English | Telugu

డాక్టర్ బాబుకు మెగాస్టార్ వాళ్ల‌మ్మ మామిడిపళ్ళు పంపిస్తుంటారు!

'కార్తీక దీపం' సీరియల్, అందులో హీరోగా నటిస్తున్న నిరుపమ్ పరిటాల గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అసలు పేరు కంటే... సీరియల్‌లో క్యారెక్టర్ పేరు కార్తీక్ కంటే... డాక్టర్ బాబుగా ఎంతో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బుల్లితెరపై హీరోగా దూసుకువెళ్తున్న ఇతడు, వెండితెరపై విలన్‌గా చేశాడనే సంగతి మీకు తెలుసా? ఇంకా నిరుపమ్ పరిటాల నిజజీవితంలో మీకు తెలియని విషయాలు...

*నిరుపమ్ పరిటాల తండ్రి ఓంకార్ రచయిత, నటుడు. ఆయన 30 సినిమాలు, 50 సీరియళ్లకు రచయితగా పని చేశారు. కొడుకు మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఓంకార్ కోరుకున్నారు. నటనపై ఆసక్తితో నిరుపమ్ ఇటు వచ్చారు.

*తండ్రి నుండి వచ్చిన వారసత్వం ఏమో! నిరుపమ్ కి కూడా డైలాగ్స్ రాయడం అంటే ఆసక్తి. టీవీస్టార్ ప్రభాకర్ దర్శకత్వం వహించిన 'నెక్స్ట్ నువ్వే' సినిమాకి మాటలు రాశాడు. అతడు నటించే సీరియళ్లకు కొన్ని సందర్భాల్లో మాటలు రాస్తుంటాడు.

* నిరుపమ్ నిర్మాత కూడా. స్నేహితుడు కృష్ణకాంత్‌తో కలిసి జీ తెలుగులో ప్రసారమయ్యే 'హిట్లర్ గారి పెళ్ళాం'ను నిర్మిస్తున్నాడు. అందులో అతడే హీరో.

*'అల్లరి' నరేష్ హీరోగా నటించిన 'ఫిట్టింగ్ మాస్టర్'లో నిరుపమ్ నెగెటివ్ రోల్ చేశాడు. ఆ సినిమా ప్లాప్ కావడంతో అతడికి అంతగా గుర్తింపు రాలేదు. సినిమాల్లో నటించాలని ఉన్నప్పటికీ... మొహమాటం వల్ల ఎవరినీ అవకాశాలు అడగలేకపోతున్నాడు. మంచి అవకాశాలు వస్తే నటించాలని అనుకుంటున్నాడు.

*సుమారు డజను సీరియళ్ళలో నిరుపమ్ నటిస్తే... దాదాపుగా అన్నిటిలో పాజిటివ్ పాత్రలే. ఒక్క 'అత్తారింటికి దారేది'లో తప్ప. అందులో నెగెటివ్ రోల్ చేశాడు. మిమ్మల్ని నెగెటివ్ రోల్ లో చూడలేమని అభిమానులు చెప్పడంతో, ఆ తర్వాత నెగెటివ్ రోల్స్ మానేశాడు.

* నిరుపమ్ నటనను పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు మెచ్చుకున్నారు. ఒకసారి బ్రహ్మానందం ఫోన్ చేసి అభినందించారు. మెగాస్టార్ చిరంజీవి మదర్ అంజనాదేవి ప్రతి వేసవికి అతడికి మామిడిపళ్ళు పంపిస్తారు. తనను అంజనాదేవిగారు సొంత కొడుకులా ఆదరిస్తారని నిరుపమ్ సంతోషం వ్యక్తం చేశాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.