English | Telugu

"రాజీవ్‌ను నానా మాట‌లు అని సుమ‌తో క్లోజ్‌గా ఎలా ఉన్నారు?".. అన్న‌పూర్ణ‌మ్మ‌కు నెటిజ‌న్ ప్ర‌శ్న‌

'రాజీవ్ కనకాల, అన్నపూర్ణమ్మ ల్యాండ్ ఇష్యూ ఎంతమందికి తెలుసు?' - 'స్టార్ట్ మ్యూజిక్' అప్‌కమింగ్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తే దాని కింద కామెంట్లలో ఇదొకటి. దీనికి కారణం ఏంటంటే? ఈ ప్రోగ్రామ్‌కి సుమ కనకాల యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ ఫిమేల్ యాక్టర్లతో కలిసి అన్నపూర్ణమ్మ ప్రోగ్రామ్‌కి వచ్చారు. సుమ, అన్నపూర్ణమ్మ క్లోజ్‌గా ఉండటం చూసి చాలామంది సెటైర్లు వేశారు. ఎందుకంటే?

రీసెంట్‌ ఇంటర్వ్యూలో ఒక స్థలం విషయంలో సుమ మామగారు దేవదాస్ కనకాల తనను మోసం చేశారని అన్నపూర్ణమ్మ కామెంట్లు చేశారు. రాజీవ్ కనకాలకు ఫోన్ చేసినా ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు. తనకు సంబంధం లేదన్నట్టు రాజీవ్ వ్యవహరించారని అన్నారు. దేవదాస్ కనకాల సంపాదించినది అంతా కొడుకుకు పెట్టాడని అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చారు. దాంతో షోలో సుమతో ఆమె క్లోజ్ గా ఉండటం చూసి కామెంట్లు చేశారు.

"అదేంటి? అన్నపూర్ణమ్మ గారు ఇంటర్వ్యూలో అలా చెప్పారు... 'రాజీవ్ గారు మోసం చేశారు, ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు' అని. కానీ, ఇప్పుడు ఎలా వచ్చారు? (షోకి). లాస్ట్ టైం 'క్యాష్'కి కూడా వెళ్లారు. ఎంతైనా మనల్ని మోసం చేసిన వాళ్ళతో అలా ఉండలేం కదా! డబ్బు కోసం అయినా ఒక్క షో వల్ల ఆవిడకేం కోట్లు వచ్చేయవు కదా! మహా అయితే ముప్పై వేలు ఇస్తారు. దాని కోసం చేసిన మోసాన్ని మర్చిపోతారా? 'క్యాష్'కి వెళ్ళినప్పుడు అడగొచ్చు కదా సుమగారిని. లేదంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్ కలిసి ఉంటారు కదా. అప్పుడు ఎందుకు అడగలేదు? అవాయిడ్ చేస్తున్నారు అన్నారు. అవాయిడ్ చేస్తే ఎలా ఎందుకు పిలుస్తారు?" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.