Read more!

English | Telugu

ముకుంద ప్లాన్ సక్సెస్.. బిడ్డని ఎప్పుడిస్తారని కృష్ణ, మురారిని అడిగిన ఐజి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌-157లో.. కృష్ణ, ముకుంద మురారిలతో పాటు భవాని, రేవతి పూజ జరిపిస్తుంటారు. అయితే పూజారి పూజ చేసాక ఒక ముడుపు కృష్ణకి ఇచ్చి బయట చెట్టికి కట్టమని చెప్తాడు. దాంతో కృష్ణ ఒక్కతే వెళ్తుండగా.. నేనొస్తానని చెప్పి ముకుంద తోడుగా వెళ్తుంది. అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళాక ముకుంద ఒక ప్లాన్ చేస్తుంది.

కృష్ణ ముడుపు కడితే తను, మురారి కలవాలని కోరుకుంటుంది. అలా జరుగకూడదని అనుకొని.. అక్కడ గుడి బయట వాయినాలు ఇస్తున్నారు.. ఆ‌ వాయినం తీసుకోమని కృష్ణకి ముకుంద చెప్పగా తను తీసుకోడానికి వెళ్తుంది. ఇక వెళ్ళేప్పుడు కృష్ణ చేతిలో ఉన్న ముడుపుని ఇవ్వమని చెప్తుంది ముకుంద. సరేనని కృష్ణ ముడుపుని ముకుందకి ఇచ్చి వాయినం తీసుకోడానికి వెళ్తుంది. ఇదే అదనుగా భావించిన ముకుంద.. ఆ ముడుపుని తీసుకెళ్ళి చెట్టుకి కట్టేస్తుంది.

ముకుంద ముడుపు కట్టడం చూసిన మురారి.. ఏంటి నువ్వు చేసే పని అని అడుగగా.. నువ్వు నేను కలిసి ఉండాలని కట్టానని ముకుంద అంటుంది. అయితే అది తప్పు నీకు ఆదర్శ్ ఉన్నాడు.. నాకు కృష్ణ ఉంది.. అలా ఆలోచించొద్దని మురారి అంటాడు. ఆ తర్వాత కాసేపటికి కృష్ణ వచ్చి.. ఆ ముడుపు ఏదని అడుగగా నేను కట్టేసానని ముకుంద చెప్తుంది. దాంతో ఆశ్చర్యపోతుంది కృష్ణ. ఎందుకు అలా చేసావని ముకుందని కృష్ణ అడుగగా.. టెన్షన్ పడకు మురారి కట్టాడు అని ముకుంద అంటుంది.

అవునా.. నేను అయినా ఏసీపీ సర్ అయినా ఒకటే అనుకొని.. గుడి లోపలికి వెళ్తారు. అప్పుడే ఏసీపీ మురారి, కృష్ణల దగ్గరికి ఐజి వస్తాడు. హ్యాపీ బర్త్ డే మురారి అనగా.‌. మీకు తెలుసా సర్ అని కృష్ణ అంటుంది. తెలుసమ్మా అని ఐజి అంటాడు. ఆ తర్వాత మరి మాకు పాపనో బాబునో ఇస్తే ఆడుకుంటాం కదా అని ఐజి అడుగగా.. నేను ఇప్పుడే వస్తానని చెప్పి కృష్ణ పక్కకి వెళ్తుంది. 

అందరూ కలిసి గుడి నుండి బయల్దేరగా.. మొదట కార్ లో కృష్ణ ముకుంద మురారి వస్తారు. కాఫీ షాప్ దగ్గర ఆపి లోపలికి వెళ్తారు. లోపలికి రాగానే వాళ్ళ ముగ్గురిని గుర్తుపట్టిన ఆ కాఫీ షాప్ లో పనిచేసే అతను ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంటి సర్ మీరేంటి ఇలా అని మురారితో అతను అంటాడు. నువ్వు నీ పని చెయ్.. లేదంటే పోలీసులని పిలిపించి కొట్టిస్తానని అంటాడు.

సరేనని ఇంకొక టేబుల్, చైర్స్ అరెంజ్ చేస్తాడు. అప్పుడే భవాని, రేవతి వస్తారు. వాళ్ళు రాగానే అందరూ కూర్చుంటారు. ఇక మురారిని చూసి రేవతి.. ఏంట్రా ఆ చేతిని జేబులో పెట్టుకున్నావని అనగా.. సరేనని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకోడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.