శిరీషా గారు ఇది కేవలం షోకి సంబంధించినది మాత్రమే. కల్పితాలు మాత్రమే' అని చెప్పింది. మరోవైపు శేఖర్ కూడా శ్రీముఖి తనకు ముద్దు పెట్టలేదని, అదంతా సీజీ అన్నారు. ఇదంతా ఓంకార్ అన్నయ్య ప్రోమోలో వేశారు. ఫుల్ వైరల్ అయింది.

కట్ చేస్తే... శేఖర్ మాస్టర్‌కు శ్రీముఖి మళ్లీ ముద్దు పెట్టింది. ప్రజెంట్ 'కామెడీ స్టార్స్' షోలో శేఖర్ జడ్జ్ గా చేస్తున్నారు కదా! రాబోయే ఆదివారం, ఆగస్టు 1న ఫ్రెండ్షిప్ సందర్భంగా ఎపిసోడ్ కి శ్రీముఖి వచ్చింది. ఇంట్రో సాంగ్ డాన్స్ చేసిన తర్వాత శేఖర్‌కు ముద్దు పెట్టినట్టు తెలుస్తోంది. పాత ముద్దుపై తన స్కిట్ లో అవినాష్ పంచ్ కూడా వేశాడు. 'ఆ ముద్దు మొత్తం వైరల్ అయ్యింది తెలుసా?' అని అవినాష్ అన్నాడు. వెంటనే 'ఆ తర్వాత మా ఇంట్లో నాకు వైరల్ ఫీవర్ వచ్చింది తెలుసా?' అని శేఖర్ అనడంతో శ్రీముఖి, విష్ణుప్రియ నవ్వుకున్నారు.

ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ కోసం 'కామెడీ స్టార్స్' టీమ్ కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ లను తీసుకొచ్చింది. ఇద్దరికీ సన్మానం చేసింది. 'మీరు తెలుసుకోవాల్సింది ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు... గోల్డ్ కెనాట్ బికమ్ ఓల్డ్' అని కోట అన్నారు. గోల్డ్ ఎప్పటికీ ఓల్డ్ కాదన్నది ఆయన అభిప్రాయం.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.