English | Telugu

ఐసీయూలో ఆర్య‌.. అను ఏమైంది?

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతూ చిత్ర విచిత్ర‌మైన మ‌లుపులు తిరుగుతున్న ఈ సీరియ‌ల్ ని మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో సాగే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రూపొందింయారు. శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష హెచ్ కె జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ‌య‌ల‌లిత‌, విశ్వ‌మోహ‌న్‌, రాం జ‌గ‌న్‌, రాధాకృష్ణ‌, జ్యోతిరెడ్డి, క‌ర‌ణ్, అనుషా సంతోష్‌, సందీప్, మ‌ధుశ్రీ త‌దిత‌రులు న‌టించారు.

మ‌లేసియా హ‌నిమూన్ టూర్ విషాదంగా మారుతుంది. హ‌నీమూన్ కోసం మ‌లేసియా వెళ్లిన ఆర్య - అను తిరిగి హైద‌రాబాద్ వ‌స్తుంటారు. వీళ్లు ప్ర‌యాణిస్తున్న ఫ్లైట్ ప్ర‌మాదానికి గుర‌వుతుంది. సాంకేతిక లోపం కార‌ణంగా మంట‌లు చెల‌రేగ‌డంతో ఫ్లైట్ కాస్తా స‌ముద్రంలో ప‌డిపోతుంది. ఈ వార్త విన్న అను ప్యామిలీ తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతారు. టీవీలో ఈ వార్త చూస్తూనే అను తండ్రి సుబ్బు హార్ట్ స్ట్రోక్ కు గురికావ‌డంతో ఆయ‌న‌ని బ‌స్తీ వాసులు ఆసుప‌త్రికి త‌ర‌లిస్తారు.

ఇక ఆర్య ఇంట్లో ప‌రిస్థితి కూడా ఇదే త‌ర‌హాలో వుంటుంది. ఆర్య - అను లు ప్ర‌యాణిస్తున్న విమానం ప్ర‌మాదానికి గురైంద‌ని తెలియ‌డంతో ఆర్య త‌ల్లి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు లోన‌వుతుంది. ఇదే అద‌నుగా మాన్సి త‌ల్లి మాట‌ల‌తో ఆర్య ఫ్యామిలీని చిత్ర‌వ‌ద చేస్తూ వుంటుంది. ఆర్య - అను తిరిగిరాని లోకాలుకు వెళ్లిపోయార‌ని, వారు బ్ర‌తికి రావ‌డం క‌ల్ల అని ముస‌లి క‌న్నీరు కారుస్తూ వేధిస్తూ వుంటుంది. అదే స‌మ‌యంలో ఇంటికి వ‌చ్చిన జెండే మాన్సీ త‌ల్లి షీలా నోరు మూయిస్తాడు. ఆర్య - అను బ్ర‌తికే ఛాన్స్ వుందంటాడు. క‌ట్ చేస్తే ఐసీయూలో అర్య .. త‌ల‌కు క‌ట్ల‌తో లేచి అను అంటూ అరుస్తాడు. వెంట‌నే ఆర్య ద‌గ్గ‌రికి వ‌చ్చిన జెండే అనుకు ఏమీ కాలేదంటాడు. కానీ ఆర్య న‌మ్మ‌డు.. ఇంత‌కీ అను ఏమైంది? ఎక్క‌డుంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.