English | Telugu
అందుకే నీకు పెళ్లి కావట్లేదు!
Updated : Aug 13, 2021
బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రదీప్ ఒకడు. గతంలో 'స్వయంవరం' లాంటి ప్రోగామ్ చేశాడు గానీ పెళ్లి చేసుకోలేదు. అతడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనేదానిపై 'జబర్దస్త్', 'ఢీ' షో స్కిట్లలో కొందరు సెటైర్స్ వేశారు కూడా! అయితే, ప్రదీప్‌కు ఎందుకు పెళ్లి కావడం లేదో సింగర్ సునీత చెప్పడం విశేషం. షోలో సడన్‌గా ప్రదీప్ పెళ్లి టాపిక్ తీసుకొచ్చి సునీత పంచ్ వెయ్యడం ఇంట్రెస్టింగ్.
సునీత జడ్జ్‌గా చేస్తున్న 'డ్రామా జూనియర్స్' కామెడీ షోకి ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు కదా! వచ్చే ఆదివారం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసారమయ్యే ఎపిసోడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ ప్రజ్వల్ చందమామ రోల్ చేస్తూ ఒక స్కిట్ చేశాడు. అందులో 'అమ్మాయిలు చాలా డేంజర్... చాలా చాలా డేంజర్' డైలాగ్ చెప్పాడు.
స్కిట్ కంప్లీట్ అయ్యాక, ప్రజ్వల్ చేత జడ్జిమెంట్ టైమ్‌లో మరోసారి 'అమ్మాయిలు డేంజర్' డైలాగును ప్రదీప్ చెప్పించాడు. దాంతో సునీత 'ఇక్కడ ఎంతమంది ఆడవాళ్లు ఉన్నారో చూశావా? బయటకు వెళ్లాలని ఉందా?' అని ప్రజ్వల్ తో అన్నారు. అందుకు ప్రదీప్ 'నేను చెప్పింది అమ్మాయిల గురించి అని చెప్పు' అని ప్రజ్వల్‌కు సూచించాడు. దానికి సునీత షాక్ అయ్యింది. వెంటనే తేరుకుని 'ఇది ఆడవాళ్లపై డ్యామేజింగ్ స్టేట్మెంట్. అందుకే, నీకు ఇంత వయసు వచ్చినా పెళ్లి కావడం లేదు' అని సెటైర్ వేశారు. ప్రదీప్ ఆగుతాడా? "ఇది పెద్ద డైలాగే" అని రిప్లై ఇచ్చాడు. ఇంకేముంది? షోలో ఉన్నవాళ్లు అందరూ నవ్వుకున్నారు.