Read more!

English | Telugu

రిషి వసుధారలకు అన్నీ మంచి శకునాలే..!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -763 లో... జగతి డల్ గా ఉండడంతో మహేంద్ర వచ్చి ఎందుకు ఇలా డల్ గా ఉన్నావ్.. రిషి, వసు ఒక్కటి అవ్వాలని నువ్వే వాళ్ళ కంటే ఎక్కువగా ఆరాటపడ్డావ్.. ఇప్పుడు ఇలా చేస్తున్నావేంటని అంటాడు. అప్పుడే జగతి, మహేంద్రల దగ్గరికి శైలేంద్ర, దేవయానిలు వస్తారు. ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఎందుకు జగతి అలా డల్ గా ఉంటున్నావని దేవయాని అంటుంది. ఎందుకు ఎంగేజ్ మెంట్ ఇష్టం లేనట్లు ఉంటున్నావ్.. నువ్వు వసుధారకి ఏదో చెప్పినట్లు ఉన్నావ్.. అందుకే ఎంగేజ్ మెంట్ వద్దంటుంది. శైలేంద్ర రావడం నీకు ఇష్టం లేనట్లు ఉందని దేవయాని అంటుంది. అదేం లేదు మీరు వెళ్ళండి జగతితో నేను మాట్లాడి వస్తానని మహేంద్ర అంటాడు.

మరొకవైపు ఎంగేజ్ మెంట్ కి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. జగతి మాత్రం ఏదో ఆలోచిస్తున్నట్లు బాధగా ఉంటుంది. అప్పుడే రెడీ అయి వసుధార, రిషిలు వస్తారు. చక్రపాణి, సుమిత్రలు వస్తారు. అమ్మ నాన్నలను చూసిన వసుధార ఆనందంతో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మీకు రావడంలో ఏ ఇబ్బంది లేదు కదా అని రిషి అడుగుతాడు. మాకు రావడం సంతోషంగా ఉంది.. ఇబ్బంది ఎందుకు ఉంటుందని చక్రపాణి అంటాడు. మరి ఎందుకని వసుధార మీకు ఇబ్బంది ఉంటుందని చెప్పిందని అంటాడు.

ఇక ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు.. ముందు మీరు ఫ్రెష్ అప్ అయి రండని ఫణింద్ర అంటాడు. ఇక వసుధార అమ్మనాన్నలను తీసుకొని గదిలోకి వెళ్తుంది. ఏంటి అమ్మ వసు.. నీకు ఎంగేజ్ మెంట్ చేసుకోవడం ఇష్టం లేదా? ఎందుకు రిషి సర్ తో అలా చెప్పావని చక్రపాణి అడుగుతాడు. అదేం లేదు నాన్న.. రిషి సర్ మెడికల్ కాలేజీ స్టార్ట్ చేస్తున్నాడు కదా.. ఈ ఎంగేజ్ మెంట్ వల్ల తనకు ఇబ్బందిగా ఉంటుందని అన్నాను.. అయినా రిషి సర్ తో అన్ని మాట్లాడానని వసుధార అంటుంది. అంతే కదా అని చక్రపాణి అంటాడు.

ఆ తర్వాత రిషి, వసుధార పీటలపై కూర్చొని పూజ చేస్తుంటారు. అందరూ హ్యాపీగా ఉంటే జగతి మాత్రం డల్ గా ఉంటుంది. అది చూసిన మహేంద్ర దేని గురించి ఆలోచిస్తున్నావని అడుగగా.. ఏం లేదని జగతి అంటుంది. అప్పుడే శైలేంద్ర ఎంగేజ్ మెంట్ పనులు అన్ని తానే చూసుకుంటున్నట్టు రిషి ముందు బిల్డప్ ఇస్తాడు. అమ్మాయి తల్లితండ్రులని, అబ్బాయి తల్లి తండ్రులని రమ్మని పంతులు గారు పిలువగానే.. వసుధార అమ్మ నాన్నలు వస్తారు. జగతి, మహేంద్ర వస్తుంటే పెద్దమ్మ మీరు రండని రిషి అనగానే.. జగతి, మహేంద్ర లు బాధపడతారు. అప్పుడే శైలేంద్ర.. రిషి ఈ ఒక్కసారి నా మాట విను.. ఈ ఎంగేజ్ మెంట్ పిన్ని బాబాయ్ ల చేతులు మీదుగా జరగనివ్వమని శైలేంద్ర అనగా.. రిషి ఇష్టం లేకున్నా సరేనని అంటాడు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకుంటారు. వసుధార, రిషిలు ఒకరికొకరు రింగ్ ని తొడుక్కుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.