English | Telugu

శివాజీ కామెంట్స్ పై చిన్మయి ఫైర్..కాలికి మెట్టెలు పెట్టుకో..!

ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శివాజీ రీసెంట్ గా హీరోయిన్ ల వస్త్రాల గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు శివాజీ కామెంట్స్ మీద చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయ్యారు. ఆమె ఒక పోస్ట్ పెట్టారు. "తెలుగు నటుడు శివాజీ 'దరిద్రపు ముండా' వంటి పదాలను ఉపయోగిస్తూ హీరోయిన్ లు తమ సామానులు కవర్ చేసుకోవడానికి చీరలు ధరించాలి అంటూ అనవసరమైన సలహా ఇవ్వడం ఏమిటి.

నటుడు శివాజీ ఒక అద్భుతమైన చిత్రంలో విలన్‌గా నటించాడు మరియు చివరికి హీరోగా మారాడు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇవన్నీ ప్రొఫెషనల్ ప్రదేశాలు..అక్కడ ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా. ఆయన జీన్స్, హూడీలు వేసుకోకుండా ధోతీలు మాత్రమే కట్టుకుని భారతీయ సంస్కృతిని అనుసరించాలి కదా. బొట్టు పెట్టుకోవాలి అలాగే అతనికి వివాహం అయ్యుంటే పెళ్లి ఐనందుకు గుర్తుగా కంకణం, కాలికి మెట్టెలు ధరించాలి కదా. ఇక్కడ మహిళల్ని ఎంతో ఘోరంగా చూస్తున్నారో" అంటూ ఆమె పెట్టిన ఒక వ్యంగ్యాత్మక ఘాటైన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.