English | Telugu

సిరి చెంప ఛెల్లు మ‌నేదంట‌.. ఎందుకో..

బిగ్‌బాస్ రియాలిటీ షోని అంతా అనుమానిస్తున్న‌ట్టుగానే ఓ జంట వ‌ల్గ‌ర్ స్టాయికి తీసుకెళుతోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. హౌస్‌లో ఎమోష‌న‌ల్ బాండింగ్ పేరుతో హ‌గ్గులు, కిస్సులు.. ఎక్కువైపోయాయ‌ని... సంద‌ర్భం అనేది లేకుండానే హ‌గ్గులు .. కిస్సుల‌తో ఓ జంట నాన ర‌చ్చ చేస్తోంద‌ని నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు. ఆ జంట మ‌రెవ‌రో కాదు. సిరి, ష‌ణ్ముఖ్‌. హౌస్‌లో వీరిద్ద‌రి రొమాన్స్‌కి ఎక్క‌డా అడ్డుక‌ట్ట‌ప‌డ‌టం లేదు.

ఇటీవ‌ల సిరి త‌ల్లి హౌస్‌లోకి ఎంట‌రై ష‌ణ్ముఖ్‌ ఓ అన్న‌లా, తండ్రిలా స‌పోర్ట్ చేస్తున్నాడ‌ని, అయితే ప్ర‌తీసారి హ‌ద్దులు మీరి హ‌గ్గులు ఇవ్వ‌డం త‌న‌కేమీ న‌చ్చ‌డం లేద‌ని బాంబ్ పేల్చిన విష‌యం తెలిసిందే. ష‌ణ్ముఖ్‌కు దూరంగా వుండ‌మ‌ని, అత‌నికి ద‌గ్గ‌ర కావ‌డం త‌న‌కు న‌చ్చ‌డం లేద‌ని సిరి త‌ల్లి ఎంత చెప్పినా సిరి మాత్రం త‌న మాట‌ని లెక్క‌చేయ‌డం లేదు. అలా అంటే ష‌న్ను ఫీల‌వుతాడ‌ని చెప్పి త‌ల్లికే క్లాస్ పీకిన సిరి ఆ త‌రువాత యాజ్ యూజ్‌వ‌ల్‌గా ష‌న్నుని హ‌గ్ చేసుకోవ‌డంతో నెటిజన్స్ త‌ల్లి చెప్పినా మార‌లేద‌ని సిరిపై సెటైర్లు వేస్తున్నారు.

దీనిపై జెస్సీ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. వెర్టిగో వ్యాధితో బాధ‌ప‌డుతున్న జెన్సీ ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టాడు. హౌస్‌లో త‌ను అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న స‌మ‌యంలో సిరి త‌న‌కు అండ‌గా నిలిచింద‌ని, ఆ స‌మ‌యంలో కుటుంబం వుంటే బాగుండేద‌ని ఫీల‌య్యాన‌ని, అందుకే బ‌య‌టికి వ‌చ్చాన‌ని జెస్సీ చెప్పాడు. అంతే కాకుండా హౌస్‌లో ఒంట‌రి త‌నం ఫీల‌వుతున్న‌ప్పుడు మ‌న‌కు బాగా ద‌గ్గ‌ర‌గా వుండే వాళ్ల‌తో ఎక్కువ‌గా క‌నెక్ట్ అవుతామ‌ని, అలాగే సిరి, ష‌న్ను క‌నెక్ట్ అవుతున్నార‌ని, ఓ సంద‌ర్భంలో సిరి బాత్రూమ్ గోడ‌కి త‌ల కొట్టుకోవ‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, ఆ స‌మ‌యంలో నేను హౌస్‌లో వుంటే ఖ‌చ్చితంగా సిరి చెంప ఛెల్లుమ‌నేద‌ని చెప్పుకొచ్చాడు జెస్సీ.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.