English | Telugu

సుమ సంపాదనే ఎక్కువ... ఓపెన్‌గా ఒప్పుకొన్న రాజీవ్ కనకాల!

తెలుగులో బిజీయెస్ట్ యాంకర్లలో సుమ టాప్ ప్లేస్‌లో ఉంటారు. ఆల్రెడీ ఆమె చేతిలో 'క్యాష్', 'స్టార్ట్ మ్యూజిక్' లాంటి షోస్ ఉన్నాయి. ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్ విషయానికి వస్తే హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల ఫస్ట్ ఛాయిస్ ఆమె. సుమ కాదన్న తర్వాత ఇతరుల దగ్గరకు వెళతాయి. ప్రజెంట్ సుమ రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరోవైపు రాజీవ్ కనకాల కూడా సినిమాల్లో న‌టించ‌డం ద్వారా సంపాదిస్తున్నారు. ఇటీవ‌ల 'నార‌ప్ప' మూవీలో వెంక‌టేశ్ బావ‌మ‌రిది బ‌స‌వ‌య్య పాత్ర‌లో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నారు. అయితే, రాజీవ్ కంటే సుమ సంపాదన ఎక్కువ అని నలుగురూ మాట్లాడుకోవడం మొదలైంది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం మీద రాజీవ్ ఓపెన్ అయ్యారు.

'మీ భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరి సంపాదన ఎక్కువ?' అనే ప్రశ్నకు 'కచ్చితంగా సుమదే' అని రాజీవ్ కనకాల సమాధానం ఇచ్చారు. తర్వాత సంపాదన విషయంలో తమ మధ్య అభిప్రాయం బేధాలు ఎప్పుడూ రాలేదని రాజీవ్ కనకాల స్పష్టం చేశారు.

రెగ్యులర్ గా టీవీలో సుమ కనపడుతుంది కాబట్టి జనాలు ఏదేదో అనుకుంటారని రాజీవ్ కనకాల అన్నారు. తాను సంపాదించేది తాను సంపాదిస్తున్నాన‌ని వివరించారు. కొన్నేళ్ల క్రితం టీవీలో సుమ బిజీ కాకముందు తాను సినిమాల్లో బిజీగా ఉండి సంపాదించిన రోజులు ఉన్నాయని రాజీవ్ చెప్పారు. తమ మధ్య డబ్బు ప్రస్తావన ఎప్పుడూ చర్చకు రాదన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.