English | Telugu

Karthika Deepam2: జ్యోత్స్నకి కాశీ హెల్ప్.. శివన్నారాయణ మాటతో వాళ్ళిద్దరూ షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -548 లో.....కాశీ స్టేషన్ నుండి బయటకు వచ్చి.. వైరాకి ఫోన్ చేస్తాడు. మీరు చెప్పినట్టే చెప్పాను కానీ మావయ్యకి బెయిల్ రాదట.. మా బావ టెన్షన్ పడుతున్నాడని కాశీ అనగానే శ్రీధర్ మీ మావయ్యనా.. కార్తీక్ నీ బావనా అని వైరా షాక్ అవుతాడు. వెంటనే నాకెందుకు చెప్పలేదని అంటాడు. చెప్పే అవసరం రాలేదని కాశీ అంటాడు. సరే నువ్వు ఏం తప్పు చెయ్యలేదు భయపడకు అని కాశీకి ధైర్యం చెప్తాడు వైరా.

అప్పుడే కాశీ దగ్గరికి కార్తీక్ వస్తాడు. పర్ ఫెక్ట్ గా మా నాన్నమాటలు ఎందుకు రికార్డు చేసావని కార్తీక్ అడుగుతాడు. నా దంట్లో ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఉందని కాశీ అనగానే అయితే ఇప్పుడు మాట్లాడిన కాల్ రికార్డు చూపించమని కార్తీక్ అడుగుతాడు. డిలీట్ చేసానని చెప్తూ కాశీ భయపడుతాడు. కొడుకు దూరంగా ఉన్నాడని అల్లుడిలో కొడుకుని చూసుకుందామనుకొని తన దగ్గర పెట్టుకున్నాడని కార్తీక్ అంటాడు. నేను జాబ్ కి రిజైన్ చెయ్యాలి అనుకుంటున్నానని లెటర్ ఇస్తాడు కాశీ. ఆఫీస్ లో ఇవ్వమని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ కి కాంచన ఫోన్ చేసి శ్రీధర్ గురించి టెన్షన్ పడుతుంది. నాన్న తప్పు చేసాడంటే నువ్వు నమ్ముతున్నావా అని కార్తీక్ అడుగుతాడు. లేదని కాంచన అంటుంది. నేను నాన్నని బయటకు తీసుకొని వస్తానని కార్తీక్ అంటాడు. మరొకవైపు జ్యోత్స్న తప్పుడు లెక్కల ఫైల్స్ అన్ని కాశీ తీసుకుంటాడు. అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. అక్క ఇన్ని రోజులకి ఒక పెద్ద హెల్ప్ చేసావ్.. నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను.. తప్పుడు లెక్కల ఫైల్స్ అన్నీ నేను తీసుకున్న కలిసినప్పుడు ఇస్తానని చెప్పగానే థాంక్స్ తమ్ముడు.. ఇక నుండి నువ్వు నా సొంత తమ్ముడు అని జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత కార్తీక్, శివన్నారాయణ ఇంటికి వస్తారు. కార్తీక్ దగ్గరికి దీప వచ్చి మాట్లాడుతుంది. ఏంటి బావ అన్నీ ఒకేసారి.. ఇంకా అమ్మ వాళ్ళు హాస్పిటల్ నుండి రాలేదు.. మావయ్య గారు స్టేషన్ లో అని బాధపడుతుంది. కాశీ గురించి చెప్తే ఇంకా బాధపడుతావని చెప్పట్లేదని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత రెస్టారెంట్ నుండి మేనేజర్ వచ్చి ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి ఫుడ్ లో కల్తీ జరిగిందని ఫైన్ వేశారని చెప్తాడు. దాంతో అంతటికి కారణం శ్రీధర్ అని పారిజాతం, జ్యోత్స్న తిడుతారు. మీరు ఏమనుకున్నా పట్టించుకోను.. మా నాన్న తప్పు చెయ్యలేదని నమ్మాల్సిన వాళ్ళు నమ్మితే చాలని కార్తీక్ అనగానే తాత నువ్వు, మావయ్య తప్పు చెయ్యలేదని నమ్ముతున్నావా అని జ్యోత్స్న అనగానే లేదని శివన్నారాయణ అంటాడు. దాంతో కార్తీక్, దీప షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.