English | Telugu

`కార్తీక‌దీపం` : మోనిత‌పైకి చీపుర్లెత్తిన బ‌స్తీ జ‌నం!

మ‌హిళా ప్రేక్ష‌కుల నీరాజ‌నాలందుకుంటున్న బుల్లితెర సీరియ‌ల్ కార్తీక దీపం. ఈ మ‌ధ్య కాలంలో ఇంత‌లా పాపుల‌ర్ అయిన సీరియ‌ల్ మ‌రొక‌టిలేదు. సామాన్య గృహిణుల నుంచి సెల‌బ్రిటీల మ‌ద‌ర్‌ల వ‌ర‌కు ఈ సీరియ‌ల్ ఫ్యాన్స్‌గా మారిపోయారు. వంట‌ల‌క్క వారికి హాట్ ఫేవ‌రేట్‌గా మారిపోయింది. శ‌న‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగ‌బోతోంది. మ‌రీ ముఖ్యంగా కీల‌క పాత్ర‌ధారి మోనిత‌కు ఈ ఎపిసోడ్ భారీ షాక్ ఇవ్వ‌బోతోంది. అదేంటో ఓసారి లుక్కేద్దాం.

1208వ ఎపిసోడ్‌లోకి ఈ సీరియ‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో ప‌లు ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఆనంద‌రావు, సౌంద‌ర్య ఆనందంగా క‌నిపిస్తుంటారు. మ‌న‌సు చాలా ప్ర‌శాంతంగా వుంద‌ని, ఈ రోజు ఎంతో ఉత్సాహంగా వుంద‌ని చాలా రోజుల త‌రువాత ఇలా ఆనందంగా వుండ‌టం బాగుంద‌ని చెబుతుంటాడు ఆనంద‌రావు ఇదే స‌మంలో అక్క‌డికి హిమ‌, శౌర్య వ‌స్తారు. వీరితో వాకింగ్‌కి వెళుతున్నామ‌ని, ఈ విష‌యం దీప‌కు చెప్ప‌మని పిల్ల‌ల్ని పంపిస్తారు సౌంద‌ర్య‌, ఆనంద‌రావు.

క‌ట్ చేస్తే కార్తీక్ త‌ల స్నానం చేసి రావ‌డంతో అత‌ని త‌ల‌ని గ‌ట్టిగా తుడుస్తూ వుంటుంది దీప‌. కార్తీక్ చాలు అన్నా విన‌కుండా అత‌న్ని ఓ ఆటాడుకుంటుంది. ఇదంతా గ‌మ‌నించిన పిల్ల‌లు మురిపిపోతారు. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రూ ఆనంద‌రావు, సౌంద‌ర్య‌తో క‌లిసి వాకింగ్‌కి వెళ్లిపోతారు. క‌ట్ చేస్తే ప్రియ‌మ‌ణితో క‌లిసి మోనిత కారులో కార్తీక్ ఇంటి బ‌య‌ట ఎదురుచూస్తూ వుంటుంది. స‌మ‌యం చిక్కింది క‌దా అని ప్రియ‌మ‌ణి .. మోనిత‌ని త‌న మాట‌ల‌తో విసిగిస్తూ వుంటుంది. ఇంత‌లో దీప తండ్రి ముర‌ళీ కృష్ణ ఇంటికి వ‌స్తూ వ‌స్తూ కారులో మోనిత వుండ‌టాన్ని గ‌మ‌నిస్తాడు. అదే విష‌యాన్ని దీప‌కు చెబుతాడు. వెంట‌నే దీప కార్తీక్‌కి చెబుతుంది. విష‌యం తెలుసుకున్న కార్తీక్ కోపంతో ర‌గిలిపోతాడు. క‌ట్ చేస్తే బ‌స్తీలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తాడు కార్తీక్‌. ఇదే అద‌నుగా ప్రియ‌మ‌ణితో బాబుతో క‌లిసి అక్క‌డికి వ‌స్తుంది మోనిత‌. మోనిత‌ని గ‌మ‌నించిన దీప బ‌స్తీ వాసుల‌కి త‌న గురించి చెప్ప‌డంతో అంతా క‌లిసి మోనిత‌పై చీపురు తిర‌గేస్తారు. ఆ త‌రువాత ఏమైంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.