English | Telugu

'అన్ స్టాపబుల్' మూడో ఎపిసోడ్.. బాలయ్య-బ్రహ్మి కలిస్తే రచ్చ రచ్చే!

ఓటీటీ వేదిక ఆహాలో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోతో నటసింహం నందమూరి బాలకృష్ణ అలరిస్తోన్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, నాని గెస్ట్ లుగా వచ్చిన మొదటి రెండు ఎపిసోడ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే బాలకృష్ణ చేతికి సర్జరీ జరిగి, మూడో ఎపిసోడ్ మూడు వారాలు గ్యాప్ రావడంతో.. గెస్ట్ ఎవరు? ఎపిసోడ్ ఎప్పుడొస్తుంది? అంటూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచుతున్నారు. అయితే తాజాగా ఆహా మూడో ఎపిసోడ్ గురించి క్లారిటీ ఇచ్ఛేసింది.

రీసెంట్ గా ఆహా ఒక వీడియోను విడుదల చేసింది. అందులో 'వారం వారం రావడానికి నేను సీరియల్ ని కాదు.. సెలబ్రేషన్ ని' అంటూ బాలకృష్ణ మరింత ఎనర్జీతో కనిపించారు. దీంతో ప్రేక్షకుల్లో అన్ స్టాపబుల్ మూడో ఎపిసోడ్ పై ఆసక్తి రెట్టింపు అయ్యింది. అయితే తాజాగా మూడో ఎపిసోడ్ గెస్ట్, టెలికాస్ట్ వివారాలను ఆహా ప్రకటించింది. మూడో ఎపిసోడ్ గెస్ట్ లుగా కామెడీ కింగ్ బ్రహ్మానందం, 'ఫన్'టాస్టిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వస్తున్నారని తెలిపింది. అలాగే ఈ ఎపిసోడ్ ఈనెల 3 నుంచి స్ట్రీమింగ్ కానుందని పేర్కొంది.

'అన్ స్టాపబుల్' షోలో బాలకృష్ణ ఫుల్ ఎనర్జీతో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో కలిసి ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో చూడాలి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.