English | Telugu

"మేం మందు కొట్టని బ్యాచ్".. గర్వంగా చెప్పిన దీప్తి సునైన!

ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే ప్రేక్షకుల్లో కొంతమందికి చాలా చిన్నచూపు ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల గురించి ఏవేవో అనుకుంటూ ఉంటారు. మోడ్రన్ డ్రస్సులు వేసుకోవడం వలన వాళ్ళను జడ్జ్ చేస్తూ ఉంటారు. సిగరెట్ తాగుతారని, మందు కొడతారని అపోహతో ఉంటారు. అయితే, తనది మందు కొట్టని బ్యాచ్ అని 'బిగ్ బాస్' ఫేమ్, సోషల్ మీడియా స్టార్ దీప్తి సునైన చెప్పింది. త‌ర‌చూ త‌న ఫొటోలు, త‌న యాక్టివిటీస్‌కు సంబంధించిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో ట‌చ్‌లో ఉంటుంది దీప్తి.

కాస్ట్యూమ్ డిజైనర్ నవ్య మరౌతు బర్త్ డే సెలబ్రేషన్స్ కు దీప్తి సునైన అటెండ్ అయ్యింది. 'బిగ్ బాస్' ఫేమ్స్ దేత్తడి హారిక, తీన్మార్ సావిత్రి, అఖిల్ సార్థక్, యాక్టర్ అండ్ సింగర్ నోయెల్, యూట్యూబ్ స్టార్లు తదితరులు అటెండ్ అయ్యారు. యూట్యూబ్ ఫిలిమ్స్ చేసే గోల్డీ, నవ్య మరౌతు, ఉదయ్ తేజ్ అనే వ్యక్తితో కలిసి 'ప్రౌడ్ నాన్ ఆల్కహాలిక్' అని దీప్తి సునైన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. కాఫీ తాగుతున్నట్టు ఇంకో స్టోరీ పోస్ట్ చేసింది.

దీప్తి సునైనను ఇంతకు ముందు ఎవరైనా కామెంట్ చేయడంతో ఇప్పుడు ఇలా చేసిందో, లేదంటే తాను నాన్ ఆల్కహాలిక్ అని చెప్పాలని అనుకుందో... మొత్తం మీద తాను మందు తాగనని ఆమె చెప్పింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.