English | Telugu

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.

కాసేపటికి ప్రేమ, నర్మద లోపలికి వస్తారు. షీ ఈజ్ అప్పాయింటెడ్ అని ప్రిన్సిపల్ అనగానే ప్రేమ, నర్మద షాక్ అవుతారు. అసలు జరిగింది ఏంటంటే భాగ్యం, ఆనందరావు కలిసి ఇంగ్లీష్ టీచర్ ని తీసుకొని వచ్చి కిటికీ దగ్గర ఉంచి బ్లూ టుత్ ద్వారా ప్రిన్సిపల్ అడిగే క్వశ్చన్స్ కి ఇంగ్లీష్ టీచర్ సమాధానం చెప్తుంటే శ్రీవల్లి అతను చెప్పినట్లు మాట్లాడుతుంది. ఆ తర్వాత అసలు ఎలా తీసుకున్నారని ప్రేమ, నర్మద అనుకుంటారు. అప్పుడే కిటికీ లో నుండి భాగ్యం వాళ్ళని చూస్తారు. దాంతో వాళ్లకి మొత్తం అర్థమవుతుంది. నువ్వు ఏం చేసావ్ అర్థం అయింది అక్క.. కానీ ఈ రోజు ఒక్కరోజు టార్చర్ ఉండేది కానీ సెలెక్ట్ అయ్యావ్ కాబట్టి ఇక రోజు టార్చరే అని ప్రేమ, నర్మద అంటారు.

మరొకవైపు తిరుపతి తన డ్రీమ్ గర్ల్ ని ఉహించుకొని డాన్స్ చేస్తుంటే ధీరజ్ వస్తాడు. ఈ వయసులో ఇదేంటని అంటాడు. నా ప్రేమ నీకు అర్థం కాదని తిరుపతి అంటాడు. ధీరజ్ అటుగా వెళ్తుంటే అమూల్య, విశ్వ మాట్లాడుకోవడం చూసి ధీరజ్ షాక్ అవుతాడు. ధీరజ్ దగ్గరికి వెళ్లేసరికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరొకవైపు శ్రీవల్లి క్లాస్ కి వెళ్తుంది. తనకి ఏం చెయ్యాలో అర్థం కాదు.. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే శ్రీవల్లికి ఇంకా భయం వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.