English | Telugu

'పెళ్లి సందడి' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడంటే...

యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'పెళ్లి సందడి' చిత్రాన్ని టీవీల్లో వీక్షించేందుకు ఎదురుచూస్తున్న ప్రేక్షకులందరికీ ఒక శుభవార్త. వరుస టెలివిజన్ ప్రీమియర్స్ తో దూసుకెళ్తున్న ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'జీ తెలుగు', ఇప్పుడు 'పెళ్లి సందడి' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో మీ ఎదురుచూపుకి ముగింపు పలకనుంది. గౌరీ రోణంకి దర్శకత్వంలో రోషన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా, దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, రఘు బాబు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా జూలై 17న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.

వివరాల్లోకి వెళితే, రాఘవేంద్రరావు ప్రముఖ బాస్కెట్ బాల్ క్రీడాకారుడిగా,ద్రోణాచార్య అవార్డుగ్రహీతగా వశిష్ఠ అనే పాత్రలో నటించగా, యుక్తవయస్సులోని వశిష్టగా రోషన్ అదరగొట్టాడు. వశిష్ఠ (రాఘవేంద్ర రావు) తన జీవితకథను వివరిస్తుండడంతో కథ మొదలవుతుంది. వశిష్ఠ విధి కంటే సంకల్పశక్తే గొప్పదని నమ్మితే, సహస్ర (శ్రీలీల) విధే అన్నింటికీ కారణం అని విశ్వసిస్తుంది.

ఐతే, వీరిద్దరూ ఒక పెళ్లిలో కలుసుకొని ప్రేమలో పడతారు. కానీ, సహస్ర తండ్రి (ప్రకాష్ రాజ్) వారి ప్రేమను అంగీకరించపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. అయితే, వశిష్ట, సహస్రజంట తనను తిరిగి ఎలా ఒప్పిస్తారన్నదే మూలంగా కథ సాగుతుంది. వశిష్ఠ మరియు సహస్ర మధ్య జరిగే సన్నివేశాలు, రవి బాబు, షకలక శంకర్, వెన్నెల కిషోర్ వంటి హాస్యనటుల అద్భుతమైన ప్రదర్శనలతో ఈ సినిమా ఆధ్యాంతం నవ్వులు పూయిస్తుంది. ఎం.ఎం కీరవాణి అందించిన సంగీతం అందరిని ఆకట్టుకోగా, కలర్ఫుల్ విజువల్స్ తో సినిమాటోగ్రఫీప్రేక్షకులను మెప్పించనుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.