English | Telugu

లక్ష్మీదేవి రూపంలో దీప‌!

'కార్తీక దీపం' అభిమానులు వంటలక్కను ఎప్పుడో తమ కుటుంబంలో మనిషిగా చూడటం మొదలు పెట్టారు. సీరియల్‌లో పేరు దీప కంటే, అసలు పేరు ప్రేమి విశ్వనాథ్ కంటే వంటలక్కగా ఆవిడ ఫేమస్. వరలక్ష్మీ వ్రతం నాడు వంటలక్కను లక్ష్మీదేవిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది స్టార్ మా ఛానల్.

'తెలుగింటి ఆడపడుచులకు వరలక్ష్మీవ్రత కానుక. లక్ష్మీ అవతారంలో దీప' అంటూ 'మా వరలక్ష్మీ వ్రతం' పేరుతో స్టార్ మా ఛానల్ ఓ కార్యక్రమం చేసింది. తాజాగా ప్రోమో విడుదల చేశారు. అందులో లక్షీదేవిగా ప్రేమి విశ్వనాథ్ కనిపించారు. దాంతో అభిమానులు ఫుల్ హ్యాపీ.

'దీపక్క సాక్షాత్తు అమ్మవారిలా ఉన్నారు' అని చాలామంది సంబరపడ్డారు. 'ఎటువంటి పాత్రలోనైనా దీపక్క అదరగొట్టేస్తుంది' అని కొందరు ప్రశంసించారు. 'వంటలక్క ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ' అని కొందరు అడగటం విశేషం. ఒకరు అయితే 'వంటలక్క కాస్తా వరలక్ష్మీ అక్క అయ్యింది' అన్నారు. 'కార్తీక దీపం'లో దీప పాత్రను కొందరు ఎంత ఓన్ చేసుకున్నారంటే 'దీపగారు మీరు ఈ కార్యక్రమంలోనైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సీరియల్ లో అయితే ఎప్పుడూ ఏడుపే' అని కామెంట్ చేశారు.

శ్రావణ మాసం సందర్భంగా వచ్చే శ్రావణ శుక్రవారం ఈ కార్యక్రమం ప్రసారం చేసే అవకాశాలు ఉన్నాయి. లేదంటే వారాంతాల్లో ప్రసారం చేస్తారో? చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.