English | Telugu

"నాకింకా పెళ్లి కాలేదు... డైరెక్ట్ అత్తన‌వుతా!".. షాకిచ్చిన ర‌ష్మి!!

పెళ్లి గురించి రష్మీని ఎప్పుడు ప్రశ్నించినా మౌనమే సమాధానం అవుతుంది. అలాగే, వయసు గురించి కూడా! తన వయసు ఎంతనేది ఎప్పుడూ బయటపెట్టదు. అటువంటి రష్మీ నోటి నుండి వయసు, పెళ్లి గురించి వస్తే ఆశ్చర్యమే కదా! దాంతో 'ఆషాడంలో అత్తాకోడళ్లు' ఈవెంట్ లో ఆర్టిస్టులు అందరూ అవాక్కయ్యారు.

సండే సాయంత్రం ఐదు గంటలకు 'జీ తెలుగు'లో టెలికాస్ట్ కానున్న 'ఆషాడంలో అత్తాకోడళ్లు' ఈవెంట్ లో రష్మీ గౌతమ్ రచ్చ రచ్చ చేసిందని లేటెస్ట్ ప్రోమో చూస్తే తెలుస్తోంది. గతంలో రిలీజైన ప్రోమోలో 'మెరిసింది మేఘం' పాట పాడినట్టు రివీల్ చేశారు. ఇప్పుడు అంతకు మించి అన్నట్టు రష్మీ రెచ్చిపోయింది.

'ఆషాడంలో అత్తాకోడళ్లు'లో అత్తలు, కోడళ్లకు మధ్య కాంపిటీషన్లు పెట్టారు. కోడళ్లవైపు రష్మీ ఉన్నారు. మ్యూజికల్ చైర్స్ గేమ్ లో కోడలు ఒకరు ఓడిపోయారు. అంటే... కుర్చీలో కూర్చోలేక వెనక్కి వచ్చారు. అప్పుడు రష్మీ ఆమెను కొట్టింది. దాంతో 'హే... యు డోంట్ బికమ్ అత్త! నువ్వు కోడలు' అని శ్యామల ఆపింది. 'ఈ వయసులో నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను డైరెక్ట్ అత్తకు అప్‌గ్రేడ్ అవుతా' అని రష్మీ ఆన్సర్ ఇచ్చింది. దానికి అంతా షాక్!

ఇక, ఈవెంట్ లో రవి మీద రష్మీ వేసిన డైలాగ్స్ అయితే ఓవర్ ద బోర్డు అని చెప్పాలి. 'రవీ... నిజంగా! ఈసారి మధ్యలో వచ్చావో ఉన్నది కూడా తీసేస్తా', 'నువ్వు పైకిరా! నీకు ఉంటుంది. ఉన్నది కూడా ఇప్పేస్తాం' అంటూ రష్మీ రచ్చ చేశారు. ఫుల్ ఈవెంట్ టెలికాస్ట్ అయితే ఇంకెంత రచ్చ చేశారో తెలుస్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.