English | Telugu

ష‌ణ్ణుతో హ‌గ్గుల‌పై సిరి ప్రియుడి షాకింగ్ రియాక్ష‌న్‌!

బిగ్‌ బాస్ హౌస్‌లో ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌తో క‌లిసి ర‌చ్చ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్న త‌న ప్రియురాలు సిరి హ‌న్మంత్‌పై ఆమె ప్రియుడు శ్రీ‌హాన్ షాకింగ్ కామెంట్‌లు చేశాడు. సిరి, ష‌ణ్ణు హ‌గ్గుల‌పై నెటిజ‌న్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్న వేళ శ్రీ‌హాన్ షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చాడు. వివ‌రాల్లోకి వెళితే... బిగ్‌బాస్ ఐదో సీజ‌న్ 12వ వారంలోకి ఎంటర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో హౌస్‌లో ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సిరి, ష‌ణ్ణుల మ‌ధ్య హ‌గ్గులకు ఆన‌క‌ట్ట అనేది లేకుండా సీరియ‌ల్ త‌ర‌హాలో న‌డుస్తోంది.

ఇదే చాలా మందికి చిరాకు తెప్పిస్తోంది. స్వ‌యంగా వీరి హ‌గ్గుల పురాణంపై సిరి త‌ల్లి ఘాటుగానే స్పందించింది. ఇటీవ‌లే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిరి త‌ల్లి సిరిని ష‌ణ్ణు ఓ అన్న‌లా, ఓ ఫాద‌ర్‌లా స‌పోర్ట్ చేయ‌డం బాగానే వుంది కానీ అస్త‌మానం హ‌గ్గులు చేసుకోవ‌డం మాత్రం త‌న‌కు న‌చ్చ‌డంలేద‌ని ముఖం ముందే చెప్పేసి షాకిచ్చింది. అయితే దీనిపై మొత్తానికి సిరి ప్రియుడు శ్రీ‌హాన్ స్పందించాడు. సిరి - ష‌ణ్ణు హ‌గ్గుల‌పై ఓ ర‌కంగా షాకింగ్ కామెంట్‌లు చేశాడు.

సిరి చెంప ఛెల్లు మ‌నేదంట‌.. ఎందుకో..

సిరి, ష‌ణ్ణు మ‌ధ్య వున్న రిలేష‌న్ గురించి త‌న‌కు తెలుస‌ని, వాళ్లున్న ప‌రిస్థితుల్ని బ‌ట్టి వారు అలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా సిరి త‌ల్లి త‌న కూతురు బ‌య‌ట బ్యాడ్ కాకూడ‌ద‌నే కార‌ణంగానే అలా మాట్లాడింది కానీ ఆమెకు కూడా సిరి గురించి బాగా తెలుస‌న్నాడు. సిరి, ష‌ణ్ణు మ‌ధ్య వున్న‌ రిలేష‌న్‌ని తాను గౌన‌విస్తాన‌ని, వారిద్ద‌రు మంచి ఫ్రెండ్స్ మాత్ర‌మేన‌ని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.

ష‌ణ్ముఖ్‌కు షాకిచ్చిన సిరి మ‌ద‌ర్‌

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.