ఎక్స్‌ట్రా జబర్దస్త్ : మళ్లీ రెచ్చిపోయిన రోజా
on Dec 14, 2021
.webp)
నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో వున్నా.. ఆడిటోరియంలో వున్నా సరే తగ్గేదిలే అన్నట్టుగానే వ్యవహరిస్తుంటుంది. గత కొంత కాలంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కి రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. స్కిట్ లు చేసే టీమ్ లపై అదే రేంజ్ లో పంచ్ లు వేస్తూ వుంటుంది రోజా. అవి కొన్ని సార్లు మరోలా పేలుతుంటాయి. తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో రోజా వేసిన పంచ్ నవ్వులు పూయించడమే కాకుండా ఆ పంచ్ కి బీప్ వేస్తే బాగుంటుందే అనేలా వుంది.
మాళవిక ప్లాన్ వేద తెలుసుకుంటుందా?
తాజా ఎపిసోడ్ లో రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను ఏజెంట్ లుగా మారి రంగంలోకరి దిగారు. ప్రమో స్టార్టింగ్ లోనే `ఎక్స్ ట్రా జబర్దస్త్ కి మీరు అన్యాయం చేశారంటూ మిగతా సభ్యులపై ఫైర్ అయింది రష్మీ.. ఆ వెంటనే ఆటో రాంప్రసాద్ అందుకుని నాకైతే ఫస్ట్ మిమ్మల్నే కట్టేయాలంటాడు. స్కిట్ చేయమంటే షబీనాతో లవ్ సింబల్ చేయించుకుంటున్నావా సిగ్గుందా అసలు అని నరేష్ ని రష్మీ అడిగితే.. అసలు స్టార్ట్ చేసింది ఎవరండీ... చంటి పిల్లోడి కూడా తెలుసు మీరే స్టార్ట్ చేశారని.. ముందు తిట్టాల్సింది మిమ్మల్ని మామూలుగా కాదు బండబూతులు తిట్టాలి అని నరేష్ .. రష్మీపై ఫైర్ కావడం నవ్వులు పూయిస్తోంది.
ఇక వర్ష, ఇమ్మానుయేల్ లని కట్టేసి మీరు ముంతాజ్ , షాజహానా? అని అడుగుతుంది రష్మీ .. దానికి ఇమ్మానుయేల్ నుంచి అదిరిపోయే పంచ్ పడింది. మీరు లైలా మజ్నులా? అని డైరెక్ట్ పంచ్ వేయడంతో మనో, రోజా పగలబడి నవ్వేశారు. ఇదే సందర్భంగా నరేష్ పై రోజా వేసిన పంచ్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో బీప్ పంచ్‌లకు పరాకాష్టగా నిలిచింది. `వాడు పండించాక నువ్వేంపండిస్తావురా కెమిస్ట్రీ` అని రోజా వేసిన డబుల్ మీనింగ్ పంచ్ ఓ రేంజ్ లో పేలడంతో మళ్లీ రోజా రెచ్చిపోయిందిగా అంటూ నెటిజన్ లు పంచ్ లు వేస్తున్నారు. తాజా ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



