English | Telugu

రష్మీలో ఓంకార్‌కి నచ్చేది ఇదేనంట‌!

'సిక్త్స్ సెన్స్' షోకు వచ్చిన ఫిమేల్ సెలబ్రిటీల అందాన్ని వర్ణిస్తూ... ఓంకార్ కవిత్వాలు ఒలికిస్తున్నాడు. మొన్నటికి మొన్న దివి వస్తే చక్కటి కవిత వినిపించాడు. అలాగే, ఈ వీకెండ్ ఎపిసోడ్ లో సందడి చేయనున్న రష్మీపై కూడా ఓ కవిత రాశాడు. ఆల్రెడీ రిలీజైన ప్రోమోలో కవిత్వం ఒలికించిన విజువల్స్ చూపించాడు. కవిత్వం మాత్రమే కాదు, అందాల భామలతో ఓంకార్ పులిహోర బాగా క‌లుపుతున్నాడ‌ని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు షోను ఇంట్రెస్టింగ్ గా మార్చడం కోసం ఓంకార్ తనలో చిలిపి కోణాన్ని బయటకు తీస్తున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా... లేటెస్టుగా విడుదలైన 'సిక్త్స్ సెన్స్' ప్రోమోలో రష్మీలో తనకు నచ్చేది ఏంటో ఓంకార్ చెప్పుకొచ్చాడు.

వన్ సెకండ్... 'సిక్త్స్ సెన్స్'లో పాపులర్ డైలాగ్ ఇది. సెలబ్రిటీలు గేమ్ ఆడేటప్పుడు ఓంకార్ ఈ డైలాగ్ చెప్పాడంటే వాళ్ళకు టెన్షన్ మరింత పెరుగుతుంది. రష్మీ గౌతమ్ గన్ పట్టుకుని షూట్ చేయడానికి సిద్ధమైనప్పుడు ఓంకార్ 'వన్ సెకండ్' అన్నాడు.

'మీలో నాకు నచ్చలేనిది అదే నాకు... వన్ సెకండ్' అని రష్మీ గౌతమ్ చెప్పింది.

'మీలో నచ్చింది నాకు ఇదే' అని వెంటనే తనలో చిలిపి కోణం బయటకు తీశాడు ఓంకార్.

'ఏంటి?' అని రష్మీ అడిగితే... 'ఈ క్యూట్‌నెస్' అని సమాధానం ఇచ్చాడు. ముసిముసి నవ్వుల్లో మునిగింది రష్మీ. ఆమె కూడా ఓంకార్ హెయిర్ స్టయిల్, గడ్డం స్టయిల్ బావున్నాయని పొగిడింది. ఆల్రెడీ రిలీజైన ప్రోమోలో మాస్ డాన్స్ తో వర్షిణి ఆకట్టుకుంది. రష్మీ కూడా స్టెప్పులు వేసింది. లేటెస్ట్ ప్రోమోలోనూ వాళ్లిద్దరూ 'నా తప్పు ఏమున్నదబ్బా' పాటకు స్టెప్స్ వేసిన విజువల్స్ చూపించారు. మొత్తం మీద ఈ వీకెండ్ 'సిక్స్ సెన్స్'లో రష్మీ, వర్షిణి డాన్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం పక్కా అన్నమాట.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.