Read more!

English | Telugu

రాజు గారి గది 4 చేస్తాను.. అందులో మీరు ఉంటారు!

సిక్స్త్ సెన్స్ సీజన్ 5 లో ఈవారం బ్రహ్మాజీ రష్మీ వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. బ్రహ్మాజీని స్టేజి మీదకు ఇన్వైట్ చేసి "మిమ్మల్ని చాలా రోజుల తర్వాత కలవడం చాలా ఆనందంగా ఉంది.  రాజు గారి గది 3 లో కలిసాం..." అనేసరికి "రాజు గారి గది 4 లో కలుస్తాంగా" అని బ్రహ్మాజీ అనేసరికి "తప్పకుండా నేను సినిమా చేస్తాను అందులో మీరు తప్పకుండా ఉంటారు" అని చెప్పాడు ఓంకార్..."మీరు సైలెంట్ గా ఉన్నట్టే ఉంటారు కానీ సిగ్నేచర్ కామెడీ మాత్రం మారదు..పర్సనల్ లైఫ్ లో మీ వైఫ్ దగ్గర ఇలానే ఉంటారా" అని అడిగేసరికి " చిన్నప్పటినుంచి ఇంతే" అన్నాడు బ్రహ్మాజీ.

"ఈమధ్య ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాం.. సర్ సమ్మర్ వెకేషన్ కి ఊటీ వెళ్ళిపోతూ ఉంటారు" అని రష్మీ అనేసరికి "అది పాతది..ఐనా నువ్వు వెళ్తూ ఉంటావ్ కదా నీ బాయ్ ఫ్రెండ్ తో" అనేసరికి "తనకు బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు..రియల్ లైఫ్ లేరు ఎవరు " అని ఓంకార్ అన్నాడు. "మొన్న ఉండకపోవచ్చు..ఈ రోజు ఉండొచ్చు..నెక్స్ట్ వీక్ లేకపోవచ్చు" అని కామెడీగా చెప్పాడు. తర్వాత గేమ్స్ ఆడారు. అందులో  ఫస్ట్ రౌండ్ లో రష్మీ గెలిచేసరికి బ్రహ్మాజీ పక్కన కూర్చుని తాను ఆడే గేమ్ చూస్తూ ఉన్నాడు. సెకండ్ రౌండ్ లో రష్మీ గన్ తో బులెట్ పేల్చి బ్రహ్మాజీతో కాసేపు టాస్కులు ఆడి నవ్వించి బైక్ గెలుచుకుంది. బ్రహ్మాజీని బైక్ మీద వెనక ఎక్కించుకుని స్టేజి మీద రౌండ్ వేసింది రష్మీ. ఇలా ఈ వారం ఈ షో మంచి జోష్ తో ఫుల్ ఫన్నీగా సాగింది.