English | Telugu

'బిగ్ బాస్ 5'.. శ్రీరామ్ చంద్రకు మద్దతుగా ప్రభాస్ ఫ్యామిలీ!

'బిగ్ బాస్ 5 తెలుగు' చివరి దశకు చేరుకుంది. టైటిల్ రేసులో శ్రీరామ్ చంద్ర, సన్నీ, షణ్ముఖ్‌, సిరి, మానస్ ఉన్నారు. ఎక్కువగా శ్రీరామ్ చంద్ర లేదా సన్నీ బిగ్ బాస్ 5 టైటిల్ గెలిచే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సింగర్ గా నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ చంద్రకు సినీ ప్రముఖుల నుంచి సైతం మద్దతు లభిస్తోంది. ఇప్పటికే సోనూసూద్‌, శంకర్‌ మహదేవన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ వంటి వారు శ్రీరామ్ చంద్రకు మద్దతు తెలపగా.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ మద్దతు తెలపడం విశేషం.

Also Read:రాజ‌మౌళితో సినిమా ఎప్పుడని అడిగితే "అప్ర‌స్తుతం" అన్న‌బాల‌య్య‌!

రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య, ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామల దేవి తాజాగా ఓ వీడియో సందేశం ద్వారా శ్రీరామ్‌ కు మద్దతు తెలిపారు. "హాయ్‌ శ్రీరామ్‌. బిగ్‌ బాస్‌ చూస్తున్నాం. నాకు, కృష్ణంరాజు గారికి నీ సింగింగ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా భక్తి పాటలు బాగా లైక్ చేస్తాం. అప్పుడు ఇండియన్‌ ఐడెల్‌ లో గెలిచి తెలుగువారందరకీ ఎంతో గర్వకారణం అయ్యావు‌. అలాగే నువ్వు బిగ్‌ బాస్‌ లో కూడా గెలవాలని, అందరూ నీకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ తరపు నుంచి కోరుకుంటున్నాను. నువ్వు తప్పకుండా విన్ అవుతావ్‌. ఆల్‌ ది బెస్ట్‌" అంటూ శ్రీరామ్‌ కు మద్దతుగా శ్యామల దేవి వీడియో సందేశం ఇచ్చారు.

Also Read:మ‌ళ్లీ రెచ్చిపోయిన రోజా

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోతో ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు శ్రీరామ్ కు లభించే అవకాశముంది. అదే జరిగితే బిగ్ బాస్ 5 టైటిల్ రేసులో శ్రీరామ్ చంద్ర ముందున్నట్లే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.