English | Telugu

రెండు‌ కుటుంబాల మధ్య ప్రేమ నిలవగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -06 లో....చిన్నోడు దొంగతనం చేసాడని రామరాజు తిడతాడు. అయినా దొంగతనం చేసిన నడిపోడు మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత చిన్నోడు లోపలికి వెళ్లి బాధపడుతుంటాడు. ఎందుకు రా ఇలా దొంగతనం చేసావ్.. నాన్నని ఎందుకు బాధపెడుతావంటూ కోప్పడతాడు. అప్పుడే నడిపోడు చిన్నోడి దగ్గరికి వచ్చి సారీ అని చెప్తాడు.

అక్కడ అదంతా జరుగుతుంటే సైలెంట్ గా ఉండి ఇక్కడ సారీ చెప్తున్నావా అని చిన్నోడు కోప్పడుతుంటే అప్పుడే వాళ్ళ మామ వచ్చి నువ్వు ఎందుకు సారీ చెప్తున్నావ్.. అసలేం జరిగిందని అడుగుతాడు. ఆ దొంగతనం చేసింది నడిపోడని చెప్తాడు. మరి ఎందుకురా మీ నాన్న అంత తిడుతుంటే సైలెంట్ గా ఉన్నావ్.. ఇప్పుడే వెళ్లి మీ నాన్నకి నిజం చెప్తానని వాళ్ళ మామ అనగానే.. వద్దు మామ, వాడు చూడు ఎలా భయపడుతున్నాడో. వాడు తప్పు చేసాడని తెలిస్తే అసలు ఉండలేడని ఆపుతాడు. ఎందుకురా అన్ని మాటలు అంటున్నా కూడ మౌనంగా ఉన్నావని వాళ్ళ మామ అడుగుతాడు. నా కుటుంబం కోసమే కదా అని చిన్నోడు అంటాడు. ఆ తర్వాత వేదవతి చిన్నోడి దగ్గరికి వచ్చి.. నువ్వు మాట్లాడింది మొత్తం విన్నాను. ఎంత మంచి వాడివి అని అంటుంది. ఆ తర్వాత వేదవతి తన కుటుంబానికి దూరం అయ్యానని బాధపడుతుంటే చిన్నోడు లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు. మరొక వైపు వేదవతి వాళ్ళ అమ్మ బాధపడుతుంది.

ఆ తర్వాత వేదవతి బాధపడడం రామరాజు చూసి.. నాకు కుటుంబం ఉంది ఎందుకు నన్ను ఇంకా అనాథ అంటున్నారు.. మనలా మన పిల్లలు ప్రేమ వివాహం చేసుకోవద్దు.. నేనే సంబంధం కుదుర్చి పెళ్లి చేస్తానని అంటాడు. ఆ తర్వాత వేదవతి తమ్ముడు భద్రవతి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు. భద్రవతి ఎందుకు వచ్చావ్ అంటుంది. నాకు హక్కు ఉంది నేను వస్తానని అతను అంటాడు. గంట సేపు ఉండి వెళ్ళమని భద్రవతి చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి.. మన పెద్దోడికి తెలిసిన వాళ్ళు సంబంధం తెచ్చారని అంటుంది. వాడికి నేను చూసి చేస్తాను అయిన నా పెద్ద కొడుకు నేను చెప్పింది చేస్తాడని రామరాజు అంటాడు. ఆ తర్వాత పెద్దోడు గుడిలో ఎవరికో అమ్మాయికి రమ్మని కాల్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.