English | Telugu

ఇంతకూ 'జబర్దస్త్‌'కు ఏమైంది?

ఒకప్పుడు జబర్దస్త్ అంటే ఇంటిల్లిపాది హాయిగా నవ్వించడానికి అన్నట్టు ఉండేది. కొన్నేళ్లు బాగానే నడిచింది. కానీ తర్వాత్తర్వాత దాని రేటింగ్ పూర్తిగా తగ్గిపోయింది. ఇందులో ఉన్న టాప్ కమెడియన్స్, జడ్జెస్ ఎవరికీ వారు ఈ వేదికను వదిలి తమకు వస్తున్న అవకాశాలతో, రకరకాల కారణాలతో షోని వదిలేసివెళ్లిపోతున్నారు. దీని కారణంగా జబర్దస్త్ కళ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. నిన్న మొన్నటి వరకు జబర్దస్త్ వేదిక నిండు గోదారిలా ఉండేది. కానీ ఇప్పుడు చాలా పాపులర్ పర్సన్స్ స్కిట్స్ లేకపోయేసరికి ఈ షో చ‌ప్పగా సాగుతోంది. ఇక ఇటీవల కొంతమంది ఆర్టిస్టులు మల్లెమాల సంస్థ గొప్పతనాన్ని డామేజ్ చేసేలా మాట్లాడుతున్నారు.

అలాగే జబర్దస్త్ అనేది కమెడియన్స్ వల్లనే బతికి బట్టకడుతోందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేసరికి ఈ షో రేటింగ్ అమాంతం కిందకు పడిపోయింది. అలాగే నాగ‌బాబు, రోజా.. ఇలా ఒక్కొక్కరు వెళ్లిపోయేసరికి ఈ కామెంట్స్ అన్ని నిజమేనేమో అని అనిపిస్తోంది. ఐతే ఇన్ని విషయాలను తట్టుకుని కూడా జబర్దస్త్ షో సక్సెసఫుల్ గా రన్ అవుతోంది. నాగబాబు వెళ్ళిపోయాక రోజా ఈ షో బాధ్యతలను సక్రమంగా నిర్వహించి మంత్రి పదవి వచ్చేసరికి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా ఈ షోకి గుడ్ బై చెప్పేసరికి ఈ షో కి ఉన్న ఒకే ఒక అందం కూడా పోయింది. ఈ పరిస్థితులను ఆలోచిస్తూ ఉంటే.. అసలు ఈ జబర్దస్త్ ఎటు పోతోంది అనే మీమాంస ఇప్పుడు అందరిలో మొదలయ్యింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.