English | Telugu

సోనియా దెబ్బకి అల్లాడిన నిఖిల్.. గ్యాప్ లేకుండా బాదుడే బాదుడు!

బిగ్ బాస్ హౌస్ లో పన్నెండవ వారం నామినేషన్ల హవా మాములుగా లేదు. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఇప్పటి వరకు ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ ని లోపలికి తీసుకొచ్చి నామినేషన్ చేపించాడు బిగ్ బాస్.

హౌస్ లోకి మొదటగా సోనియా వచ్చింది. వచ్చీ రాగానే నిఖిల్, పృథ్వీ వెళ్ళి సోనియాని హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత సోనియా మొదటి నామినేషన్ గా ప్రేరణని చేసింది. తన బిహేవియర్ బాలేదని, నబీల్ ని గౌతమ్ ని ట్రీట్ చేసిన విధానం బాలేదని చెప్పి నామినేషన్ చేసింది. కిల్లర్ గర్ల్ టాస్క్ లో పృథ్వీ గురించి మాట్లాడింది నచ్చలేదని చెప్పి ప్రేరణని నామినేషన్ చేసింది సోనియా. ఆ తర్వాత నిఖిల్ ని నామినేట్ చేసింది సోనియా. నేను ఫస్ట్ వీక్‌ నుంచి చెప్తున్నా.. నీకు ఇమ్యునిటీ లేకపోతే నా నామినేషన్ నీకే పడుతుందని.. తొలి నాలుగు వారాలు నువ్వు ఇమ్యునిటీలోనే ఉన్నావ్. అందుకే నామినేట్ చేయలేదని అన్నది. నీ నుంచి నేనే కాదు.. నీ ఫ్యాన్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేసేది ఏంటంటే.. జెన్యునిటీ అని అంటూ.. మొదటిగా పృథ్వీని ఎందుకు నామినేట్ చేశావ్.. కేర్ లెస్.. కాఫీ కప్పు కోసం నామినేట్ చేశావ్. ఇప్పటి వరకు నువ్వు చేసిన నామినేషన్స్‌లో ఒక్కటైనా వ్యాలిడ్ రీజన్ ఉందా.. అసలు గమనించుకున్నావా అని సోనియా అడిగింది. నీకు అలా అనిపిస్తే నేనేం చేయలేనని నిఖిల్ అన్నాడు. అనిపించడం కాదు.. పలానా వాళ్లని కరెక్ట్ రీజన్‌తో నామినేట్ చేశా అని చెప్పమని సోనియా అడిగింది. ఆ మాటతో నిఖిల్.. నన్ను కూడా సరైన రీజన్ లేకుండా నామినేట్ చేశారని నిఖిల్ అన్నాడు‌. నేను అడిగింది వేరు నువ్వు చెప్తున్నది వేరు.. ఎందుకు నేను ఈ మాట నీతో చెప్తున్నానంటే.. పృథ్వీ గురించి కూడా.. ముందు ఒకలా అంటావ్. అతని గురించి ఎవరైనా నెగిటివ్‌‌గా అంటే.. అవునురా వాడు అంతేరా అంటావ్. ఇదీ నీ ఫ్రెండ్ షిప్. ఇది గేమ్ షో కాదు.. గేమ్ షో అయితే విన్నర్ అవుతావ్. కానీ ఇది పర్సనాలిటీ గేమ్ షో.

నువ్వు ఫస్ట్ వీక్స్‌లో చీఫ్ అయ్యావ్ కదా.. ఇన్ని వారాలు ఎందుకు అవ్వలేదు. నీలో అసలు జెన్యూనిటీ లేదు.. నువ్వు ఫెయిల్ అయితే దాన్ని అందరిపై నెట్టేస్తావని సోనియా అనగా.. నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావ్.. ఇవన్నీ చెప్తున్నావ్.. నాకు అర్థమవుతుంది.. నేను సేఫ్ గేమ్ ఆడటం లేదని నిఖిల్ అన్నాడు. దానికి పెద్దగా నవ్విన సోనియా.. అమ్మాయి.. నో అంటే నో అని చెప్పి గౌతమ్‌ని నామినేట్ చేయడం నామినేషన్ పాయింటా అని అన్నది. నో అన్నందుకు కాదు.. అతను డిస్ రెస్పెక్ట్ చేశాడు. అందుకే నామినేట్ చేశానని నిఖిల్ అన్నాడు. రెండు నెలల నుంచి ప్రేరణ డిస్ రెస్పెక్ట్ చేస్తుంటే నీకు కనిపించలేదా అని సోనియా అడిగేసరికి.. నేను ఈరోజు ఆమెనే చేద్దాం అనుకున్నానని నిఖిల్ అన్నాడు. అక్కా అని అన్నందుకు నువ్వు అతన్ని నామినేట్ చేశావ్. ప్రేరణ డిస్ రెస్పెక్ట్‌గా లేదా? ఆమెను ఎందుకు నామినేట్ చేయలేదు.. యష్మీ డిస్ రెస్పెక్ట్‌గా లేదా? ఆమెను ఎందుకు నామినేట్ చేయలేదు. తేజా చేసింది తప్పని చెప్పినప్పుడు.. యష్మీ చేసింది కూడా తప్పే కదా.. కానీ నువ్వేం అన్నావ్.. యష్మీది తప్పే కాదని చెప్పావ్ కదా అని సోనియా. అడిగేసరికి.. నేను అలా అనలేదే.. తప్పని అన్నానని నిఖిల్ అన్నాడు. అప్పుడు తేజా, రోహిణిలు తగులుకున్నారు.. తప్పు లేదన్నావ్ కదా అని.. దాంతో నిఖిల్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.‌గ్రూప్‌గా సేఫ్ గేమ్ ఆడుతున్నావ్.. ఇప్పుడే కాదు.. ఫస్ట్ వీక్ నుంచి ఇలాగే ఉంది నీ గేమ్. అంటు సోనియా రఫ్ఫాడించగా నిఖిల్ అల్లాడిపోయాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.