English | Telugu

'ఇమ్మూ మీ మమ్మీకి చెప్పు కోడలొస్తుందని'.. వైర‌ల్ అయిన వ‌ర్ష కామెంట్స్‌!

ఎక్స్ట్రా జబర్దస్త్ లో మంచి టైమింగ్ ఉన్న కామెడీతో పర్లేదనిపిస్తూ ముందుకు నడుస్తోంది వర్ష. ఐతే నెక్స్ట్ వీక్ ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. "వర్షా .. లవ్ చేస్తున్న వాళ్ళ మధ్య అనుమానం రావడం సహజమే. ఎప్పుడైనా ఇమ్ము నీ మీద అనుమానం పడడం కానీ ఏదైనా జరిగిందా?" అంటూ ఇంద్రజ వర్షని అడుగుతుంది. "నా లైఫ్ లో ఇంకా అదృష్టం, లక్ ఉంది అంటే అది నా ఇమ్ము మాత్రమే.. ఎవరేమనుకున్నా నో ప్రాబ్లెమ్, వాడేంటి, ఈమేంటి అనే కామెంట్స్ వచ్చినా అవన్నీ పట్టించుకోను.. నాకు నా ఇమ్ము అంటే ఇష్టం" అంటూ ప్రేమగా ఇమ్ము వైపు చూస్తుంది వర్ష. "ఇమ్ము మీ మమ్మీకి చెప్పు కోడలొస్తుందని" అని చెప్తూ వర్ష నవ్వుతో స్టేజి మీద నుంచి వెళ్ళిపోతుంది.

ఐతే ఇమ్ముని, వర్షాను ఒకానొక సందర్భంలో నెటిజన్స్ సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రోల్ చేశారు. రంగుని, జెండర్ ని ప్రత్యేకంగా చూపిస్తూ కామెంట్స్ కూడా చేశారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. ఇక స్టేజి మీద వర్ష చెప్పకుండానే లవ్ అండ్ మేరేజ్ ప్రొపోజల్ చెప్పేసరికి ఇమ్ము కూడా షాక్ అయ్యాడు.. బులెట్ భాస్కర్ ఇమ్మూకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. రష్మీ కూడా వీళ్ళ ప్రేమను చూసి మురిసిపోతూ ఉంటుంది.

ఇటీవల ఈ షోలో ఏదైనా ఒక జంట ఆడియెన్స్ మెప్పు పొందితే చాలు ఇక ప్రతీ షోలో వాళ్లే జంటగా పెర్ఫార్మ్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అలాంటి కోవలోకి వస్తారు సుధీర్, రష్మీ. ఈ జంట ఇలాగే పాపులర్ అయ్యింది. తర్వాత ఇద్దరికీ పెళ్ళెప్పుడు అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. తర్వాత వర్ష, ఇమ్ము, సీరియల్స్ లోకి వచ్చేసరికి రవి కృష్ణ, నవ్య స్వామి. వీళ్లంతా స్క్రీన్ పెయిర్స్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.