English | Telugu
టైటిల్ రేసులోకి దూసుకొచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్.. నబీల్ పరిస్థితేంటో!
Updated : Nov 15, 2024
బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకొని పదకొండో వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కావడంతో హౌస్ మేట్స్ యొక్క అమ్మ, నాన్న, భార్య, అన్నయ్య.. ఇలా వస్తున్నారు. అయితే ఈ వీకెండ్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతారనేదని కంటే కూడా టైటిల్ గెలిచేదెవరనేది సోషల్ మీడియా లో డిస్కషన్ జరుగుతుంది.
ఈవారం ఓటింగ్ లో అనూహ్యమైన మార్పులతో సాగుతుంది. నిన్న మొన్నటి వరకు నబీల్, నిఖిల్ ఇద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారని అనుకున్నారంతా కానీ అనూహ్యంగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ టైటిల్ రేస్ లో నిలిచాడు. ఎప్పుడైతే హౌస్ లో కన్నడ గ్రూపిజం బయటపడిందో.. నబీల్‌ని సైతం ఫినాలేకి రాకుండా చేయాలని నిఖిల్ కుట్రలు పన్నాడో.. ఎవిక్షన్ షీల్డ్ విషయంలో నిఖిల్ వారితో అలా మాట మార్చేయడం.. ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ఇలాంటి వాడినా మనం విన్నర్‌ని చేసేదనే ఆలోచనలో పడ్డారు ఆడియన్స్. ఇక ఫ్యామిలీ వీక్‌లో అతని తల్లి రావడం.. మనోడి గ్రూప్ గేమ్.. యష్మీతో డిస్టేన్స్ ఉండమని చెప్పడం.. 'జీ' తో నామినేషన్ వద్దని చెప్పడం.. ప్రేరణకి దూరంగా ఉండమనడం.. ఇదంతా చూడటంతో నిఖిల్ చాలా వరకు బ్యాడ్ అయ్యాడు. ఇదే టైమ్ లో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన గౌతమ్ పుంజుకోవడంతో అతను టైటిల్ రేస్‌లోకి వచ్చేశాడు.
ఇక ఈవారం ఏ ఓటింగ్ పోల్ చూసుకున్నా గౌతమ్ టాప్‌లో ఉన్నాడు. ఇక తన తప్పు లేకపోయిన శిక్షించబడ్డ టేస్టీ తేజా అనూహ్యంగా టాప్-5 రేస్‌లోకి వచ్చేశాడు. అతను ఓటింగ్ లో సెకెండ్ పొజిషన్‌లో ఉన్నాడు.. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 11వ వారం నామినేషన్స్ లిస్ట్‌లో యష్మీ ఉందనే విషయం బయటకు వచ్చిందో లేదో.. నో డౌట్ ఆమె ఎలిమినేషన్ గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ వాళ్ళ అమ్మ రావడంతో యష్మీకి కాస్త ప్లస్ అయ్యింది. అయితే ఏ ఓటింగ్ పోల్ చూసిన యష్మీ రెండు లేదా మూడవ స్థానంలో ఉంటుంది. ఇక అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక నామినేషన్ లో లేని నబీల్ కి విన్నర్ అవ్వడానికి ఓటింగ్ పడుతుందో లేదో అనిపిస్తోంది. కానీ గౌతమ్ కి పాజిటివిటి పెరిగింది. ఇక నిఖిల్ కన్నింగ్ గేమ్ చూసిన ఆడియన్స్ ఓటింగ్ వేయడం కష్టమే. అయితే చివరికి వరకు ఎవరు టైటిల్ గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.