English | Telugu

`కార్తీక దీపం`: దీప‌ని త‌ప్పించే ప్లాన్ చేసిన మోనిత‌

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ధారావాహిక `కార్తీక దీపం`. నేడు 1210వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు ఈ రోజు ఎపిసోడ్‌లో చోటు చేసుకోనున్నాయి. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. హిమ‌, శౌర్య ఇద్ద‌రూ కార్తీక్‌, దీప ఆనందంగా వుండ‌టం చూసి ఎప్పుడూ ఇలాగే న‌వ్వుతూ వుండాల‌ని కోరుకుంటారు. అదే స‌మ‌యంలో శౌర్య `హిమా.. నీకో గుడ్ న్యూస్ ..మ‌నం త్వ‌ర‌లో బ‌స్తీలో ఇల్లు క‌ట్టుకోబోతున్నాం.. అమ్మా నాన్నా.. ఇద్ద‌రూ సైట్ చూడ‌టానికి బ‌స్తీకి వెళుతున్నారు తెలుసా` అంటుంది.

క‌ట్ చేస్తే... మోనిత ఇంట్లో న‌వ్వుకుంటూ వుంటుంది. అది చూసిన ప్రియ‌మ‌ణి `అంతగా అవ‌మానిస్తే ఇలా న‌వ్వుకుంటుందేంటీ? ` అని అనుకుంటుంది. అది గ‌మ‌నించిన మోనిత `ఏంటీ ప్రియ‌మ‌ణి నేనేంటో అర్థం కావ‌డం లేదు క‌దా? .. నా ప్రేమ గొప్ప‌ది ప్రియ‌మ‌ణి దాని గురించి ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు అంతే. నేనే అర్థ‌మ‌య్యేలా చెప్పాలి క‌దా? .. చెబుతాను.. దీప‌కు ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇస్తాను` అంటుంది న‌వ్వుతూ. దానికి ప్రియ‌మ‌ణి `అమ్మా మీరు తేల్చుకోవాల్సింది కార్తీక్ అయ్య‌తో క‌దా మ‌ధ్య‌లో పాపం దీప‌మ్మ ఏం చేస్తుంది` అంటుంది.

ఇంత‌లో భార‌తి ఫోన్ చేసి `మోనిత డాక్ట‌ర్ అసోసియేష‌న మీటింగ్‌కి వస్తున్నావా?` అని అడుగుతుంది. కార్తీక్‌ని ప్రెసిడెంట్‌ని చేస్తున్నార‌ట అంటుంది. దానికి `నేను ఎక్క‌డికీ రాను.. న‌న్ను విసిగించ‌కు ఫోన్ పెట్టేయ్‌` అంటుంది మోనిత‌. అయితే నువ్వు రావ‌ట్లేద‌న్న‌మాట వ‌చ్చి ఏ గొడ‌వ చేస్తావో అనుకున్నాను` అంటూ ఫోన్ క‌ట్ చేస్తుంది భార‌తి. సీన్ క‌ట్ చేస్తే మోనిత కార్తీక్ ఫొటోతో మాట్లాడుతూ ఉంటుంది. `నీకు వార‌సుడ్న ఇచ్చినా నా మీద ప్రేమ పుట్ట‌ట్లేదా` అంటుంది. దీప బుర్ర ఏంటో నాకు అర్థం కావ‌డం లేదు. త‌ప్పిస్తాను. త‌ప్పించాల్సిందే.. ఎలా ఆ దీప‌ని త‌ప్పించాలి? అంటూ మోనిత త‌న‌కు తానే మాట్లాడుకుంటుండ‌గా ఆ మాటు ప్రియ‌మ‌ణి వింటుంది. దీప‌ని త‌ప్పించ‌డం కోసం మోనిత చేస్తున్న ప్లాన్ ఏంటీ? .. ఇంత‌కీ మంగ‌ళ‌వారం ఏం జ‌ర‌గ‌బోతోంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.