English | Telugu

భార్యని తప్పుగా అర్థం చేసుకున్న భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -256 లొ.....సీతాకాంత్ తన తల్లి పేరు పైన ఆస్తులు రాయాలని నిర్ణయం తీసుకున్నాడు. దాంతో లాయర్ కి చెప్పి డాక్యుమెంట్స్ రెడీ చేయమంటాడు. అప్పుడే లాయర్ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాడు. దాంతో శ్రీవల్లి, శ్రీలత, సందీప్ లు ఆస్తి సొంతం కాబోతుందని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క సంతకం చేస్తే ఆస్తులు తమ పేరున అయిపోతాయని లాయర్ అంటాడు. సీతాకాంత్ సంతకం చేస్తాడు. ఇక ఆస్తులు అన్నీ కూడా నా తల్లివే అని సీతాకాంత్ అంటాడు.

ఇక నువ్వు ఇక్కడ ఎందుకు అక్కయ్య వెళ్ళిపోమని రామలక్ష్మిని శ్రీవల్లి అనగానే.. వల్లీ అంటూ సీతాకాంత్ తనపై కోప్పడతాడు. అయినా నేను ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళాలి చెల్లి.. ఈ ఆస్తులకి యజమానిరాలిని నేనే అని రామలక్ష్మి అనగానే.. అప్పుడే డాక్యుమెంట్స్ అన్ని సందీప్ చూస్తాడు. అవన్నీ కూడా రామలక్ష్మి పేరున ఉండడంతో అందరు షాక్ అవుతారు. ఏంటి లాయర్ గారు నేను మా అమ్మ పేరున చెప్పను కదా అని సీతాకాంత్ అనగానే.. మీరు చెప్పినట్టే చేసానని లాయర్ అంటడు. లాయర్ బయటకు వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ రామలక్ష్మి మారుస్తుంది. లాయర్ గారు మీరు వచ్చిన పని అయింది వెళ్ళండి అని లాయర్ ని రామలక్ష్మి పంపిస్తుంది. ఆస్తుల కోసం ఇదంతా చేస్తావా అని శ్రీలత అంటుంది. నీకు ఆస్తులు ముఖ్యం అయితే నేనే రాసేవాడిని కదా ఎందుకు ఇలా మా వాళ్లపై నిందలు వేసావని సీతకాంత్ అంటాడు.

నేనేం చేసినా మా ఆయన కోసమని రామలక్ష్మి అంటుంది. అలా అయితే ముందే చెప్పాలి కదా ఇలా చెయ్యడం ఏంటని పెద్దాయన, సిరి అంటారు. ఆ తర్వాత రామలక్ష్మి అక్క ఎంత మోసం చేసిందని శ్రీలత , సందీప్ లతో శ్రీవల్లి అంటుంది. అప్పుడే రామలక్ష్మి వచ్చి మాట్లాడుతుంది. నువ్వు గెలిచావనుకుంటున్నావ్ గనీ సీతా మనసులో నీపై నమ్మకం పోయిందని రామలక్ష్మితో శ్రీలత అంటుంది. ఆ తర్వాత నువ్వు ఆస్తులపై ప్రేమ పెంచుకున్నావ్.. అందుకే ఇదంతా చేసావ్.. మోసం చేసావ్ రామలక్ష్మి అని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.