English | Telugu
illu illalu pillalu : నేను అనాథ కాదు.. నాకు కుటుంబం ఉంది!
Updated : Nov 15, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -03 లొ.....భద్రవతి, రామరాజులకి గొడవ అవుతుంది. దాంతో వాళ్లపై కోపంతో.. ఇన్ని రోజుల్లో ఎప్పుడు పెళ్లి రోజు జరుపుకోలేదు. ఈ సారి గ్రాండ్ గా పెళ్లి రోజు జరుపుకుంటామని భద్రవతితో ఛాలెంజ్ చేస్తాడు రామరాజు. దాంతో రామరాజు ముగ్గురు కొడుకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంటారు.
ఆ తర్వాత రామరాజు పెద్ద కొడుకు అమ్మ నాన్నకి గిఫ్ట్ అంటూ రింగ్స్ ఇస్తాడు. నడిపోడు వాచ్ ఇస్తాడు. వేదవతికి తన కూతురు చెవికమ్మలు ఇస్తుంది. చిన్నోడు పట్టు పంచ తీసుకొని వస్తాడు. అప్పు చేసి తీసుకొని వచ్చాడని రామరాజు కోప్పడతాడు. చిన్నోడు అలిగి కూర్చొని ఉంటే వేదవతి బుజ్జగించి మీ నాన్న ఆ బట్టలు తీసుకునేలా నేను చేస్తానని వేదవతి అంటుంది. రామరాజు పెళ్లి రోజు గనుక వేదవతికి చీర ఇస్తాడు. మీరు ఈ పంచె కట్టుకుంటేనే నేను చీర కట్టుకుంటా అనగానే రామరాజు తప్పక పంచె కట్టుకుంటాడు. ఇక చిన్నోడు ఎదురు ఇంట్లో ఉన్న తన మామ కూతురిని డ్యాన్స్ చేస్తూ రెచ్చగొడతాడు. తను కూడా అలాగే చేస్తుంది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు వేరువేరుగా గుడికి వెళ్తారు. మేమ్ ముందు వచ్చాము. మాకు అర్చన చెయ్యండి అంటూ పంతులిని అంటారు. ఇద్దరికి ఒకేసారి చేస్తానని పంతులు అంటాడు. ఆ తర్వాత భద్రవతి పుట్టిన రోజు సందర్భంగా తన తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. పక్కనే రామరాజు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న వేదవతిని కూడా వాళ్ళ అమ్మ ఆశీర్వదిస్తుంది.
ఆ తర్వాత ఆ రామరాజు గాడు పెట్టే భోజనాలకి ఎవరు వెళ్లొద్దంటు సేనాపతికి భద్రవతి చెప్తుంది. అప్పుడే ఊళ్ళో కొంతమంది భద్రవతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వస్తారు. ఇక రామరాజు గారి దగ్గరికి వెళ్తామని వెళ్తుంటే మీకు ఏర్పాట్లు చేసామంటూ లోపలికి తీసుకొని వెళ్తాడు సేనాపతి. మరొక వైపు ఊళ్ళో వారికి భోజనాలు పెట్టడానికి రామరాజు ఏర్పాట్లు చేస్తాడు. తరువాయి భాగంలో నాకు ఒక కుటుంబం ఉంది. నా ఇల్లు, ఇల్లాలు, పిల్లలు.. నేను అనాధ కాదని రామరాజు అనగానే.. అయితే నీ ఇంటిపేరు చెప్పమని భద్రవతి అంటుంది. దాంతో రామరాజు తడబడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.